Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
షాకింగ్ : మహిళ కడుపులోంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 570 రాళ్లను తొలగించిన డాక్టర్లు..
ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ మహిళ కడుపులో వందలాది రాళ్లు కనిపించడం వైద్యులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది.
కడుపునొప్పితో బాధపడుతున్నది
అల్లవరం మండలం దేవగుప్తానికి చెందిన జాలేం నరసవేణి అనే మహిళ కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది.

వైద్యం చేయించుకున్నా ఫలితం లేదు
కడుపునొప్పితో ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకున్నా, ఎన్ని మందులు వాడిని ఆ మహిళకు ఉపశమనం కలగలేదు. నొప్పి విపరీతంగా పెరగడంతో ఆమెను అమలాపురంలోని ఏఎస్ ఏ ఆస్పత్రిలో చేర్పించారు.
పిత్తాశయంలో రాళ్లు కనుగొన్నారు
ఆమెను క్షుణంగా పరీక్షించిన డాక్టర్లు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఒకటి కాదు రెండు కాదు వందల్లో పిత్తాశయంలో రాళ్లు కలనిపించాయి. వెంటనే అత్యవసర శస్ర్త చికిత్స గురించి కుటుంబ సభ్యులకు వివరించారు.
శస్త్ర చికిత్స
కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఆమెకు వైద్యులు అత్యవసర శస్త్రచికిత్స చేశారు.
ఈ శస్త్రచికిత్స తర్వాత వైద్యులు మహిళ పిత్తాశయం నుండి 570 రాళ్లను ఒక్కొక్కటిగా తొలగించారు. ఇంత పెద్ద సంఖ్యలో రాళ్లను చూసిన వైద్యులు ఆశ్చర్యపోయారు.
సాధారణంగా 10 నుండి 20 రాళ్లు కనిపిస్తాయని, ఇంత పెద్ద సంఖ్యలో రావడం ఇదే మొదటి సారని డాక్టర్ చెప్పారు. అయితే సరైన సమయానికి ఆ మహిళను ఆసుపత్రిలో చేర్చడం వల్ల ఆపరేషన్ చేయడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం లేదంటున్నారు వైద్యులు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications