Latest Updates
-
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. !
ముల్లంగి ఆకుల్లో ఇంత మ్యాటర్ ఉందా? ఇది తెలిస్తే వదిలిపెట్టరుగా
చలికాలంలో ముల్లంగిని ఎక్కువగా తింటారు. అయితే ముల్లంగి ఆకులను మాత్రం పనికిరానిదిగా భావించి పడేస్తుంటారు. కొంతమందికి ముల్లంగిని చూస్తే అబ్బా అంటారు. దీనిని తినేందుకు ఇష్టపడరు. అయితే దీని ప్రయోజనాల గురించి తెలిసినోళ్లు మాత్రం తినడం మానరు.
అయితే ముల్లంగి కంటే ముల్లంగి ఆకులే ఎక్కువ ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగిస్తాయని మీకు తెలుసా? ఈసారి మార్కెట్ నుంచి ముల్లంగిని తీసుకొస్తే ముల్లంగితో పాటు దాని ఆకులను కూడా తినండి. ముల్లంగి ఆకులలో ఉండే పోషకాలు, వాటి ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.

ముల్లంగి ఆకుల్లో ఉండే పోషకాలు
ముల్లంగి ఆకులలో ఫైబర్, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, సి, బి9, సోడియం, మెగ్నీషియం, క్లోరిన్, కార్బోహైడ్రేట్లు మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. ముల్లంగి ఆకులను తీసుకోవడం వల్ల పైల్స్, హై బ్లడ్ షుగర్, గుండె జబ్బులు, మధుమేహం మొదలైన అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చు.
ముల్లంగి ఆకులను తినడం వల్ల ప్రయోజనాలివే
-ముల్లంగిలో కంటే ముల్లంగి ఆకుల్లో ఎక్కువ పోషకాలు కనిపిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు కఠినమైన వ్యాధులు, పైల్స్, హై బ్లడ్ షుగర్ మొదలైన వాటి నుండి రక్షిస్తాయి.
-పైల్స్ సమస్య ఉన్నవారికి ముల్లంగి ఆకులు ప్రయోజనకరంగా ఉంటాయి. ముల్లంగి ఆకులు తింటే శరీరంలో మంట సమస్య దూరమవుతుంది. ముల్లంగి ఆకుల్లో కేలరీలు తక్కువగానూ, పీచుపదార్థాలు ఎక్కువగానూ ఉంటాయి. ఇందులో విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి,ఇవి శరీర అవసరాలను తీరుస్తాయి.
- ముల్లంగి ఆకులు డయాబెటిస్ పేషెంట్లకు కూడా ఆరోగ్యకరం. హై షుగర్ కారణంగా మధుమేహాన్ని నియంత్రించడం కష్టం అవుతుంది. అటువంటి పరిస్థితిలో ముల్లంగి ఆకులను ఏదో ఒక రూపంలో తినాలి. ఇందులో ఉండే పోషకాలు శరీరంలో తెల్ల కణాలను పెంచుతాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది, దీని కారణంగా శరీరంలో చక్కెర స్థాయి ప్రభావితం కాదు. ఇది రక్తంలో చక్కెర శోషణను(absorption) కూడా నియంత్రిస్తుంది.
-ముల్లంగి ఆకులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరంలోని రక్తం శుద్ధి అవుతుంది. దీంతో మొటిమలు, దురదలు, దద్దుర్లు మొదలైన చర్మ సంబంధిత వ్యాధులు దరిచేరవు. ఇది స్కర్వీ వ్యాధిని కూడా నివారిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్ సమస్యలు దూరమవుతాయి.
-దీనివల్ల తక్కువ రక్తపోటు సమస్యను నయం చేయవచ్చు. ఇందులో అధిక మొత్తంలో సోడియం ఉంటుంది.. ఇది శరీరంలో ఉప్పు లోపాన్ని తొలగిస్తుంది.
-మీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకుంటే ముల్లంగి ఆకులను కూడా తినవచ్చు. ఇందులో విటమిన్ సి, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. శరీరంలో రక్తహీనత, హిమోగ్లోబిన్ లోపం కూడా నయమవుతుంది.
- ముల్లంగిలో క్యాలరీలు తక్కువగా నీటి శాతం ఎక్కువగా ఉటుంది. అందువల్ల వీటిని తింటే బరువు తగ్గాలనుకునే వారికి చాలా మేలు జరుగుతుంది. ముల్లంగిని తినడం వల్ల ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. దీంతో ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
