Latest Updates
-
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.!
1 Man-40 Wives: 40 మంది స్త్రీలకు ఒక్కడే మొగుడు, అధికారులకు షాకిచ్చిన రెడ్ లైట్ ఏరియా
ఒక వ్యక్తికి ఒక్కరికి మించి భార్యలు ఉండటం పెద్ద విశేషమేమీ కాదు. అలాంటి వారిని చాలా మందినే చూసుంటాం. ఒక్క వ్యక్తికి ముగ్గురు, నలుగురు, 10 మంది కూడా భార్యలు ఉన్న వార్తలు పలు సందర్భాల్లో చూసినవే.
అయితే బిహార్ లో ఓ వ్యక్తికి ఏకంగా 40 మంది భార్యలు ఉన్నారు. సారీ, 40 మంది మహిళలకు ఒక్కడే భర్త ఉన్నాడు అనడం కరెక్టు. ఏంటి అంత మందికి ఒక్కడే భర్తనా.. అని మీక్కూడా అనిపిస్తుందా.. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అదో రెడ్‌లైట్ ఏరియా..
బిహార్ ప్రభుత్వం రాష్ట్రంలో రెండో దశ కులగణన చేస్తోంది. ఇందులో భాగంగా అధికారులు బిహార్ అర్బన్ ఏరియాలోని రెడ్ లైట్ ఏరియా వార్డు నంబర్ 7లోకి వెళ్లారు. విధుల్లో భాగంగా అందరి వివరాలు సేకరిస్తున్నారు.
వారు పేరు, భర్త పేరు, తల్లిదండ్రులు ఇలా పేర్లు రాసుకుంటూ విధులు కొనసాగిస్తున్నారు. మహిళలు వారి భర్తల పేర్లు రాసుకుంటుండగా ఎక్కడో ఏదో తేడాగా అనిపించింది. ఒక పేరు పదే పదే వినిపిస్తోంది. చాలా మంది అంటే దాదాపు 40 మంది మహిళల భర్తల పేరు ఒకటే ఉంది.
అదే రూప్ చంద్. పిల్లలను అడిగినా వారు కూడా తమ తండ్రి పేరు రూప్ చంద్ అనే చెబుతున్నారు. ఎవరీ రూప్ చంద్ 40 మంది స్త్రీలకు అతడొక్కడే భర్తనా..? ఇంత మంది పిల్లలకు అతడొక్కడే తండ్రా..? అనే ఆలోచనలో పడ్డారు అధికారులు.
అభిమానంతో మొగుడ్ని చేసేసుకున్నారు:
అసలు రూప్ చంద్ ఎవరో అధికారులు ఆరా తీయడం మొదలు పెట్టారు. రూప్ చంద్ అనే వ్యక్తి ఆ రెడ్ లైట్ ఏరియాలోనే ఉంటాడు. చాలా కాలంగా అక్కడే ఉంటూ డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ అందరినీ అలరిస్తూ ఉంటాడు రూప్ చంద్.
ఆ రెడ్ లైట్ ఏరియాలో రూప్ చంద్ కు ఇల్లు కూడా లేదు. రోజూ ఎక్కడో ఒక దగ్గర ఉంటూ జీవితాన్ని గడిపేస్తుంటాడు. అంతడి మంచి మాట, వ్యక్తిత్వం అంటే అక్కడ ఉండే వారికి చాలా ఇష్టం అలా రూప్ చంద్ పై వాళ్లంతా అభిమానం పెంచేసుకున్నారు.
అధికారులు కుల గణన కోసం వచ్చినప్పుడు 40 మంది మహిళలు కూడా రూప్ చంద్ పై ఉన్న అభిమానంతోనే అతడి పేరును భర్తగా నమోదు చేయించుకున్నారు. పిల్లలు కూడా రూప్ చంద్ తో ఎంతో సరదాగా గడుపుతుంటారు. వాళ్లందరికీ రూప్ చంద్‌తో ఉండటం చాలా ఇష్టం. అలా రూప్ చంద్ 40 మంది మహిళలకు భర్తగా మారాడు. వారి పిల్లలకు తండ్రిగా మారాడు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
