Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Watermelon Side Effects: ఎండాకాలంలో పుచ్చకాయ లాగించేస్తున్నారా? ఎక్కువ తింటే ఈ సమస్యలు తప్పవు
ఇది వేసవికాలం.. ఎండాకాలం వచ్చిందంటే పుచ్చకాయలు మార్కెట్లకు వచ్చేస్తాయి. సమ్మర్ సీజనల్ ఫ్రూట్ పుచ్చకాయ. వాటర్‌మిలన్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

పుచ్చకాయలో విటమిన్-A, Cలకు గొప్ప మూలం. అలాగే యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. పుచ్చకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ అతిగా తినడం వల్ల దుష్ప్రభావాలు రావొచ్చు. పండ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను అతిగా తినడం వల్ల సమస్యలు వస్తాయి. పుచ్చకాయలను అతిగా తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయలను ఎక్కువగా తింటే వచ్చే దుష్ప్రభావాలు
జీర్ణ సమస్యలకు కారణం కావొచ్చు:
అధిక FODMAP(ఫర్మెంటెబుల్, ఒలిగోశాకరైడ్స్, డైసాకరైడ్స్, మోనోశాకరైడ్స్, పాలియోల్స్) కంటెంట్ కారణంగా పుచ్చకాయను ఎక్కువగా తింటే పొత్తికడుపులో అసౌకర్యంగా అనిపిస్తుంది. ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు ఏర్పడవచ్చు.
ఫ్రక్టోజ్ కంటెంట్ కారణంగా పోషకాహార నిపుణులు పుచ్చకాయను అధిక FODMAP ఆహారంగా భావిస్తారు. ఫ్రక్టోజ్ అనేది మోనోశాకరైడ్. దీనిని అతిగా తినడం వల్ల కడుపు ఉబ్బరంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. పుచ్చకాయ యొక్క అధిక FODMAP స్థితి ఫ్రక్టోజ్-సెన్సిటివ్ వ్యక్తుల్లో జీర్ణ సమస్యలకు కారణమవుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి:
పుచ్చకాయలో అధిక FODMAP కంటెంట్ తో పాటు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీని వల్ల పుచ్చకాయను ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. మధుమేహం ఉన్న వారు పుచ్చకాయను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తారు.
అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అయితే కొద్ది మొత్తంలో తినడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు. అతిగా తింటేనే సమస్య.
రక్తపోటు పడిపోవచ్చు:
పుచ్చకాయను అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయి పడిపోతుంది. తక్కువ రక్తపోటు ఉన్న వారు ఎక్కువ మొత్తంలోని తిన్నా దుష్ప్రభావం కనిపించదు. కానీ బీపీ ఎక్కువగా ఉన్న వారు పుచ్చకాయను అతిగా తింటే రక్తపోటు పడిపోతుంది.
గర్భధారణ సమయంలో దూరం పెట్టండి:
గర్భధారణ మధుమేహం అనేది చాలా మంది గర్భిణీలను వేధించే సాధారణ సమస్య. గర్భంతో ఉన్న వారు పుచ్చకాయలను పెద్ద మొత్తంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇది గర్భాధారణ మధుమేహానికి దారితీస్తుంది. గర్భిణీ స్త్రీలు గ్యాస్టేషనల్ డయాబెటిక్స్ కు గురయ్యే అవకాశం ఉన్నట్లయితే పుచ్చకాయను తినకపోవడమే మంచిది. కొంత మొత్తంలో తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని కూడా గుర్తుంచుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications