Latest Updates
-
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.!
ప్రెగ్నెన్సీ సమయంలో మునగ పువ్వు చేసే మేలు ఏంటో తెలుసా!
ఏ అమ్మాయికి అయినా ప్రెగ్నెన్సీ అనేది జీవితంలో అత్యంత సంతోషకరమైన,సున్నితమైన ప్రయాణం. తొమ్మిది నెలలు కడుపులో బిడ్డను మోయడం అంటే అంత ఆషా మాషీ కాదు. ఈ సమయంలో తల్లి మంచి పోషకాలతో కూడిన ఆహారం తినాలని,తద్వారా కడుపులో పెరుగుతున్న బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని డాక్టర్లు సూచన చేస్తుంటారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో రకరకాల ఫుడ్స్ తినాలని అనిపించడం సహజం, అయితే వాటిలో కొన్ని ఆరోగ్యానికి మేలు చేసేవి కాకపోవచ్చు.
మునగకాయల ప్రయోజనాల గురించి అందరికీ తెలిసిందే. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే..మునగ పువ్వులు ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలకు ఒక సంజీవనిలా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో మునగ పువ్వులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలుంటాయని నిపుణులు తెలిపారు. ఆ ప్రయోజనాలేంటో ఇక్కడ చూడండి.

పోషకాల గని
మునగ పువ్వులు కేవలం చూడటానికి అందంగా ఉండటమే కాకుండా పోషకాల భాండాగారం కూడా. వీటిలో తల్లికి, బిడ్డకు అత్యంత అవసరమైన ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి కీలక పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కడుపులోని శిశువు అవయవాల అభివృద్ధికి, తల్లి శారీరక శక్తికి ఈ పోషకాలు పునాదిలా పనిచేస్తాయి.
తల్లీబిడ్డల ఎముకల పటిష్టతకు భరోసా
కడుపులోని బిడ్డ ఎముకల నిర్మాణం కోసం తల్లి శరీరం నుండే కాల్షియం గ్రహిస్తుంది. దీనివల్ల గర్భిణీ స్త్రీలలో కాల్షియం లోపం ఏర్పడే ప్రమాదం ఉంటది. మునగ పువ్వులలో కాల్షియం, ఫాస్పరస్ సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి తల్లి ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా శిశువు ఆరోగ్యకరమైన అస్థిపంజర వ్యవస్థ అభివృద్ధికి తోడ్పడతాయి.
రక్తహీనతకు సహజసిద్ధమైన పరిష్కారం
గర్భధారణ సమయంలో చాలా మంది స్త్రీలు ఎదుర్కొనే ప్రధాన సమస్య రక్తహీనత. దీనివల్ల నీరసం, అలసట వంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే మునగ పువ్వులల అధిక మొత్తంలో ఉండే ఐరన్..శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెంచడానికి, రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. తద్వారా రక్తహీనత సమస్యను నేచురల్ గా అధిగమించి, తల్లి చురుకుగా ఉండేలా చేస్తుంది.
రోగనిరోధక శక్తికి రక్షణ కవచం
ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీల రోగనిరోధక శక్తి కొద్దిగా బలహీనపడుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లు, జబ్బుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మునగ పువ్వులలో ఉండే విటమిన్ సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని అందిస్తాయి.
జీర్ణవ్యవస్థకు మేలు
ప్రెగ్నెన్సీ టైంలో మలబద్ధకం, అజీర్తి వంటివి సర్వసాధారణమైన సమస్యలు. ఈ సమయంలో మునగ పువ్వులలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, ఆకలిని కూడా పెంచుతుంది.
ఎలా వాడొచ్చు
మునగ పువ్వులను సూప్ గా, కూరగా లేదా పప్పులో కలిపి తీసుకోవచ్చు. అయితే,ఏదైనా కొత్త ఆహారాన్ని తీసుకునే ముందు సంబంధిత డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించడం ముఖ్యమని గుర్తుంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
