Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఫహాద్ ఫాజిల్‌కు వచ్చిన ఏడీహెచ్‌డీ లక్షణాలు ఇలా వుంటాయ్.! చికిత్స లేదంటున్న వైద్యులు..!
కేరళలో పాపులర్ స్టార్‌గా ఎదుగుతూ పుష్పతో తెలుగు అభిమానులను కూడా సంపాదించుకున్న ఫహాద్ ఫాజిల్ ఏడీహెచ్‌డీ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ఇటీవల చికిత్స కూడా తీసుకున్నట్లు ఆయన ప్రజలకు తెలిపారు. తన నటనతో అన్ని భాషల ప్రేక్షకులను ఇట్టే ఆకటున్నకుంటున్న ఫహాద్ ఫాజిల్‌కు వచ్చిన వ్యాధి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
ఇప్పుడు ఫహాద్ ఫాజిల్ వయసు 41 సంవత్సరాలు. చాలా ఏళ్ల తరువాత తనకు ఈ వ్యాధి ఉన్నట్లు తెలిసిందని పుష్ప విలన్ చెప్పుకొచ్చారు.
ఏడీహెచ్‌డీ అనేది ఒక మానసిక వ్యాధి. దీన్ని అటెన్షన్ డెఫిసిట్, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని అంటారు. ఈ వ్యాధి సోకినవారు పనులను హడావిడిగా పూర్తి చేయాలని అనుకుంటారు. ఈ ఏడీహెచ్‌డీ సమస్యను చిన్న వయసులోనే గుర్తిస్తారు. ఏకాగ్రతను నిలుపుకోలేకపోవడం ఈ వ్యాధి లక్షణాల్లో ఒకటి.

కొన్ని వ్యాధులకు చికిత్స లేనట్టే, ఈ ఏడీహెచ్‌డీి కూడా చికిత్స లేదని అంటున్నారు. అయితే చిన్న వయసులోనే ఈ వ్యాధిని గుర్తించడం వల్ల వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశం వుందని అంటున్నారు.
ఈ ఏడీహెచ్‌డీ పిల్లల్లో పెద్దల్లో రెండు రకాలుగా వుంటుంది. ఈ ఏడీహెచ్‌డీ లక్షణాలు :
అజాగ్రత్త
ఈ ఏడీహెచ్‌డీ వల్ల ఉన్నట్టుండి శ్రద్దను కోల్పోతారు. ఒక విషయంపై ఏకాగ్రతను నిలపలేరు. ఇతరులు ఏదైనా చెబితే దాన్ని వెంటనే అర్ధం చేసుకోలేరు. ఎవ్వరు సూచనలు ఇచ్చినా పాటించరు, చాలా విషయాలను తేలికగా మర్చిపోతూ వుంటారు. రోజూ చేసే మామూలు పనులను కూడా చేయలేరు. ఊహల్లో ఎక్కువగా వుంటూ ఉంటారు.
హైపర్ యాక్టివ్
మనిషి ప్రశాంతంగా కనిపించడు, ఎప్పుడూ ఆందోళన చెందుతూనే వుంటాడు. మౌనంగా వూంటూ పనులు చేయలేరు. ఎప్పుడూ కోపంతో రగిలిపోతూ వుంటారు. అతిగా మాట్లాడుతూ వుంటారు. ఇతరులు ఏమి మాట్లాడుతున్నారో కూడా పట్టించుకోకుండా సమాధానాలు చెబుతారు. ఈ అజాగ్రత్త, హైవర్ యాక్టివ్ లక్షణాలు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ వుంటుంది.
ఇక పెద్దల్లో ఏడీహెచ్‌డీ లక్షణాలు వేరే విధంగా వుంటాయ్. ఏడీహెచ్‌డీ వున్న వాళ్లు ఏపనిని అప్పగించినా చాలా నెమ్మదిగా పూర్తిచేస్తారు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం రాదు. చిన్న విషయాలకు కూడా బాగా ఊగిపోతూ వుంటారు. చాలా సులభంగా నిరత్సాహానికి గురౌతారు. చాలా విషయాల్లో విసుగు చెందుతూ వుంటారు. ఒక పుస్తకాన్ని శ్రధ్ద పెట్టి చదవలేరు. తీవ్రమైన డిప్రెషన్‌లో వుంటారు.
ఏడీహెచ్‌డీకి కారణాలు ఏంటి ?
ఏడీహెచ్‌డీకి అసలైన కారణాలను వైద్యులు ఇంకా కనుగ్గొనలేదు. వారసత్వంగా కూడా ఏడీహెచ్‌డీ వచ్చే అవకాశం వుందని అంటున్నారు. గర్భిణులు తాను గర్భధారణలో వున్నప్పుడు మద్యం తాగినా, సిగరెట్ తాగినా పిల్లలకు ఏడీహెచ్‌డీ వచ్చే అవకాశం వుందంటున్నారు. మెదడుకు గాయమైతే కూడా ఏడీహెచ్‌డీ వచ్చే అవకాశం వుందంటున్నారు. 9 నెలలు పూర్తిగా నిండకుండా పిల్లలు పుట్టినా వారికి ఏడీహెచ్‌డీ వుంటుందని అంటున్నారు. చిన్నవయసులో విషపూరితమైన వాతావరణంలో పెరగడం వల్ల కూడా ఏడీహెచ్‌డీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా వున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఫహాద్ ఫాజిల్‌కు ఏడీహెచ్‌డీ వుందని తెలియగానే నెటిజన్లందరూ ఈ వ్యాధి గురించి ఇంటర్నెట్‌లో విస్తృతంగా వెతకడం ప్రారంభించారు. అయితే ఈ మానసిక వ్యాధికి సంపూర్ణ చికిత్స లేదని ప్రస్తుత వైద్యులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
