Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
మైగ్రేన్ నొప్పిని తగ్గించే పవర్ ఫుల్ జ్యూస్..ఈజీగా ఇలా తయారుచేసుకోవచ్చు!
కుటుంబ సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఆఫీసులో మేనేజర్ల నుంచి ఒత్తిడి వంటి రకరకాల కారణాలతో తలనొప్పి పుట్టడం సహజం. దీంతో తలలో నరాలు చిట్లిపోతున్నాయనే రేంజ్ లో నొప్పి కలుగుతుంది. తలనొప్పిలో మైగ్రేన్ తలనొప్పి ఒకటి. సాధారణ తలనొప్పి కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. దీని లక్షణాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దీనినే పార్శ్వనొప్పి అని కూడా అంటారు. మైగ్రేన్ నొప్పి సాధారణంగా తలకు ఒక వైపున మాత్రమే వస్తుంది. కొన్నిసార్లు తల మొత్తం కూడా నొప్పి రావచ్చు. ఈ నొప్పి చాలా గంటల నుండి కొన్ని రోజుల వరకు ఉంటుంది.
ప్రస్తుతం మైగ్రేన్ తో బాధపడే వాళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటం మన చుట్టూ ఉన్నవారిలో గమనించవచ్చు. ఇక, ఎక్కువసేపు ఎండలో నడవడం లేదా ఉండటం, తక్కువ నీళ్లు తాగుతుండటం, అవసరమైనదానికంటే తక్కువగా తినడం, ట్యాబ్లెట్స్ ఎక్కువగా వేసుకోవడం అనేక ఇతర చెడు అలవాట్లు మైగ్రేన్ సమస్యను పెంచుతాయి. ఇక మీరు ఫోన్లు, కంప్యూటర్లు,డిజిటల్ స్క్రీన్ల ముందు గంటలు గంటలు సమయం గడిపితే మైగ్రేన్ తో బాధడే అవకాశం 100శాతం ఉంటది.

చాలా మంది మైగ్రేన్ సమస్యలకు నొప్పి నివారణ మందులు వాడతారు. అయితే నొప్పి నివారణ మందులు తీసుకోవడం శరీరానికి చాలా ప్రమాదకరం అని నిపుణులు చెబుతున్నారు. దీనికి బదులుగా సులభంగా ఇంట్లోనే తయారుచేసుకునే ఓ జ్యూస్ లేదా స్మూతీని తాగితే మైగ్రేన్ సమస్యకు అద్భుతమైన పరిష్కారం దొరుకుతుంది. ఏ జ్యూస్ తాగితే మీ మైగ్రేన్ మాయం అవుతుందో,దానిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.
దీన్ని ఎలా తయారు చేయాలి?
మిక్సీ జార్ లో 1 కప్పు పైనాపిల్, 1 కప్పు తరిగిన దోసకాయ, 1 కప్పు పాలకూర, 4-5 పచ్చి కాలే ఆకులు, చిటికెడు అల్లం, 1 టీస్పూన్ నిమ్మరసం, మిరియాలు, కొద్దిగా ఉప్ వేసిపు కలిపి గ్రైండ్ చేయడండి. తర్వాత ఆ మిశ్రమానికి ఐస్ జోడించండి. ఈ పానీయం మైగ్రేన్ నొప్పిని తగ్గించడానికి సరైనది.
ఇది ఎలా పనిచేస్తుంది?
క్యాబేజీలా కనిపించే కాలే ఆకులు, పాలకూరలో ఫోలేట్, ఐరన్, మెగ్నీషియం చాలా ఉంటాయి. ఇవి శరీరంలో కార్టిసాల్ స్థాయిని నేరుగా తగ్గిస్తాయి. అధిక కార్టిసాల్ హార్మోన్ తలనొప్పి లేదా మానసిక ఆందోళన వంటి మన సమస్యలను పెంచుతుంది. కానీ ఈ స్మూతీని తీసుకోవడం ద్వారా మనకు తలనొప్పి నుండి ప్రత్యక్ష ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా పాలకూరలోని విటమిన్లు మైగ్రేన్ దాడులను నిరోధించగలవు. నొప్పి నివారణకు ఈ స్మూతీకి మించిన ప్రత్యామ్నాయం లేదు. ఈ పానీయం తలనొప్పికి మాత్రమే కాకుండా, రోగనిరోధక శక్తిని, జీర్ణ సమస్యలను పెంచడానికి కూడా మెరుగ్గా పనిచేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
