Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
యాభై ఏళ్ల వయసులోనూ యాక్టివ్‌గా ఉండాలంటే అబ్బాయిలు 30ల్లో తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్ ఇవే.!
ఆధునిక జీవనశైలిలో చోటుచేసుకున్న వివిధ మార్పుల కారణంగా ముప్పై ఏళ్ల వయసులోనే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా అబ్బాయిలు శారీరకంగా, మానసికంగా ఫిట్‌నెస్ కోల్పోతున్నారు. దీని ఫలితంగా ఉద్యోగంలో ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఇక ముప్పై దాటాక పరిస్థితి మరింతగా దిగజారిపోతుంది. ఈ క్రమంలో వయసు పెరుగుతున్న కొద్దీ పురుషులు ఫిట్‌నెస్ కోల్పోకుండా ఉండాలంటే తమ డైట్‌లో ఈ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి అని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

అబ్బాయిలకు 20 నుంచి 30 మధ్య వయసు చాలా కీలకం. ఉద్యోగం, వ్యాపారం ఇలా కెరీర్ పరంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇది సరైన సమయం. ఈ వయసులో బ్రెయిన్ ఒత్తిడికి గురికాకుండా షార్ప్‌గా పనిచేయడం అవసరం. ఇందుకోసం తమ డైట్‌లో తప్పనిసరిగా అవిసె గింజలు చేర్చుకోవాలి. ఇందులో ఒమెగా- 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉదయం లేదా రాత్రి భోజనం సమయంలో 250 నుంచి 500 మి.గ్రా తీసుకోవడం ద్వారా మెదడు పనితీరు చురుగ్గా ఉంటుంది.
కండరాల బలానికి
ఆహారపు అలవాట్ల కారణంగా 30 ఏళ్ల వయసులోనే మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు మొదలవుతున్నాయి. ఈ ఏజ్‌లో కండరాలు బలంగా ఉండాలంటే అబ్బాయిలు తమ డైట్‌లో కోకో గింజలను చేర్చుకోవాలని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే మెగ్నీషియం కండరాలను ఉత్తేజపరుస్తుంది. రోజూ సాయంత్రం సమయంలో 400 మి.గ్రా మోతాదులో తీసుకోవాలి.
ఇమ్యూనిటీ కోసం
ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం, సరైన నిద్ర లేకపోవడం, పని వేళల కారణంగా ఈ వయసులో జీర్ణవ్యవస్థ సమస్యలు మొదలవుతాయి. రోగ నిరోధక శక్తి తగ్గిపోవడంతో మెటబాలిజం సరిగ్గా ఉండదు. ఇందుకోసం ప్రొబయాటిక్స్ పుష్కలంగా ఉండే పులియబెట్టిన ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ప్రతి రోజూ పరగడపున కొద్ది మొత్తంలో తీసుకోవాలని చెబుతున్నారు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

గుండె ఆరోగ్యం కోసం
ఈ రోజుల్లో కొందరు ముప్పై ఏళ్ల వయసులోనే గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా హార్ట్ స్ట్రోక్‌కి గురై తమ జీవితాన్ని ముగించేసుకుంటున్నారు. ఈ వయసులో గుండె ఆరోగ్యం కోసం, శక్తి కోసం రోజూ గుప్పెడు పల్లీలను తీసుకోవాలని సూచిస్తున్నారు. రాత్రంతా నానబెట్టిన పల్లీలు ఉదయాన్నే తినడం ద్వారా ఇందులోని కోఎంజైమ్ Q10 గుండె పనితీరుకు దోహదపడుతుంది.
హార్మోన్ల సమతుల్యత
హార్మోన్ల అసమతుల్యత కారణంగా పురుషులు ఎక్కువగా ఈ వయసులో సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. టెస్టోస్టెరాన్ స్థాయిలు తగ్గిపోవడంతో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా రోజూ ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ సమయంలో 11గ్రాముల చొప్పు గుమ్మడి గింజలను వేయించుకుని తినాలని సూచిస్తున్నారు. వీటిలో జింక్ పుష్కలంగా ఉండటంతో హార్మోన్ల బ్యాలెన్సింగ్‌కి దోహదపడుతుంది. రోజూ పడుకునే ముందు గోరువెచ్చని పాలలో పసుపు వేసుకుని తాగడం ద్వారా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. అంతే కాకుండా శరీరంలో వాపులను తగ్గిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
