Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
Cancer Causing Foods : ఇవి తింటే క్యాన్సర్ డేంజర్..! పరిశోధనలో పచ్చి నిజాలు..!
ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారం తినడం మాత్రమే కాదు పోషకాలు ఉన్న ఆహారాల్లో కూడా మనకు తెలియని కొన్ని హానికర బ్యాక్టీరియాలు ఉంటాయ్. అవి ప్రాణాంతక క్యాన్సర్‌కు దారితీస్తాయ్. శరీరానికి, బలానికి మాంసం మంచిదే అంటారు, దాంట్లో ప్రొటీన్ శాతం చాలా ఎక్కువుంటుందని చెబుతుంటారు. క్యాన్స్ నిపుణులు ఈ విషయాన్ని అస్సలు ఒప్పుకోవడం లేదు. మాంసంలో క్యాన్సర్‌కు కారణమయ్యే కార్సినోజెన్ ఉంటుందని కాబట్టి దాన్ని తినకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు.
చాలా పరిశోదనల తరువాత క్యాన్సర్‌కు ప్రధానంగా కారణమయ్యే ఆహారం గురించి మీకు వివరిస్తున్నాము. ఇప్పటి వరకు గనుక మీరు ఈ ఆహారాన్ని తింటున్న వారైతే తక్షణం వీటిని మీ మెన్యూ లిస్ట్ నుంచి తొలగించండి. ఆరోగ్యానికి మించినది ఏదీ లేదు. స్టేటస్ కోసం, రుచి కోసం కాకుండా మన ఆరోగ్యం బాగుకోసం తిందాము. పరిశోధకులు, వైద్యులు చెబుతున్నా హానికర ఆహారాల గురించి తెలుసుకుందాం. ఇవి తినకుండా ఉంటే క్యాన్సర్ అవకాశాలు చాలా తగ్గిపోతాయ్.
నిలువ వుంచిన మాంసం
ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ మాంసం జోరందుకుంది. నిలువ వుంచిన మాంసం పెరుగుతోంది. గతంలో అప్పటికప్పుడు కోసిన మాంసాన్ని ఇంటికి తెచ్చుకొని అప్పటికప్పుడే వండుకొని తినేవారు కానీ ఇప్పుడు, హాట్ డాగ్స్, ఫ్రైడ్ చికెన్, ఇన్స్‌ట్యాంట్ క్రిస్పీ చికెన్ లాంటి సగం వండిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఇలా మాంసాన్ని నిలువ వుంచడానికి ఉప్పును, హానికరమైన నైట్రేట్ రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ కెమెకల్స్ శరీరంలోకి వెళ్లి క్యాన్సర్‌కు కారణం కావచ్చని ఇంగ్లాండ్‌కు చెందిన క్యాన్సర్ రిసర్చ్ పరిశోధకులు చెబుతున్నారు.

మద్యం
కొంత మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిదని కొందరు చెబుతున్నా బ్రిటెన్ పరిధోధకులు మాత్రం మద్యాన్ని పూర్తిగా మానేస్తే క్యాన్సర్ ముప్పు నుంచి బయటపడవచ్చంటున్నారు. మద్యం శరీరంలోకి వెళ్లి శరీరాన్ని రిపేర్ చేసే ప్రక్రియను, సెల్స్‌ను డ్యామేజ్ చేస్తున్నట్లు పరిశోధనలో కనుగ్గొన్నామని చెబుతున్నారు. మద్యం అలవాటు ఉండి సిగరెట్ అలవాటు కూడా ఉన్నవారు క్యాన్సర్ డేంజర్ జోన్‌లో ఉన్నట్టేనని అంటున్నారు. ఒక వారం ఒక బాటిల్ మద్యం తాగితే, 10 సిగరెట్లు తాగిన వాటితో సమానమంటున్నారు. కేవలం మద్యం వల్ల ఆరు రకాలు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోదకులు హెచ్చరిస్తున్నారు.
రెడ్ మీట్
నాలుగు కాళ్లున్న జంతువుల మాంసాలన్నింటినీ రెడ్ మీట్ అంటారు. మేక మాంసం, ఆవు మాంసం, జింక మాంసం, పంది మాంసం, ఇవన్నీ రెడ్ మీట్ జాబితాలోకి వస్తాయ్. ఇక చికెన్ రెడ్ మీట్ కిందకు రాదు. అయితే రెడ్ మీట్‌ను కూడా చాలా నిలువ వుంచడం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందంటున్నారు. క్యాన్సర్‌కు రెడ్ మీట్‌కు చాలా దగ్గరి సంబంధం ఉందని కూడా పరిశోధనలు బయటపడ్డాయ్.
చెక్కర, వేపుడు పదార్ధాలు
బేకరీ ఫుడ్‌ను కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిదంటున్నారు. వీటినే మనం జంక్ ఫుడ్ అని కూడా అంటాం. మొత్తం 13 రకాల క్యాన్సర్లు వీటి వల్ల ప్రబిలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రోజూ బేకరీ ఐటమ్స్ తినకుండా నెలకి ఒకసారి, రెండు సార్లు తింటే రిస్క్ తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఫైబర్ కంటెంట్ కూడా వీటిలో కొంత కూడా ఉండకపోవడం మొత్తం జీర్ణ వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందంటున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications