Latest Updates
-
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.!
ఈ 5 వైట్ ఫుడ్స్‌కు వీలైనంత దూరంగా ఉండండి.. ఎందుకో తెలుసా?
ప్రతి మనిషికి చాలా అవసరమైనది, అత్యంత ముఖ్యమైనది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, మెరుగుపరచుకోవడంలో ఆహారానిదే కీలక పాత్ర. వ్యాయామం ఎంత చేసినప్పటికీ.. సరైన ఆహారం తీసుకోకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆరోగ్యం విషయానికి వస్తే.. చాలా మంది వైద్య నిపుణులు చెప్పే మాట తెలుపు రంగు ఆహారాలకు దూరంగా ఉండాలని. తెల్లని రంగు ఆహారాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల కంటే.. అనార్థాలే ఎక్కువ అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
కొన్ని రకాల వైట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల క్యాన్సర్, రక్తపోటు, ఎముక ఆరోగ్యం క్షీణించడం, ఎక్కువ కేలరీల వల్ల బరువు పెరగడం, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

పాశ్చరైజ్డ్ ఆవు పాలు
పాశ్చరైజేషన్ ప్రక్రియ వల్ల పాలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి. కానీ పాలలోని పోషకాలు తొలగిపోతాయి. పాలలోని ఎంజైమ్ లు, విటమిన్ ఏ, బి 12, సి లు తొలగిపోతాయి. ఈ ప్రక్రియ వల్ల హార్మోన్లు, యాంటీబయోటిక్ లు పాలలో చేరుతాయి. పాశ్చరైజేషన్ ప్రక్రియ వల్ల పచ్చి పాలలో ఉండే ప్రయోజనకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. సహజ ఎంజైమ్ లను చంపుతుంది. ఫాస్పేటేస్ ను నాశనం చేస్తుంది. పిల్లల్లో పెరగుదలపై ప్రభావం చూపిస్తుంది. రోగనిరోధక
రిఫైన్డ్ రైస్
బియ్యాన్ని శుద్ధి చేసే ప్రక్రియ వల్ల బియ్యంపై ఉండే పొర తొలగిపోతుంది. దీని వల్ల బియ్యంపై ఉండే పోషకాలు తొలగిపోతాయి. రిఫైన్డ్ ప్రక్రియతో కేవలం ఎండోస్పెర్మ్ మాత్రమే మిగిలిపోతుంది. ఇందులో అధిక మొత్తంలో స్టార్చ్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను, గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది.
రిఫైన్డ్ షుగర్
చక్కెరలో అధిక మొత్తంలో కేలరీలు ఉంటాయి. చక్కెరలో పోషకాలేవీ ఉండవు. క్యాన్సర్, టైప్-2 డయాబెటిస్, బరువు పెరగడం, కాలేయ వ్యాధులు వంటి అనేక రకాల వ్యాధులకు చక్కెర దోహదం చేస్తుంది. చక్కెర ఫ్రక్టోజ్, గ్లూకోజ్ గా మారుతుంది. ఫ్రక్టోజ్ కాలేయంలో కొవ్వుగా మారుతుంది. ఇది ఇన్సులిన్ పనితీరుపై హానికరమైన ప్రభావం చూపిస్తుంది. ఇది టైప్-2 డయాబెటిస్ కు దారితీస్తుంది.
రిఫైన్డ్ సాల్ట్
ఉప్పు అధికంగా తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. బీపీ పెరిగి గుండె సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. ఉప్పులో ఉండే అయోడిన్ శరీరానికి కావాల్సిన పోషకం. అయితే ఆ ఉప్పును శుద్ధి చేయడం వల్ల అయోడిన్ తొలగిపోయి.. కేవలం ఉప్పు మాత్రమే మిగిలిపోతుంది. అలాంటి ఉప్పు తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.
మైదా
మైదా పిండిని వైట్ పాయిజన్ గా పిలుస్తారు పోషకాహార నిపుణులు. బ్రెడ్లు తయారు చేయడంలో, ఫాస్ట్ ఫుడ్స్ లో, ఇంకా చాలా ఉత్పత్తుల్లో మైదాను వాడతారు. గోధుమను రిఫైన్డ్ చేయడం వల్ల అందులోని ఎండోస్పెర్మ్ తొలగిపోయి కేవలం సాధారణ పిండి పదార్థం మిగిలిపోతుంది. ఇందులో ఎలాంటి పోషకాలూ ఉండవు.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications
