Latest Updates
-
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ.. -
అక్టోబర్ నెలలో పుట్టిన అమ్మాయిల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసా? -
కేవలం 10 నిమిషాల్లో రవ్వ బన్ దోస,స్పెషల్ టమాటా చట్నీ.. ఈ రహస్యం తెలిస్తే రోజూ ఇదే కావాలంటారు! -
అక్టోబర్ 3న భయంకరమైన గ్రహం నక్షత్ర మార్పు.. ఈ మూడు రాశుల వారికి కష్టాల కడలి.! -
రోజుకు ఎన్ని కప్పుల టీ తాగొచ్చు? -
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా..
మీకు నిజంగా బీపీ ఉందా.. ఈ చిన్న తప్పులే మందులు వాడేలా చేస్తాయని తెలుసా.?
ఆరోగ్యకరమైన జీవితానికి రక్తపోటు నియంత్రణలో ఉండటం చాలా ముఖ్యం. ఏదైనా అనారోగ్యం కారణంగా ఆస్పత్రికి వెళితే ముందుగా చెక్ చేసేది బీపీ రీడింగ్ మాత్రమే. ఆ తర్వాతే మందులు, చికిత్స మొదలుపెడతారు. కానీ మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే బీపీ పాయింట్లను పెంచి అనవసరంగా మందులు వాడేలా చేస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ తప్పులు ఏంటో తెలుసుకుందాం..

సాధారణ రక్తపోటు 120/80 mm HGగా ఉంటుంది. ఇంతకు మించితే దానిని అధిక రక్తపోటుగా వైద్యులు పరిగణిస్తారు. దీంతో మందులు వాడాల్సి ఉంటుంది. అందుకే హాస్పిటల్‌లో లేదా ఇంట్లో బీపీ చెక్ చేసుకునేముందు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే బీపీ పాయింట్లు ఉన్నదానికంటే ఎక్కువగా చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ సమయంలో వద్దు
యూరిన్ అర్జెంటుగా వస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బీపీ చెక్ చేయుంచుకోకూడదు. యూరిన్ బ్లాడర్ ఫుల్‌గా ఉన్నప్పుడు రక్తనాళాలపై ఒత్తిడి పడి బీపీ రీడింగ్ అసలు దానికంటే 33 పాయింట్లు ఎక్కువగా చూపిస్తుంది.
ఒకే చేతికి వద్దు
బీపీ చెక్ చేయించుకునేటప్పుడు ఎప్పుడూ ఒకే చేతికి చేయించుకోకూడదు. రెండు చేతులకూ చేయించుకోవాలి. రెండు చేతుల మధ్య సాధారణంగా 10 పాయింట్ల తేడా చూపిస్తే అది రక్త నాళాల బ్లాకేజీని సూచిస్తుందని చెబుతున్నారు. అందుకే ఒక చేతికి బీపీ రీడింగ్ ఎక్కువగా వచ్చినప్పుడు రెండో చేతికి తప్పనిసరిగా చెక్ చేయించుకోవాలి.
కూర్చునే పద్ధతి
హాస్పిటల్‌లో ఎప్పుడూ బెడ్ మీద కూర్చుని కాళ్లు ఊపుతూ, వేళ్లాడేస్తూ బీపీ చెక్ చేయించుకోకూడదు. దీని వల్ల రక్తనాళాలపై ఒత్తిడి పెరిగి రీడింగ్ పెంచుతుంది. కుర్చీలో కూర్చుని వీపు వెనక్కి వాల్చి నిటారుగా కూర్చుని చెక్ చేసుకోవాలి.
చేతులు వేళ్లాడేయకూడదు
బీపీ చెకింగ్ సమయంలో చేతులు కిందకు వేళ్లాడదీయకూడదు. లేదా ఒళ్లో పెట్టుకోకూడదు. దీని వల్ల 10 పాయింట్లు ఎక్కువగా చూపిస్తుంది. మోచేతి నుంచి సమానంగా టేబుల్‌పైన పెట్టాలి. దీని ద్వారా సరైన రీడింగ్ చూపిస్తుంది.

టెన్షన్ వద్దు
బీపీ చెక్ చేసుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. హడావుడిగా నడుచుకుంటూ వచ్చి బీపీ చూసుకోవడం లేదా ఫోన్ మాట్లాడుతూ చెక్ చేసుకోవడం చేయకూడదు. దీని ద్వారా 10 పాయింట్లు ఎక్కువ చూపిస్తుంది. ఒక ఐదు నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత పరిశీలించుకోవాలి.
ఈ పానీయాల తర్వాత
కాఫీ, టీ, ఆల్కహాల్ తాగిన తర్వాత బీపీ చెక్ చేసుకుంటే రీడింగ్‌లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. రాత్రి ఆల్కహాల్ తాగి ఉదయాన్నే చెక్ చేసుకున్నా నెగిటివ్ ఫలితాలు రావచ్చు. అందుకే వాటికి దూరంగా ఉండాలి.
చర్మంపైనే చెక్ చేసుకోవాలి
బీపీ బెల్ట్ మోచేతి పైభాగంలో పెడతారనే విషయం తెలిసిందే. అయితే ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకున్నప్పుడు అలాగే మోచేతిపైన బెల్ట్ పెట్టడం వల్ల రీడింగ్ తప్పుగా చూపిస్తుంది. మోచేతి పైకి, భుజానికి కిందికి క్లాత్ ఉంచి బెల్ట్ పెట్టే ప్లేస్‌లో మాత్రం చర్మం ఉండేలా చూసుకోవడం ద్వారా సరైన రీడింగ్ కనిపిస్తుంది.
ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా బీపీ లెవెల్స్ కరెక్టుగా చూపిస్తాయి. దాని ద్వారానే మీకు అధిక రక్తపోటు ఉందా లేదా అని నిర్ధారిస్తారు. లేదంటే అనవసరంగా మందులా వాడే పరిస్థితికి దారితీస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
