Latest Updates
-
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా
భార్యాభర్తల మధ్య ‘గురక’తో దూరం.. ఈ సమస్యకు పరిష్కారముందా.?
వయసుతో సంబంధం లేకుండా కొందరిని విపరీతంగా వేధిస్తున్న సమస్య గురక. అది ఎంతలా అంటే ఐదేళ్ల క్రితమే వివాహమై జంటను విడాకులకు దారి తీసేంతగా.. తన భర్త తనను ఎంత ప్రేమగా చూసుకున్నా.. రాత్రయ్యే సరికి అతను పెట్టే గురక శబ్దాలను భరించలేక విడాకులు కోరింది. భోపాల్‌లో జరిగిన ఈ సంఘటన గురక సమస్యను, అందుకు సంబంధించిన ఆరోగ్య కారణాలను మరోసారి ఆలోచింపజేస్తుంది. అసలు గురక ఎందుకు కొడతారు.. దీనిని ఎలా పరిష్కరించుకోవాలి.. వైద్య నిపుణుల సలహాలు చూద్దాం..

గురక సమస్యకి సంబంధించి ఇటీవలి కాలంలో ఓ సినిమా కూడా వచ్చింది. ఆ మూవీ నవ్వించడంతో పాటు ఆందోళనను రేకెత్తిస్తుంది. నిజంగా గురక అంత భయంకరంగా ఉంటుందా.. అది అనుభవించిన వారినే అడగాలనే సమాధానం వస్తుంది. అసలు గురక పెట్టేవారు గాఢ నిద్రలో ఉన్నప్పుడు వారికి ఈ విషయమే తెలియదు. కానీ పక్కనున్న వారికి రాత్రంతా నిద్ర కరువే. ఈ కారణంగానే భోపాల్‌లో భార్య భర్త నుంచి విడాకులు కోరింది. తన భర్త ఎంతమారైనా.. ఆయన గురకతో తాను రాత్రంతా మేలుకొని ఉండలేనని చెబుతూ విడాకులకు విజ్ఞప్తి చేసింది. అయితే చివరికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సలహాతో ఆమె నిర్ణయం మార్చుకుంది.
ఇదిలా ఉండగా.. గురక కుటుంబ సమస్యలకి సంబంధించినదే కాదు ఆరోగ్యానికి సంబంధించినది కూడా.. ఇది ఒక స్లీప్ అప్నియాకు లక్షణమని వైద్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా నిద్రలో ఉన్నా మనం శ్వాస ఆగకుండా తీసుకుంటూనే ఉంటాం. అయితే నిద్రలో శ్వాస కొన్ని సెకన్ల పాటు పదేపదే ఆగిపోతే అదే స్లీప్ అప్నియా.. ఈ కారణంగా, శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో నిద్రకి పదేపదే అంతరాయం ఏర్పడుతుంది. అయితే గురక పెట్టే ప్రతి ఒక్కరికీ స్లీప్ అప్నియా ఉన్నట్లు కాదని నిపుణులు అంటున్నారు. గురకతో పాటు ఇతర సమస్యలనూ పరిగణించాలి. ఉదయం నిద్రలేచినప్పుడు తలనొప్పి, రోజంతా నిద్రమత్తుగా లేదా అలసటగా అనిపించడం, నోరు పొడిబారడం వంటి లక్షణాలు ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.
గుండెపోటు ప్రమాదం
గురక అధికంగా పెట్టేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు ప్రధాన కారణం స్లీప్ అప్నియా కాగా.. ఒక వ్యక్తికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా ఉన్నప్పుడు, వారు నిద్రిస్తున్నప్పుడు వారి శ్వాస పదేపదే ఆగిపోవడంతో శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి. దీంతో శరీరంపై మరింత ఒత్తిడి పెరగడమే కాక, రక్తపోటు కూడా అకస్మాత్తుగా పెరుగుతుంది. ఫలితంగా గుండె కొట్టుకోవడం కూడా అస్తవ్యస్తంగా మారుతుంది. క్రంగా శరీరంలో వాపు పెరిగి, రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి.. గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గురకకు ప్రధాన కారణాలు
గురక సమస్యకు ప్రధాన కారణాలుగా అధిక బరువు లేదా ఊబకాయం, పక్కకు తిరిగి పడుకోవడానికి బదులుగా వెల్లకిలా పడుకోవడం ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. వయసు పెరిగే కొద్దీ గొంతు కండరాలు వదులవడం, ముక్కు దిబ్బడ సమస్య, మద్యం, నిద్రమాత్రలు తీసుకోవడం, ధూమపానం వల్ల శ్వాసనాళాల వాపు ఏర్పడటం, టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ వాపునకు గురి కావడం, దవడ లేదా గొంతు నిర్మాణం సమస్య, స్లీప్ అప్నియా, గర్భధారణ వల్ల శరీరంలో మార్పుల కారణంగా గురక సమస్య ఏర్పడుతుంది.
గురకను ఎలా నివారించాలి..
గురక సమస్యను మందులతో నివారించలేమని వైద్యులు అంటున్నారు. జీవనశైలిలో కొన్ని మార్పుల కారణంగానే పరిష్కారం దొరుకుతుంది. తిన్న వెంటనే ఎప్పుడూ పడుకోవద్దని.. కొద్దిసేపు చిన్నపాటి నడక ద్వారా బరువు తగ్గి గురకను తగ్గించడంతో తోడ్పడుతుంది. మీరు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నట్లయితే ముందుగా వెయిట్ లాస్‌కి ప్రయత్నించడం చాలా ముఖ్యం. ధూమపానం, మద్యపానం అలవాట్లను మానుకోవాలి. రాత్రి వేళల్లో భారీగా కాకుండా పరిమితంగా మాత్రమే భోజనం చేయాలి.
నిద్రపోయేటప్పుడు తల కింద దిండు పెట్టుకుని నిద్రపోవడం ద్వారా కాస్తయినా గురక నుంచి ఉపశమనం పొందవచ్చు. బెడ్‌పై వెల్లకిలా పడుకోవడం కంటే పక్కకు తిరిగి పడుకోవడం ద్వారా శ్వాస బాగా ఆడి అంతరాయం లేకుండా చూస్తుంది. నిద్రపోయే ముందు ముక్కు, గొంతును క్షుణ్ణంగా శుభ్రం చేసుకోవడం ద్వారా గురక సమస్యను మెల్లగా నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
