Latest Updates
-
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.!
ఎండలవల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ చాలా ఎక్కువ..? తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!
ఎండాకాలంలో వడదెబ్బ మాత్రమే కాదు గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా వుంటాయని పరిశోధకులు చెబుతున్నారు. వేసవిలో గుండె సంబంధిత రోగులు అప్రమత్తంగా వుండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు ఎండ వల్ల గుండెపోటుకు ఎలాంటి సంబంధం వుంటుందో తెలుసుకుందాం.
ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చెమట ఎక్కువగా వచ్చి శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. దీంతో గుండెకు సంబంధించిన అవయవాలు అలసిపోతాయ్. చెమటతో ఎలక్ట్రోలైట్లు బయటకు వెళ్లిపోవడం వల్ల గుండె సరిగ్గా పనిచేయదు.
వేసవలో త్వరగా అలసిపోతుంటాం. శరీరంలో గ్లూకోజ్ స్థాయి తగ్గిన తరువాత అలసిపోయినప్పుడు గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ వుంటుంది. ఈ సమయంలో గుండెపై అధికభారం పడ్డం వల్ల గుండె ఆగిపోయే పరిస్థితులు ఏర్పడతాయ్.

అప్పటికే గుండె సంబంధిత వ్యాధులు గనక వుంటే పరిస్థితి మరింత తీవ్రంగా మారుతుంది. దెబ్బతిన్న గుండె ఎండలో అలసిపోతే మరింత దారుణంగా అలసిపోయి ఒత్తిడి పెరిగే పరిస్థితి వుంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నీరు తాగితే ఎన్నో అనారోగ్యాలు నయమవుతాయ్. గుండెపోటు నయం కాకున్నా కొంత తోడ్పాటునిస్తుంది. ఎండలో గుండెపోటు రాకుండా వుండాలంటే సాధ్యమైనన్ని ఎక్కువ నీళ్లు తాగాలి. లేకపోతే పరిస్థితి దారుణంగా మారుతుంది. నీళ్లు బాగా తాగితే గుండెపోటు రాదు అన్న హామీని కొంతైనా ఇవ్వవచ్చు.
టైట్ డ్రెస్సులు వద్దు
వేసవిలో గుండెపోటు.. వేసుకున్న దుస్తుల ప్రభావం కూడా వుంటుంది. లూజ్ ఫిట్టింగ్ వున్న దుస్తులు మాత్రమే వేసుకోవాలి. లైట్ కలర్ డ్రెస్సులు మాత్రమే వేసుకోవాలి. నల్ల రంగు ఎండను బాగా లాగేసుుకుంటుంది. కాబట్టి నల్లరంగు దుస్తులను వేసుకోవద్దు.
తినే ఆహారం
తినే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బ్యాలెన్స్ డైట్‌ను మెయింటెయిన్ చేయాలి. కొవ్వు ఎక్కువగా వున్న పదార్ధాలను తీసుకోవద్దు. జంక్ ఫుడ్‌కు దూరంగా వుండాలి. చిరుతిళ్లకు ఎంత దూరంగా వుంటే ఆరోగ్యం అంత బాగుంటుంది. పళ్లను, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి.
మెంటల్ హెల్త్
ఎండవల్ల మానసిక సమస్యలు కూడా చాలా వస్తాయ్. వీటి నుంచి బయటపడాలంటే మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి. లోతుగా ఊపిరి తీసుకోవాలి. మానసిక సమస్యలు మరింత ఎక్కువగా వుంటే గనక సైకియార్టిస్ట్ సాయాన్ని తీసుకోవాలి.
సిద్ధంగా వుండాలి
వేసవిలో గుండెసంబంధిత రోగులకు ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. కాబట్టి వారు ఎప్పుడూ అప్రమత్తంగా వుండాలి. ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను దగ్గర పెట్టుకోవాలి.
ముందు జాగ్రత్త
వేసవిలో బయటకు వెళ్లినప్పుడు వయసు పైబడిన వారు, గుండె సంబంధిత వారిపై ప్రత్యక శ్రద్ధ వహించాలి. వారికి ఎక్కువ ప్రమాదం అని అనిపిస్తే వెంబడి తీసుకొని పోకుండా వుండడమే మంచిది.
ఈ టైమ్‌లో బయటకు వద్దు
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎండలు బాగా మండిపోతుంటాయ్. ఈ సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఈ సమాయానికి ముందు లేదా వెనక వెళ్లవచ్చు.
వెంటనే అలర్ట్ అవ్వాలి
గుండెపోటు వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయ్. అవి కనిపించగానే వెంటనే అప్రమత్తమవ్వాలి. ఛాతిలో నొప్పి వచ్చినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొన్నా, చెమట ఎక్కువగా వచ్చినా సాధారణంగా తీసుకోకుండా వెంటనే అలర్ట్ అవ్వాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
