Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఉప్పు ఎక్కువగా తింటున్నారా..? ఐతే ఈ లక్షణాలు కనిపిస్తాయ్ జాగ్రత్త..!
ఉప్పు మన జీవితంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రోజూ నీరు తాగినట్టు భోజనం చేసినట్లు మన శరీరంలో ఎంతో కొంత ఉప్పుడు ఆహారం ద్వారా లోపలికి వెళ్లాల్సిందే. కొందరు ఉప్పు చాలా తక్కువగా తింటారు. ఇంకొందరు చాలా ఎక్కువగా తింటారు. ఆరోగ్యంగా ఉండాలంటే అయోడిన్ కూడా అవసరమే. అది ఉప్పు ద్వారానే వస్తుంది. అయితే ఎక్కువ ఉప్పు శరీరానికి మంచిది కాదు. ఆహారంలో ఉప్పు ఎంత మోతాదులో తినాలి, ఉప్పు ఎక్కువ తినడం వల్ల ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయ్, ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలనే విషయాలను తెలుసుకుందాం.
కొందరు భోజనం చేసేసమయంలో కూరలో ఉప్పు వేసనా మళ్లీ ప్రత్యేకంగా ఉప్పు తెచ్చుకొని అన్నంలో కలుపుకొని తింటారు. ఇది అలవాటుగా మారుతుంది. ఇలా తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయ్. ఉప్పు ఎక్కువ తినడం వల్ల కనిపించే లక్షణాలు ఎలా వుంటాయో చూద్దాం.
రక్తపోటు పెరుగుతుంది
ఉప్పు ఎక్కువగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది, దీనినే మనం హైపర్ టెన్షన్ అని కూడా పిలుస్తాం. ఈ హైపర్ టెన్షన్ వల్ల గుండెపోటు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.

కిడ్నీలపై ఒత్తిడి
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి కలుగుతుంది. సోడియం స్థాయిలను అదుపుచేసే ప్రక్రియను కిడ్నీలు చేపడతాయ్. సోడియం ఎక్కువ అవడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగి కిడ్నీలు డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీంతో కిడ్నీల్లో రాళ్లు వచ్చే అకవాశాలు ఉన్నాయ్.
జీర్ణ సమస్య
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా ఎక్కువయ్యే పరిస్థితి వుంటుంది. భోజనం చేయగానే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. ఎక్కువ ఆహారం కూడా తినాలని అనిపించదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్లే అసిడిటీ లాంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయ్.
డీహైడ్రేషన్
ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్. శరీరంలో ఉన్న నీటిని మొత్తం ఉప్పు పీల్చివేసుకుంటుంది. చెమట ద్వారా మొత్తం బయటకు వచ్చేస్తుంది. దీంతో దాహం ఎక్కువగా వేసి డీహైడ్రేట్ అవుతుంది.
డయాబెటిస్
ఉప్పు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ స్థాయి, గ్లూకోజ్ లెవెల్ష్ దెబ్బతింటాయ్. ఎక్కువ ఉప్పు తీసుకుంటే రక్తపోటు ఎక్కువవుతుంది. దీంతో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలున్నాయ్. ఉప్పు ఎక్కువగా తినేవారిలో టైప్ 2 డయాబెటిస్ కేసులు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలింది. కాబట్టి ఉప్పును తగ్గించాలి.
ప్రతీ రోజూ 2 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవద్దని పరిశోధకులు చెబుతున్నారు. ఒక వేల తీసుకుంటే పై లక్షణాలు వచ్చి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయ్. ఎంత ఎక్కువ ఉప్పు తింటే అన్ని సమస్యలని మనము అర్థం చేసుకోవాలి.
ఉప్పుతో ప్రయోజనాలు
అప్పుడప్పుడూ నోటి అల్సర్లు వస్తుంటాయ్. పెదవి లోపల కురుపులు వచ్చి మంటగా వుంటాయ్. అప్పుడు కొంత ఉప్పు తీసుకొని ఆ కురుపుపై రాసినప్పుడు మంట తగ్గుతుంది.
గోరు వెచ్చని నీళ్లల్లో కొంత ఉప్పు వేసుకొని ఉదయాన్నే పుక్కిలించడం వల్ల గొంతు శుభ్రంగా అవుతుంది. గొంతులో గరగరగా ఉన్నా కొంత మంటగా ఉన్నా కూడా ఈ చిట్కా బాగా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications