వర్షాకాలంలో డెంగ్యూను లైట్ తీసుకోవద్దు.. ఈ లక్షణాలుంటే త్వరగా జాగ్రత్త పడండి..!!

ఓ పాతికేళ్ల క్రితం డెంగీ గురించి పెద్దగా విన్నది లేదు. కానీ ఇప్పుడు ఏ జ్వరం వచ్చినా డెంగీ ఏమో అనుకునే పరిస్థితి వచ్చింది. డెంగీ అనేది ఏడిస్ అనే ఒక రకమైన దోమల వల్ల వ్యాప్తి చెందే వైరల్ ఇన్ఫెక్షన్ ఏడిస్ నుంచి వచ్చే డెంగీ వైరస్ ఒక మనిషి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఎవరికైనా ఒకసారి ఒక రకం డెంగీ ఇన్‌ఫెక్షన్ వస్తుంది. రెండోసారి కూడా డెంగీ జ్వరం రావచ్చు.

symptoms of dengue fever

అది ఇంకోపక్క డెంగీ వైరస్ అయి ఉండవచ్చు. ఏడిస్ దోమలు చిన్నవిగా ఉంటాయి. శరీరంపై నలుపు, తెలుపు చారలు ఉంటాయి. వర్షాకాలంలో నిలిచి ఉన్న నీటిలో వేగంగా వృద్ధి చెందుతాయి. ఈ దోమలు ఎక్కువ దూరం ఎగరలేవు. ఇవి పగటిపూట మాత్రమే కుడతాయి. చికెన్ గున్యా కూడా కలుగు చేస్తాయి. డెంగీ జ్వరం వచ్చిన రోగి నుంచి వైరస్ మరొకరికి నేరుగా సోకదు డెంగీ సోకిన వ్యక్తికి ఒకటి నుంచి ఏడు రోజుల వరకు ఎలాంటి లక్షణాలు ఉండవు. డెంగీ ఒక సాధారణ జ్వరం రావచ్చు. కొన్నిసార్లు తీవ్ర రక్తస్రావమై ప్రాణాంతకం కావచ్చు లేదా మెదడువాపు వంటి ఏదైనా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ శరీర అవయవాలపై దీని ప్రభావం పడితే చనిపోవచ్చు. డెంగీ వస్తే ఉన్నట్టుండి విపరీతమైన జ్వరం, ఒళ్లునొప్పులు, వెన్నులో నొప్పి మొదలవుతాయి. విపరీతమైన తలనొప్పి, ముఖ్యంగా కనుగుడ్లు తిప్పిన కూడా నొప్పిగా ఉంటుంది. మొదటి 12 రోజుల్లో శరీరమంతా ఎర్రబడడం, కళ్లు మంట, ఎరుపు ఉండవచ్చు. పిల్లలు నోరు పొక్కడం, గొంతు నొప్పి, పొడి, దగ్గు లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. కడుపు నొప్పి వాంతి వచ్చినట్లు ఉండటం సాధారణమే.

ఆకలి పుట్టదు రుచి తెలియనట్లు ఉంటుంది. వారాంతాల్లో జ్వరం తగ్గుముఖం పడుతుంది. ఆ సమయంలో శరీరమంతా మళ్లీ రావచ్చు. ఇది ఎర్ర చుక్కలు చుక్కలుగా ఉండి అక్కడక్కడ తెల్లని భాగాలు ఉంటాయి. దురద కూడా ఉంటుంది. నడుము పై భాగం వేడిగా ఉన్న కాళ్ళు, చేతులు చల్లబడిపోతాయి. విపరీతమైన నీరసం, చెమటలు, కడుపునొప్పి తుళ్లిపడేలా అనిపించడం పడిపోవడం లాంటివి కూడా ఉంటాయి. చిన్న చుక్కలు నుంచి పెద్దపెద్ద సైజుల్లో ఎర్రని రాజ్ లేదా కమిలి నల్లని మచ్చలు ఏర్పడవచ్చు. కొంచెం ఒత్తిడి తగిలినా చర్మం కమిలి నల్లని మచ్చలా ఏర్పడతాయి. మూత్రం ఎర్రగా రావొచ్చు. మలం రంగు కూడా నల్లగా ఉండొచ్చు. తెల్లగా ఉన్నవారి చేతి వేళ్లు నోటి చుట్టూ చర్మం నీలంగా మారుతాయి. మూత్రం తక్కువగా రావడం. అసలు రాకపోవడం గమనించవచ్చు. ముఖం శరీరం కొంచెం ఉబ్బినట్లు ఉంటాయి. బీపీ పడిపోతుంది. సూది గుచ్చిన చోట నుంచి కూడా సన్నగా రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఈ పరిస్థితి తీవ్రమైతే ఎక్కడ పడితే అక్కడ నుండి తీవ్ర రక్తస్రావం, గుండె పనితీరు మందగించడం, మెదడు మొద్దుబారి కోమాలోకి వెళ్లడం, కిడ్నీలు పూర్తిగా పనిచేయకపోవడం వంటివి జరుగుతాయి.

జ్వరం వచ్చిన వారిలో కొద్దిశాతం మందికి ఇలా బీపీ పడిపోవడం లాంటివి జరుగుతాయి. అందులో అతి కొద్ది మందికి తీవ్రస్థాయి రోగ లక్షణాలు కనిపిస్తాయి. ఈ సమయంలో సొంత వైద్యం మంచిది కాదు. పిల్లలైనా పెద్దలైనా జ్వరానికి కేవలం పారాసిటమాల్ వాడి అది కూడా టోనిక్ టాబ్లెట్ రూపంలోనే జ్వరం తీవ్రంగా ఉంటే తడిబట్టతో ఒళ్లంతా తుడవండి. తగినంత నీరు ఓఆర్‌ఎస్ తాగించండి. ఒక రోజు మించి జ్వరం ఉంటే డాక్టర్‌ను సంప్రదించండి. మొదటి 12 రోజుల్లో పెద్దలకైతే రక్త పరీక్షలు అవసరం కూడా ఉండదు. పసిపిల్లలు కాస్త కౌమార దశలో ఉన్న పిల్లలు అయితే జ్వరానికి కారణం నిర్ధారణ చేసుకోవడం అవసరం.

మొదటి జ్వరం ఉన్న సమయంలో ప్లేట్‌లెట్లు సాధారణ స్థాయిలోనే ఉండొచ్చు. జ్వరం వచ్చే సమయంలో రోజు ప్లేట్‌లెట్లు గణనీయంగా తగ్గిపోతూ వస్తాయి. అదే సమయంలో బీపీ పడిపోవడం చర్మంపై ఎర్రని నల్లని రాజ్ రావడం జరగవచ్చు. అటువంటి సమయంలో హాస్పిటల్ లో ఉండటం క్షేమం. ప్రతి కొన్ని గంటలకు ఒకసారి బీపీ చూడటం, రోజు లేదా పూటకొక సారి ప్లేట్‌లెట్లు చూసుకోవడం ఎక్కడి నుండైనా రక్తస్రావం అయ్యే అవకాశాలు ఉన్నాయని గమనించడం. వైద్య సిబ్బంది పర్యవేక్షణలోనే సాధ్యమవుతుంది. హాస్పిటల్ లో ఉన్నంత మాత్రాన ప్లేట్‌లెట్లు తగ్గవని అనుకోవడం, బీపీ పడిపోదని అనుకోవడం అపోహ, వైరల్ ఇన్ఫెక్షన్‌కు శరీరం స్పందించే తీరును ఆపే మందులేవీ లేవు. బీపీని జ్వరాన్ని, రక్త స్రావాన్ని అదుపులో ఉంచే వైద్యమే ఎక్కడైనా చేస్తారు. వైరస్ వల్ల ఏవైనా ముఖ్యమైన శరీర అవయవాలు దెబ్బతింటే కాపాడే వైద్యం చాలా వరకు ప్రాణాపాయం నుండి గట్టెక్కిస్తుంది. మెదడుకు డెంగీ ఇన్‌సైట్, గుండెకు మయోకార్డిటిస్, ఖాళీయానికి హెపటైటిస్ లాంటి రావచ్చు.

ఊపిరితిత్తుల చుట్టూ పొట్ట నిండా నీరు చేరడం శరీరంలో అదుపు లేకుండా ఉండటం కూడా ప్రమాదమే. సాధారణంగా ప్లేట్‌లెట్లు తగ్గిపోవడమే సమస్య అంతా అనుకుంటారు. అందుకే వాటి కౌంట్ లక్షలోపు తగ్గగానే హైరానా పడిపోతుంటారు. తగ్గకుండా ఉండేందుకు మందులివ్వమని ప్లేట్‌లెట్లు ఎక్కించమని ఒత్తిడి చేస్తారు. మరికొందరు బొప్పాయి, ఆకుల రసం పండు రసం కివి డ్రాగన్ ఫ్రూట్ లాంటి తింటే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి అనుకుంటారు. ఆకు పసర్లు వల్ల కీడే కాని మేలు ఏమీ లేదు. పండు తినడం రోగికి మంచిదే అయినా ఆశించిన ఫలితాన్ని ఏ ఫలాలు ఇవ్వవు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, July 30, 2024, 14:43 [IST]
Desktop Bottom Promotion