Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
చలికాలంలో దురద, చర్మం పొడిబారుతోందా? మీ స్నానంలో ఈ 2 మార్పులు చేయండి
చలికాలం వచ్చిందంటే చాలా మందికి చర్మం పొడిబారడం, దురద పెట్టడం వంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సమస్యకు కారణం కేవలం పొడి వాతావరణం మాత్రమే కాదు, మనం తెలియకుండా చేసే కొన్ని స్నానపు పొరపాట్లు కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
దురదకు అసలు కారణం ఏమిటి?
మన చర్మం పైన కంటికి కనిపించని ఒక సహజ రక్షణ కవచం ఉంటుంది. ఇది మన చర్మంలోని తేమ బయటకు పోకుండా, బయటి కాలుష్యం లోపలికి రాకుండా కాపాడుతుంది. వాతావరణంలోని మార్పులు, మనం వాడే సబ్బులు, నీటి ఉష్ణోగ్రత వంటి కారణాల వల్ల ఈ రక్షణ కవచం బలహీనపడుతుంది.

అప్పుడు చర్మం తన సహజ తేమను కోల్పోయి, అత్యంత సున్నితంగా మారుతుంది. అలాంటి సమయంలో బట్టలు రాసుకున్నా లేదా చిన్నపాటి ఘర్షణ జరిగినా చర్మం తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. దాని ఫలితమే ఈ తీరని దురద,మంట. ఈ సమస్యను అధిగమించడానికి రెండు ముఖ్యమైన చిట్కాలను పాటిస్తే చాలు.
అతివేడి నీళ్లకు నో
చల్లటి వాతావరణంలో వేడి వేడి నీళ్లతో స్నానం చేయాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ ఆ ఆనందం తాత్కాలికమే. అతివేడి నీరు చర్మంపై ఉండే సహజ నూనెలను పూర్తిగా కరిగించి, తొలగిస్తుంది. దీనివల్ల చర్మం మరింత పొడిగా, నిర్జీవంగా మారి దురద సమస్య రెట్టింపు అవుతుంది.
అందుకే స్నానానికి ఎప్పుడూ అతివేడి నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించండి. ఇది మీ చర్మం సహజ నూనెల పొరను కాపాడి, దురదను అదుపులో ఉంచుతుంది.
తేమను బంధించడం
స్నానం చేసిన తర్వాత మన చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది. కానీ టవల్ లేదా కండువాతో తుడుచుకున్న కొద్దిసేపటికే మళ్లీ పొడిబారిపోతుంది. ఇక్కడే మనం అసలైన ఉపాయాన్ని ప్రయోగించాలి. స్నానం చేసిన వెంటనే చర్మం ఇంకా కొద్దిగా తేమగా ఉన్నప్పుడే మంచి మాయిశ్చరైజర్ లేదా బాడీ లోషన్ రాయాలి.
ఇది చర్మంపై ఒక పొరలా ఏర్పడి, స్నానం వల్ల అందిన తేమను బయటకు పోకుండా బంధిస్తుంది. మీరు సహజసిద్ధమైన కొబ్బరి నూనె, బాదం నూనె వంటివి కూడా వాడవచ్చు. ఇది చర్మానికి పోషణనిచ్చి రోజంతా మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. పొడిబారడం, దురద వంటి సమస్యలు దరిచేరవు.
దురద నివారణకు మరికొన్ని హోం రెమెడీస్
-స్నానం చేసే నీటిలో కొన్ని వేపాకులను వేసి మరిగించి, ఆ నీటితో స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
-గంధపు పొడిని రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్ లా చేసి దురద ఉన్న చోట రాసుకుంటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
-ముల్తానీ మిట్టిని నీటితో కలిపి చర్మానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగేయండి. ఇది చర్మాన్ని శుభ్రపరిచి దురదను తగ్గిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
