పెర్ఫ్యూమ్‌ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.!

పెర్ఫ్యూమ్‌ కేవలం శరీరంపై సువాసనను పెంచడమే కాదు.. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మంచి అనుభూతిని ఇస్తుంది. కొందరు పెర్ఫ్యూమ్‌లను ప్రతి రోజూ స్ప్రే చేసుకుంటే.. మరికొందరు ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే చల్లుకుంటారు. అయితే చాలా మందికి పెర్ఫ్యూమ్‌ ఎలా ఉపయోగించాలి.. ఏ పద్ధతి సరైనది అనేది చాలా మందికి తెలియదు. దీంతో చాలా ఖరీదు పెట్టి కొన్న వాటి ప్రభావం కూడా తగ్గిపోతుంది. బాడీపై వాటి సువాసన ఎక్కువ సేపు ఉండదు. ఈ క్రమంలో మీరు పెర్ఫ్యూమ్‌ను ఇష్టపడేవారైతే ఈ తప్పులను నివారించండి.

These mistakes made while spraying perfume reduce the fragrance

రాజుల కాలం నుంచీ వివిధ రకాల పద్ధతుల్లో ఈ పన్నీటి సువాసలు సుపరిచితమే. ఇక, ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీల మోడల్స్‌ కూడా విస్తృతం కావడంతో వివిధ రకాల బ్రాండ్‌లు, ఖరీదైనవి అందుబాటులో ఉన్నాయి. అందుకే కొనుగోలు చేసేటప్పుడు ఆచితూచీ పరిశీలించి మంచి బ్రాండ్లను ఎంచుకుంటారు. కానీ ఉపయోగించేటప్పుడు మాత్రం కొన్ని పొరపాట్ల కారణంగా దాని ప్రభావాన్ని పూర్తిగా ఆస్వాదించలేరు. పెర్ఫ్యూమ్‌ సువాసనని సంపూర్ణంగా ఆస్వాదించాలంటే ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

పొడి చర్మంపై పెర్‌ఫ్యూమ్‌ వద్దు..

పెర్ఫ్యూమ్‌ను చాలా మంది చర్మంపై నేరుగా పూసుకోవడం వల్ల సువాసన త్వరగా వదిలిపోతుంది. దీంతో ఎక్కువసేపు చర్మం తాజాగా ఉండదు. సెంట్‌ రాసేముందు మీ చర్మం తగినంత తేమగా ఉంచుకోవాలి. ఇందుకోసం మాయిశ్చరైజర్‌ లేదా పెట్రోలియం జెల్లీ అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు.

These mistakes made while spraying perfume reduce the fragrance

బట్టలపై ఎక్కువగా వాడటం

కొంతమంది డ్రెస్‌ చేసుకున్న తర్వాత బట్టలపై పెర్ఫ్యూమ్‌ చల్లుకుంటారు. ఇది చాలా తప్పు. దీని వల్ల బట్టలు త్వరగా పాడైపోతాయి. డ్రెస్‌పై పెర్ఫ్యూమ్‌ చల్లుకోవాలనుకుంటే కనీసం 6 అంగుళాల దూరం పాటించాలి. చర్మంపై తక్కువగా చల్లుకోవాలి. ఇలా చేయడం ద్వారా సువాసన ఎక్కువసేపు నిలిచి తాజాగా ఉంటుంది.

చిన్న వయసులోనే మెటబాలిక్‌ సిండ్రోమ్‌.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్‌.!చిన్న వయసులోనే మెటబాలిక్‌ సిండ్రోమ్‌.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్‌.!

చెమటపైనే పెర్ఫ్యూమ్‌

పెర్ఫ్యూమ్ రాసుకోవడం ద్వారా సువాసనను ఇస్తూ చెమట వాసన రాకుండా నిరోధిస్తుంది. అందుకే చాలా మంది తెలియక చెమట పట్టిన తర్వాత పెర్ఫ్యూమ్‌ చల్లుకుంటారు. ఇది ఆ చెడు వాసనతో కలిసి మరింతి దుర్వాసనకి దారితీస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చెమటపైన పెర్ఫ్యూమ్‌ రాయకండి.

మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్‌ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.!మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్‌ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.!

తడి చర్మంపై వద్దు..

స్నానం చేసిన వెంటనే తడిపైన పెర్ఫ్యూమ్‌ అప్లై చేసుకోకూడదు. ఇలా చేయడం ద్వారా సువాసన త్వరగా వదిలిపోతుంది. శుభ్రమైన టవల్‌తో ఆరబెట్టుకున్న తర్వాత మాయిశ్చరైజర్‌ రాసిన అనంతరం పెర్ఫ్యూమ్‌ చల్లుకుంటే సువాసన ఎక్కువ సేపు తాజాగా ఉంటుంది. ఈ పొరపాట్లను నివారించడం ద్వారా మీరు వాడే పెర్ఫ్యూమ్‌ వృథా కాకుండా ఉంటుంది. నలుగురిలో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యేలా చేస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Thursday, September 24, 2026, 13:52 [IST]
Desktop Bottom Promotion