Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
విపరీతంగా పెరిగిపోతున్న కండ్లకలక కేసులు - ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీకూ రావొచ్చు సుమీ!
వర్షాకాలం వస్తోందంటే చాలు అనేక రకాల అంటు వ్యాధులతో పాటు కండ్ల కలక కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ ఏడాది కండ్ల కలక కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయ. పూణేలో ఒక్క రోజులోనే 2,300 కండ్ల కలక కేసులు నమోదు అయ్యాయి.
ఇక ఢిల్లీలో గతేడాదితో పోలిస్తే మూడు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఎడతెగని వర్షాలు, తేమతో కూడిన వాతావరణం, కలుషిత నీరు.. ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ వ్యాప్తి చెందేందుకు అనువైన పరిస్థితులను కల్పించాయి. వీటి వల్లే కంటి ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్నాయి.

కళ్లు ఎర్రగా మారి వాచిపోతాయి..!
కంటి కలకను ఐ ఫప్లా లేదా పింక్ ఐ అని పిలుస్తుంటారు. ఈ సమస్య వచ్చే కళ్లు ఎర్రగా మారిపోతియా. దురద కూడా వస్తుంది. తెల్లని పదార్థాన్ని స్రవిస్తాయి. కంటి నుంచి ఎడతెరిపి లేకుండా మీరు కారుతూ ఉంటుంది. కంటి రెప్పలు ఉబ్బిపోయే అవకాశం ఉంది. ఇది ఒక కంటికి వచ్చి రెండో కంటికి కూడా సోకే ఛాన్స్ ఉంటుంది. కళ్లు వాచినట్లు అవుతాయి. అధిక తేమ వల్ల కూడా కండ్ల కలక వస్తుంటుంది. ఇది రాకుండా ఉండాలంటే చాలానే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కళ్ల సమస్యతో ఇబ్బందులు తప్పవు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..!
కండ్లకలక రాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా చేతులు, ముఖం కడుక్కుంటూ ఉండాలి. కళ్లను తరచూ తాకకూడదు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చేతి రుమాళ్లను ఇతరులతో అస్సలే పంచుకోకూడదు. కండ్ల కలక అనేది ఒక కంి ఇన్ఫెక్షన్. ఇది కళ్లు ఉబ్బేందుకు కారణం అవుతుంది. వర్షాకాలంలో అనేక కారణాల వల్ల కండ్లకు ఈ సమస్య వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. వర్షాకాలంలో పారిశుధ్ధ్యం సరిగా ఉండదు. దీని వల్ల నీటి వనరులు కలుషితం అవుతాయి. ఆ కలుషితమైన నీటిలో బ్యాక్టీరియా ఉండొచ్చు.
తేమలో బ్యాక్టీరియా, వైరల్ వల్లే కంటి ఇన్ఫెక్షన్లు
ఆ నీటితో ముఖం కడుక్కోవడం వల్ల కంటిలోకి హానికరమైన సూక్ష్మ జీవులు చేరి కండ్ల కలక వంటి ఇన్ఫెక్షన్లకు దారి తీయవచ్చు. అలాగే వానా కాలంలో గాలిలో ఫంగస్, ఇతర అలర్జీ కారకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లను తాకినప్పుడు కండ్ల కలక వస్తుంది. వాతావరణంలో తేమ శాతం కూడా ఎక్కువే ఉంటుంది. ఆ తేమలో వైరస్ లు, బ్యాక్టీరియాలు అత్యధికంగా ఉంటాయి. ఈ పేరిగిన తేమ కంటి ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంటుంది.
ఎప్పటికప్పుడూ ఇల్లంతా క్లీన్ చేసుకోవాల్సిందే!
కండ్ల కలక బారిన పడకుండా ఉండాలంటే సబ్బుతో చేతులను క్రమం తప్పకుండా కడుక్కోవాలి. ముఖ్యంగా మీ చేతులు కళ్లను పదే పదే తాకకూడదు. కళ్లను రుద్దడం వంటివి చేయకూడదు. దుమ్ము, ధూళి కళ్లల్లో పడకుండా చూసుకోవాలి. వానా కాలంలో బయటకి వెళ్తున్నట్లు అితే కంటికి గ్లాసెస్ పెట్టుకోవడం ముఖ్యం. నివాస స్థలం కూడా శుభ్రంగా దుమ్ము ధూలి లేకుండా చూస్కోవాలి. పరుపులు, కార్పెట్లు అనేవి తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications