Latest Updates
-
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.!
రాత్రి పడుకునేటప్పుడు బొడ్డులో రెండు చుక్కల నూనె వేస్తే ఏమవుతుందో తెలుసా?
ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలామంది ఆరోగ్యం, అందం కోసం మార్కెట్లో లభించే ఖరీదైన ప్రొడక్టులను కొనుగోలు చేసి వాడుతుంటాం. అయితే మన వంటింట్లోనే మన పూర్వీకులు తరతరాలుగా పాటిస్తున్న అనేక అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? అలాంటి ఒక ఈజీ,ఎఫెక్టివ్ చిట్కానే బొడ్డు(నాభి)కి ఆయిల్ రాయడం. మన శరీరంలోని జీవశక్తికి బొడ్డు కేంద్ర బిందువు అని ఆయుర్వేదం చెబుతుంది. బొడ్డు సీక్రెట్ హీలింగ్ పాయింట్. 72వేల నాడిలకు బొడ్డు కనెక్ట్ అయ్యి ఉంటుంది.
తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు పోషణ అందేది ఈ బొడ్డు ద్వారానే. అందుకే ఈ కేంద్రానికి సరైన పోషణ అందిస్తే దాని ప్రయోజనాలు శరీరం మొత్తానికి చేరతాయి. ఇది కేవలం పాతకాలపు నమ్మకం మాత్రమే కాదు ప్రముఖ పోషకాహార నిపుణురాలు శ్వేతా షా వంటి నిపుణులు కూడా ఈ పద్ధతి ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నారు.మీ సమస్యను బట్టి ఏ నూనె ఎంచుకోవాలో తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో ద్వారా శ్వేతా షా తెలిపారు.

ఏ సమస్యకు ఏ ఆయిల్ వాడాలో చూడండి
మొటిమలు మాయం, మచ్చలు దూరం
ముఖంపై మొటిమలతో విసిగిపోయారా? అయితే మీ నాభికి రోజూ రెండు చుక్కల వేప నూనె రాయండి. వేప నూనెలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేసి శరీరం లోపలి నుండి విషపదార్థాలను బయటకు పంపిస్తాయి. ఫలితంగా మొటిమలు, మచ్చలు తగ్గిపోయి చర్మం స్పష్టంగా మారుతుంది.
నిగనిగలాడే మేనిఛాయ కోసం
మీ ముఖం కాంతివిహీనంగా, పొడిగా కనిపిస్తోందా? అయితే బాదం నూనె మీకు పర్ఫెక్ట్ . విటమిన్ ఈ పుష్కలంగా ఉండే బాదం నూనెను నాభికి రాయడం వల్ల చర్మానికి అవసరమైన తేమ అంది, సహజమైన మెరుపు సంతరించుకుంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఒత్తైన, పొడవైన కురుల కోసం
బొడ్డుకు, జుట్టుకు సంబంధం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? మన శరీరంలోని నాడులన్నీ నాభితో అనుసంధానమై ఉంటాయి. రోజూ కొబ్బరి నూనె లేదా బ్రాహ్మి నూనెను నాభికి రాయడం వల్ల వెంట్రుకల కుదుళ్లు బలపడతాయి. జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
జలుబు, సైనస్ కు చెక్
చలికాలం వచ్చిందంటే చాలు జలుబు, సైనస్ సమస్యలు వేధిస్తాయా? రాత్రి పడుకునే ముందు కొన్ని చుక్కల ఆవ నూనెను మీ నాభిలో వేసి మర్దనా చేయండి. ఆవ నూనె శరీరానికి వెచ్చదనాన్ని అందించి, శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
అరుగుదల సమస్యలకు ఆముదం
తరచుగా కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా? ఆముదం నూనె దీనికి చక్కటి పరిష్కారం. నాభికి ఆముదం రాయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి, మలబద్ధకం వంటి సమస్యలు కూడా దూరమవుతాయి.
హార్మోన్ల సమతుల్యత, సంతానోత్పత్తికి
హార్మోన్ల అసమతుల్యత, సంతానోత్పత్తి సమస్యలతో ఇబ్బంది పడుతున్న మహిళలకు కొబ్బరి నూనె లేదా స్వచ్ఛమైన నెయ్యి ఒక వరంలా పనిచేస్తుంది. వీటిని నాభికి రాయడం వల్ల పునరుత్పత్తి వ్యవస్థ బలపడి, హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయి.
నూనె ఎలా రాయాలి?
బొడ్డును నింపేయాల్సిన అవసరం లేదు. కేవలం 2 నుండి 3 చుక్కల నూనె తీసుకుంటే సరిపోతుంది. రాత్రి పడుకోవడానికి ముందు వెల్లకిలా పడుకుని నూనె చుక్కలను నాభిలో వేయండి. మీ వేలితో సున్నితంగా, వృత్తాకారంలో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి. మంచి ఫలితాల కోసం నూనెను రాత్రంతా అలాగే వదిలేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
