Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
జీర్ణం కావడం లేదా..? ఈ డ్రింక్స్ ట్రై చేయండి..!
ప్రస్తుత జీవిన విధానంలో తిన్న భోజనం సరిగ్గా జీర్ణం కావడం లేదు. మద్య రాత్రిళ్లు భోజనాలు ఎక్కువయ్యాయ్. జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణసమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో జీర్ణం కావాలంటే భోజనం తరువాత ఏదైనా జీర్ణం కావడానికి ప్రత్యేకంగా ఏదైనా పానియం తీసుకోవాల్సిందే. తిన్న ఆహారం జీర్ణం కావడానికి భోజనానికి తరువాత తీసుకునే పానియాలకు సంబంధించిన సామాచారాన్ని కొంత మీకు అందిస్తున్నాం.
జీర్ణయం కావడానికి భోజనం తరువాత తీసుకోవాల్సిన పానియాలు :
జల్ జీరా
జల్ జీరా రసం తాగడానికి కూడా చాలా రుచిగా వుంటుంది. ఒక గ్లాసు నీటిలో తగినంత జీలకర్ర వేసి రాత్రంతా నానిన తరువాత భోజనం తరువాత తాగితే తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. శరీరంలో పోషకాలు త్వరగా అందేలా కూడా ఈ జల్‌జీరా దోహదం చేస్తుంది.
అల్లంటీ
అల్లం టీ అనగానే పాల, టీ పొడితో తయారు చేసిన టీ కొంత అల్లం వేసి దాన్ని అల్లం టీ అని తప్పుబడుతారు. ఒక కప్పు వేడినీటిలో కొంత అల్లం వేసి, తగినంత నిమ్మరసాన్ని పిండుకొని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

బటర్ మిల్క్
భోజనం చేసిన తరువాత ఒక గ్లాసు మజ్జిగ తాగడం వల్ల జీర్ణానికి అవసరమైన బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది. కడుపులో ఏ మంట ఉన్నా మజ్జిగ తాగగానే చల్లబడుతుంది.
ఆమ్లా రసం
ఆమ్లాలో వైటమిన్ సి పుష్కలంగా వుంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఆమ్లాలో మెండుగా వుండడం వల్ల జీర్ణప్రక్రియ సులువవుతుంది. ఒక గ్లాసు ఆమ్లా రసాన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా కాలేయం పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.
తులసి టీ
ఆయుర్వేదంలో తులసి ఆకులకు చాలా ప్రాముఖ్యత వున్నాది. దాదాపు హిందువులందరి ఇళ్ల్లో తులసి చెట్టు వుంటుంది. కొన్ని తులసి ఆకులతో తులసి రసాన్ని చేసుకొని భోజనం తరువాత తాగితే జీర్ణ క్రియ మెరుగుపడ్డమే కాకుండా మెదడు ప్రశాంతంగా మారుతుంది.
పూదీన రసం
పూదీన ఆకులతో చేసుకునే జ్యూస్ చాలా రుచిగా వుంటుంది. భోజనం తరువాత జీర్ణం కావడానికి, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లల్లో కొన్ని పూదీన ఆకులను వేసి నాననిచ్చి తరువాత ఆ రసాన్ని తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది కడుపులోని గ్యాస్ట్రిక్ సమస్యలను పరిష్కరించడమే కాకుండా అజీర్ణం సమస్యను కూడా తగ్గిస్తుంది.
వాము
వాము విత్తనాలను గోరు వెచ్చని నీటిలో కలుపుకొని తాగడం వల్ల కడుపులో ఏదైనా ఉబ్బరంగా అజీర్ణంగా అనిపిస్తే తగ్గిపోతుంది. గొంతులో మంట వచ్చినా లేక జలుబు చేసినా ఈ వాము నిమిషాల్లో ఉపశమనం కలిగిస్తుంది.
పసుపు పాలు
పసుపు పాలు తాగడం వల్ల కూడా జీర్ణ సమస్య తగ్గుతుంది. పాలల్లో కొంత పసుపు, కొంచెం అల్లం వేసుకొని తాగడం వల్ల జీర్ణ సమస్య తగ్గుతుంది.
కాఫీ
ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల మెదడు చురుగ్గా అవడమే కాకుండా జీర్ణ ప్రక్రియకు అవసరమైన పరిస్థితిని ఏర్పరుస్తుంది. కడుపులో ఏవైనా వ్యర్ధ పదార్ధాలు వున్నా కాఫీ తాగిన తరువాత బయటకు వెళ్లిపోతాయ్. రోజుకు ఒక కప్పు కాఫీ మంచిదే కానీ ఎక్కువ కాఫీ తాగడం వల్ల డయేరియా వచ్చే ప్రమాదం వున్నాది.
నీళు
కడుపులో ఆహారం జీర్ణం కావాలంటే ప్రత్యేకమైన పానియం కాకుండా సాధారణంగా నీరు తాగినా జీర్ణం అవుతుంది. అయితే సరైన పద్ధతిలోనే నీరు తాగాలి. భోజనం చేసే ఒక గంట ముందు నీరు తాగాలి, భోజనం చేస్తున్న సమయంలో ఎక్కువ నీరు తాగవద్దు. ఇలా నీరు తాగడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications