Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఏసీ వాడుతున్నారా? ఈ షాకింగ్ విషయం తెలుసుకోకుంటే చావు కొని తెచ్చుకున్నట్లే!
మే నెలాఖరుకు వచ్చేసాం. ఎండలు భగభగమంటున్నాయి. రోజురోజుకి ఎండ తీవ్రత పెరుగుతుందే తప్ప ఏ మాత్రం తగ్గట్లేదు. ఎంత వాన పడినా కూడా వేడి తీవ్రత మాత్రం తగ్గట్లేదు. అయితే భాగనుడి భగభగలను తట్టుకునేందుకు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు నిరంతరాయంగా వాడుతూనే ఉంటున్నారు జనం. అయితు కొందరు ఇంట్లో లేదా ఆఫీసులో ఏసీలో ఎక్కువసేపు ఉండి సడెన్ గా బయటకు వచ్చినప్పుడు మన శరీరం దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ఆకస్మిక మార్పు ఊహించని తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని మీకు తెలుసా?
ఏసీ నుండి ఎండలోకి వెళ్లే ప్రమాదమా
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం గంటల తరబడి ఏసీలో ఉండటం వల్ల మన శరీర ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది. అలాంటి సమయంలో మనం అకస్మాత్తుగా తీవ్రమైన ఎండలోకి వెళితే, శరీరం తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. దీనివల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఎక్కువవడమే కాకుండా మెదడులో రక్తస్రావం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏసీ గదిలో ఉష్ణోగ్రత 20-24 డిగ్రీల సెల్సియస్ ఉంటే, బయట అది 40-45 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంటే లోపల, బయటి ఉష్ణోగ్రతల మధ్య దాదాపు 20 నుండి 22 డిగ్రీల వ్యత్యాసం.. ఇది మన శరీరంపై పిడుగుపాటులాంటిది. చల్లని వాతావరణానికి అలవాటుపడిన శరీరం ఒక్కసారిగా దాదాపు రెట్టింపు వేడిలోకి అడుగుపెట్టినట్లే.
ఈ ఆకస్మిక మార్పును తట్టుకోవడం శరీరానికి చాలా కష్టం. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు,హై బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ పరిస్థితి మరింత ప్రమాదకరం. వారి శరీరం ఇలాంటి తీవ్రమైన మార్పులకు త్వరగా స్పందించి ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ ప్రమాదం నుండి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా?
-కొన్ని సులభమైన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఏసీ నుండి ఎండలోకి వెళ్ళేటప్పుడు కలిగే దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఏసీ గది నుండి బయటకు వచ్చే ముందు నేరుగా ఎండలోకి వెళ్లకుండా వరండాలోనో గేటు దగ్గరనో నీడపట్టున కొంత సమయం 5-10 నిమిషాలు గడపండి. దీనివల్ల మీ శరీర ఉష్ణోగ్రత బయటి వాతావరణానికి నెమ్మదిగా సర్దుబాటు అవుతుంది.
-ఎట్టిపరిస్థితుల్లోనూ ఖాళీ కడుపుతో ఎండలోకి వెళ్లవద్దు. తేలికపాటి ఆహారం లేదా పండ్లరసం వంటివి తీసుకున్న తర్వాతే బయటకు వెళ్లడం మంచిది.
-ఎండలో తిరిగేటప్పుడు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే లేత రంగు దుస్తులు ధరించండి. తలకు టోపీ, స్కార్ఫ్ లేదా రుమాలు చుట్టుకోవడం ద్వారా వడదెబ్బ నుండి రక్షణ పొందవచ్చు.
-శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయం. తరచుగా నీరు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, లేదా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) వంటివి తాగుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలాఉంటే వెంటనే డాక్టర్ ని కలవండి
ఎండలో గడిపిన తర్వాత మీకు ఒకవేళ తల తిరగడం, వాంతులు రావడం లేదా వికారంగా ఉండటం, గుండె వేగంగా కొట్టుకోవడం, తీవ్రమైన ఆందోళన, అధిక దాహం వంటి లక్షణాలు కనిపిస్తే, ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. వెంటనే చల్లన, నీడపట్టున ఉన్న ప్రదేశానికి వెళ్ళండి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి తడి గుడ్డతో శరీరాన్ని తుడుచుకోండి. వీలైనంత త్వరగా డాక్టర్ సలహా తీసుకోండి
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications