Latest Updates
-
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.!
Swimming Weight Loss: వేసవిలో స్మిమ్మింగ్.. ఇట్టే బరువు తగ్గుతారని తెలుసా?
ఎండలు మండిపోతున్నాయి బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. ఇలాంటి వేడి వాతావరణంలో చల్లగా సేదతీరాలని కోరుకుంటారు. వేసవి వచ్చిందంటే చాలా మంది స్విమ్మింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఎండాకాలంలో ఉదయం లేదా సాయంత్రం వేళ ఈత కొడితే హాయిగా ఉంటుంది. అలాగే శరీరానికి వ్యాయామం చేసినట్లు అవుతుంది.
బరువు తగ్గడానికి, కొవ్వు కరిగించడానికి చాలా మంది చాలా రకాల వర్కవుట్స్ సూచిస్తుంటారు. ఏరోబిక్స్, వెయిట్ ట్రైనింగ్, రన్నింగ్, వాకింగ్ లాంటివి చేయాలని చెబుతుంటారు. అయితే చాలా మంది ఈతను తక్కువ అంచనా వేస్తుంటారు. స్విమ్మింగ్ చేయడం వల్ల కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. శరీరంలోని అన్ని భాగాలు కదులుతూ బాడీ ఫిట్ గా తయారవుతుంది.

ఈ వేసవికాలంలో చేసే స్విమ్మింగ్ వల్ల ఆహ్లాదంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యం, బరువు కూడా తగ్గుతారు. ఈత వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు తగ్గడానికి ఈత ఎలా సహాయపడుతుంది:
ఈత కొట్టడానికి శరీరాన్ని కదిలించాల్సి ఉంటుంది. చేతులు, గ్లూట్స్, తుంటి, భుజాలు అన్ని కదిలిస్తేనే ఈత కొట్టగలం. తేలికైన రిలాక్స్డ్ ఈత ఒక గంటలో 500 కేలరీలు బర్న్ చేస్తుంది. కఠినమైన ఈత వల్ల గంటలో ఏకంగా 700 కేలరీలు కరుగుతాయి. ఈత వల్ల జీవక్రియ మెరుగుపడటంతో పాటు లీన్ కండరాలు పెరుగుతాయి.
కీళ్లకు మంచిది:
నీరు గురుత్వాకర్షణను న్యూట్రలైజ్ చేస్తుంది. నీటిలో మునిగినప్పుడు బరువు కోల్పోయిన భావన కలుగుతుంది. ఇది కీళ్లకు చాలా అవసరమైన విరామాన్ని అందిస్తుంది. స్విమ్మింగ్ చేయడం వల్ల గాయాల బారిన పడకుండా ఉండవచ్చు.
యంగ్‌గా ఉంచుతుంది:
అమెరికన్ కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ కాన్ఫరెన్స్ నివేదికల ప్రకారం ఎప్పుడూ స్విమ్మింగ్ చేసే వారు, ఈత కొట్టని వారి కంటే తక్కువ వయస్సులా కనిపిస్తారు. స్విమ్మింగ్ చేయడం వల్ల రక్తపోటు, హృదయనాళ వ్యవస్థ, కేంద్ర నాడీ వ్యవస్థ, కొలెస్ట్రాల్ స్థాయిలు, కాగ్నిటివ్ ఫంక్షనింగ్ మెరుగుపడతాయి.
బరువు తగ్గడానికి ఎంత సేపు ఈత కొట్టాలి:
బరువు తగ్గడానికి రోజూ ఎంత సేపు ఈత కొట్టాలనేది శరీర బరువు, వారు ఉపయోగించే స్విమ్మింగ్ స్ట్రోక్, ఈత కొట్టే వేగంపై ఆధారపడి ఉంటుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ప్రతి వారం కనీసం 2 గంటల 30 నిమిషాల పాటు ఈత కొట్టాలి.
ఈత వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన బరువు మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. 3,500 కేలరీలు అర కిలో బరువుకు సమానం. అర కిలో బరువు కోల్పోవాలంటే 3500 కేలరీలు తక్కువ తీసుకోవడంతో పాటు మరో 3500 కేలరీలు కరిగించగలగాలి.
వివిధ స్విమ్మింగ్ స్ట్రోకులు
బట్టర్‌ఫ్లై స్ట్రోక్: ఈ స్ట్రోక్ స్విమ్మింగ్ వల్ల 72 కిలోల బరువు ఉన్న వ్యక్తికి స్ట్రోక్ 10 నిమిషాల్లో 150 కేలరీలు బర్న్ చేస్తుంది.
ఫ్రీస్టైల్ స్ట్రోక్: దీనిని ఫ్రంట్ క్రాల్ అని కూడా పిలుస్తారు. దీని వల్ల అధిక సంఖ్యలో కేలరీలను బర్న్ చేస్తుంది. 58 కిలోల బరువు ఉన్న వ్యక్తి గంటసేపు ఫ్రీస్టైల్ స్విమ్మింగ్ చేస్తే దాదాపు 590 కేలరీలు కరుగుతాయి.
బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్ స్ట్రోక్: బ్రిస్క్ వాక్, స్లో జాగ్ మాదిరిగా కేలరీలు బర్న్ అవుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
