Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఫ్రిజ్ వద్దు,కుండే ముద్దు..మట్టికుండ నీళ్లు తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలివే!
మండే ఎండలో నుంచి ఇంటికి రాగానే కుండలోని నీళ్లు ఒక గ్లాసు తాగితే ప్రాణం లేచివచ్చినట్లు ఉంటది. కానీ ఇప్పుడు మనమంతా ఫ్రిజ్ లకు అలవాటు పడ్డాం. దాహాన్ని తీర్చుకోవడానికి ప్లాస్టిక్ బాటిళ్లలో ఉండే ఫ్రిజ్ నీళ్ల వైపు పరుగులు తీస్తున్నాము.
అయితే ఫ్రిజ్ నీటి వల్ల గొంతునొప్పి, జీర్ణ సమస్యలు వంటి వస్తుంటాయి. అందుకే మన పూర్వీకులు అనుసరించిన విధానమే మనకు శ్రీరామరక్ష. ఈ వేసవిలో ఫ్రిజ్ వాటర్ కు బదులుగా, సహజసిద్ధంగా నీటిని చల్లబరిచే మట్టికుండను ఉపయోగించడం ఎంతో ఉత్తమం. ఫ్రిజ్ వాటర్ మానేసి కుండ నీళ్లు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ చూడండి.

గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం
మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగం శరీరంలో ఆమ్లంగా (యాసిడ్) మారి, విషతుల్యాలను ఉత్పత్తి చేస్తుంది. అయితే మట్టికి సహజంగానే క్షార (ఆల్కలీన్) గుణం ఉంటుంది. మట్టికుండలో నీరు నిల్వ ఉంచినప్పుడు నీటి pH లెవల్స్ బ్యాలెన్స్ గా మారుతుంది.
కుండ నీటిని మనం తాగినప్పుడు మన శరీరంలోని ఆమ్లత్వంతో అది చర్య జరిపి పీహెచ్ (pH) బ్యాలెన్స్ ఏర్పడుతుంది. దీనివల్ల ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ వంటి ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు.
డీటాక్సిఫికేషన్
వివిధ పరిశోధనల ప్రకారం మట్టి పాత్రలలోని నీరు త్రాగటం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు, మలినాలు సులభంగా బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల శరీరం సహజసిద్ధంగా డిటాక్స్ అవుతుంది.
జీవక్రియ మెరుగుపడుతుంది
ప్లాస్టిక్ బాటిళ్లలో నీరు తాగడం వల్ల శరీరంలోకి ప్రమాదకరమైన రసాయనాలు చేరే అవకాశం ఉంది. కానీ మట్టి కుండలో నిల్వ చేసిన నీటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు. అంతేకాకుండా మట్టిలో ఉండే ఎన్నో సహజసిద్ధమైన ఖనిజాలు (మినరల్స్) నీటిలో కలుస్తాయి.
ప్రతిరోజూ ఈ నీటిని తాగడం వల్ల మన జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమై, శరీర జీవక్రియల రేటు అమాంతం పెరుగుతుంది.
ప్రాణాంతక వడదెబ్బ నుండి రక్షణ
వేసవి కాలంలో ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో మనకు తెలిసిందే. వడదెబ్బ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మట్టికుండ నీరు బెస్ట్ ఆప్షన్. ఈ నీటిలో ఉండే అపారమైన పోషకాలు, ఖనిజాలు మన శరీరాన్ని వెంటనే రీహైడ్రేట్ చేస్తాయి. అలసటను దూరం చేసి, శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.
రోగనిరోధక శక్తిని పెంచే సహజ ప్యూరిఫైయర్
మట్టికుండలో నీళ్లు పోసినప్పుడు వచ్చే ఆ కమ్మటి మట్టి వాసన మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. మట్టికి సహజంగానే మలినాలను పీల్చుకునే గుణం ఉంటుంది. ఇది సహజసిద్ధమైన వాటర్ ప్యూరిఫైయర్ లా పనిచేసి నీటిని స్వచ్ఛంగా మారుస్తుంది.
ఫ్రిజ్ వాటర్ తాగితే గొంతు నొప్పి, జలుబు వస్తాయి, కానీ కుండ నీటితో అలాంటి సమస్యలు రావు. పైగా ఈ నీరు గొంతుకు, పేగులకు ఎంతో మేలు చేయడంతో పాటు మన రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications