ప్రెగ్నెన్సీ ప్రయత్నాల్లో ఉన్నారా.. పీరియడ్స్‌లో ఈ మార్పులను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!

ఈ రోజుల్లో మహిళల్లో గర్భధారణ ఆలస్యం కావడమనేది సాధారణ సమస్యగా మారిందనే చెప్పవచ్చు. పెరుగుతున్న సంతానలేమి సమస్యలు, అందుకు పరిష్కారంగా అత్యాధునిక ఫెర్టిలిటీ చికిత్సలే ఇందుకు ఉదాహరణ. ఈ క్రమంలో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న మహిళలు రుతుస్రావం సమయంలో ఈ మార్పులను నిర్లక్ష్యం చేయవద్దని గైనకాలజిస్టు నిపుణులు సూచిస్తున్నారు.

trying to conceive should not ignore these changes in their menstrual cycle

సంతానం కోసం ప్రయత్నిస్తున్న మహిళల్లో రుతుచక్రం ప్రక్రియ కీలక పాత్ర పోషిస్తుంది. రుతుచక్రం మీదనే అండాశయాల పనితీరు, అండాల నాణ్యత, గర్భాశయ ఆరోగ్యం, హార్మోన్ల సమతుల్యత ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో రుతుస్రావం ఆరోగ్యకరంగా ఉండటం, రుతుచక్రం క్రమపద్ధతిలో జరిగితేనే పునరుత్పత్తి వ్యవస్థ సమక్రంగా పనిచేస్తుందని అర్థమని నిపుణులు చెబుతున్నారు.

రుతుస్రావంలో ఈ మార్పులు చోటుచేసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. గర్భధారణ ప్రక్రియకు మీ బాడీ రెడీగా ఉందా లేదా అనేది పీరియడ్స్‌లో ఈ సంకేతాలు సూచిస్తాయి. మరి ఆ మార్పులు ఏంటి.. మీరూ సంతానం కోసం ప్రయత్నిస్తూ మీ పీరియడ్స్‌లో ఈ ఛేంజెస్‌ చూస్తున్నారా.. ఒకసారి ఈ కథనం ద్వారా చెక్‌ చేసుకోండి..

పునరుత్పత్తి వ్యవస్థలో కీలకమైనది అండోత్సర్గం(Ovulation). మహిళల్లో అండోత్సర్గం ఎప్పుడవుతుందనేది మీకు వచ్చే పీరియడ్స్‌ వ్యవధి తెలియజేస్తుంది. ఆరోగ్యకరమైన నెలసరి 21 రోజుల నుంచి 35 రోజుల వ్యవధిలో జరుగుతుంది. రుతుచక్రం 21 రోజుల ముందు లేదా 35 రోజుల తర్వాత జరిగినట్లయితే అండోత్సర్గం సరిగ్గా జరగడం లేదని సూచిస్తుంది. దీంతో ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గుతాయని అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

రుతుచక్రంలో ఆరోగ్యకరమైన రుతుస్రావం మూడు నుంచి రోజుల పాటు ఎలాంటి గడ్డలు లేకుండా సాఫీగా జరుగుతుంది. అయితే రక్తస్రావం చాలా తక్కువగా జరిగినా లేదా ఆలస్యమైనా గర్భాశయ పొర సరిగా నిర్మాణం అవడం లేదని అర్థం. ఈస్ట్రోజెన్‌ లెవెల్స్‌ తక్కువగా ఉండటం, పోషకాహార లోపం ఇందుకు కారణం కావచ్చు. ఇలాంటి పరిస్థితి వస్తే మహిళలు తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించాలి.

trying to conceive should not ignore these changes in their menstrual cycle

కొందరిలో రుతుస్రావం సమయంలో చాలా నొప్పి ఉంటుంది. లేదా పెద్ద రక్త గడ్డలు పడుతుంటాయి. ఇందుకు హార్మోన్ల అసమతుల్యత కారణం కావచ్చు. గర్భాశయంలో వాపు కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. దీని వల్ల అండోత్సర్గం, ఇంప్లాంటేషన్‌ ప్రక్రియపై ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి సమస్య ఎదురైతే వెంటనే నిపుణుల సలహా తీసుకోవాలి.

రుతుస్రావం ఆరంభమయ్యే ముందు, తర్వాత కొందరిలో రక్తస్రావం ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది. ఇలా జరగడం ద్వారా గర్భధారణ ప్రక్రియలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ప్రొజెస్టిరాన్ హార్మోన్‌ తక్కువగా ఉంటే ఇలా జరుగుతుంది. ప్రెగ్నెన్సీ నిలబడటానికి ప్రొజెస్టిరాన్‌ స్థాయిలు ఆరోగ్యకరంగా ఉండటం ముఖ్యం. మీకు ఇలా జరుగుతున్నట్లయితే వెంటనే గైనకాలజిస్టు నిపుణులను సంప్రదించాలి.

కొందరు మహిళల్లో నెలసరికి కొన్ని రోజుల ముందు శారీరకంగా, మానసికంగా చాలా మార్పులు చోటుచేసుకుంది. భావోద్వేగాల్లో తేడాలు, విపరీతంగా కడుపు ఉబ్బరం, ఛాతీ నొప్పి, తీవ్రంగా ఆకలి కోరికలు ఇవన్నీ అనుభవిస్తారు. ఇది హార్మోన్ల అసమతుల్యతని, రక్తంలో చక్కెర స్థాయిల్లో హెచ్చుతగ్గులను సూచిస్తుంది. ఫలితంగా అండాల నాణ్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీంతో గర్భధారణకి సమస్యలు ఏర్పడతాయి. సంతానం కోసం ప్రయత్నిస్తూ రుతుచక్రం, రుతుస్రావంలో మీరూ ఈ మార్పులను గమనించినట్లయితే వెంటనే సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించాలి.

ఇదిలా ఉండగా ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న దంపతులు కొన్ని పొరపాట్లు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. దంపతులు ప్రతిరోజూ లైంగికంగా కలవకూడదని.. దీని వల్ల వీర్యకణాల నాణ్యత తగ్గిపోతుందని అంటున్నారు. రోజు విడిచి రోజు కలవడం బెస్ట్‌ అని సూచిస్తున్నారు. మీ పీరియడ్స్‌ వ్యవధిని బట్టి అండోత్సర్గం తేదీని చూసుకుని దానికి ముందు తర్వాత తప్పనిసరిగా దంపతులు కలవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ నెలల్లో తప్పనిసరిగా ప్రెగ్నెన్సీ కావాలని ఒత్తిడితో ఉండకుండా మానసికంగా, శారీరకంగా ప్రశాంతంగా ఉండాలని సూచిస్తున్నారు. సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరుచుకోవాలని చెబుతున్నారు.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, June 27, 2026, 19:37 [IST]
Desktop Bottom Promotion