Latest Updates
-
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.!
ఆరోగ్యానికి నీలి మందు..అపరాజిత పూల టీతో అద్భుత ప్రయోజనాలు!
మన ఇంటి ఆవరణలో, దేవుడి పూజలో మనం తరచుగా చూసే ముచ్చటైన ముదురు నీలి రంగు పువ్వు..అపరాజిత. దీనిని శంఖపుష్పి అని కూడా పిలుస్తారు. ఈ చిన్ని పువ్వులలో దాగున్న ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయుర్వేదంలో అపరాజితని శతాబ్దాలుగా ఒక గొప్ప ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ప్రియులు దీనిని బ్లూ టీ పేరుతో ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. ఆరోగ్యనిపుణుల ప్రకారం అపరాజిత పూల టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు,దీని తయారీ విధానం గురించి ఇక్కడ చూడండి.

రోగనిరోధక శక్తికి రక్షణ కవచం
మారుతున్న వాతావరణంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతుంటే అపరాజిత టీ మీకు చక్కటి పరిష్కారం. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మీ శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఇది శరీరాన్ని వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడటమే కాకుండా మనల్ని ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచేలా చేస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి మ్యాజిక్ డ్రింక్
బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నవారికి అపరాజిత టీ ఒక వరం. ఇది శరీరంలోని జీవక్రియను వేగవంతం చేస్తుంది. తద్వారా శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వు సులభంగా కరుగుతుంది. రోజువారీగా ఈ టీని తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గవచ్చు.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు సంజీవని
రక్తంలో షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలో అపరాజిత టీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ డయాబెటిక్ గుణాలు, భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ఒక్కసారిగా పెరగకుండా నిరోధిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు దీనిని తమ డైట్ లో చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
గుండె పదిలం
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా ఈ టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో మరియు రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఒత్తిడి మాయం
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణం అయిపోయాయి. అపరాజిత టీ మెదడుకు ఒక టానిక్ లా పనిచేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతపరుస్తుంది. అంతేకాకుండా ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడంలో కూడా సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకునే ముందు ఈ టీ తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
అపరాజిత టీ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని తీసుకోండి.
-నీరు వేడెక్కాక అందులో 4 నుండి 5 శుభ్రం చేసిన అపరాజిత పువ్వులను వేయండి.
-నీరు సగానికి తగ్గే వరకు మరిగించండి..తర్వాత స్టవ్ ఆపి, నీటిని వడకట్టండి.
-రుచి కోసం అందులలో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకుని వేడివేడిగా ఆస్వాదించండి. నిమ్మరసం పిండితే టీ రంగు నీలం నుండి ఊదా రంగులోకి మారుతుంది, ఇది చూడ్డానికి చాలా బాగుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
