Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Union Budget 2026: డయాబెటిస్, క్యాన్సర్ బాధితులకు భరోసా..రూ. 10,000 కోట్లతో బయో-ఫార్మా శక్తి పథకం
ప్రస్తుత ఆధునిక సమాజంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం కలిపి మానవాళిని తీవ్రమైన అనారోగ్య సమస్యల వైపు నెట్టివేస్తున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి అసంక్రమిత వ్యాధులు నేడు చిన్నారులను సైతం పట్టిపీడిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఇలాంటి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం. ఈ విపత్కర పరిస్థితులను నిశితంగా గమనించిన కేంద్ర ప్రభుత్వం, ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్ లో ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.

ఏంటీ బయో-ఫార్మా శక్తి పథకం?
ప్రజలకు కేవలం మందులు ఇవ్వడమే కాదు, వారికి నాణ్యమైన జీవితాన్ని, దీర్ఘాయువును అందించడమే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి 1,2026)పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ 2026-27 ప్రవేశపెడుతున్న సందర్భంగా బయో-ఫార్మా శక్తి అనే కొత్త పథకాన్ని ప్రతిపాదించారు.
సంప్రదాయ రసాయన మందుల కంటే, జీవకణాల ఆధారంగా తయారయ్యే బయోలాజికల్ డ్రగ్స్ లేదా జీవసంబంధమైన మందులు క్యాన్సర్, డయాబెటిస్ వంటి మొండి వ్యాధులపై అత్యంత సమర్థవంతంగా పనిచేస్తాయి. అందుకే ఈ రంగంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది.
రూ. 10,000 కోట్లు.. ఐదేళ్ల ప్రణాళిక
భారతదేశాన్ని ప్రపంచ బయో-ఫార్మా తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడానికి కేంద్రం కంకణం కట్టుకుంది. ఇందులో భాగంగా రాబోయే ఐదు సంవత్సరాల కాలానికి గానూ ఏకంగా రూ. 10,000 కోట్ల భారీ నిధులను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.
ఈ నిధులు కేవలం మందుల తయారీకే కాకుండా, ఈ రంగానికి అవసరమైన అత్యాధునిక మౌలిక వసతుల కల్పనకు, పరిశోధనలకు వెచ్చించనున్నారు.
లక్ష్యాలు - ప్రయోజనాలు
స్వయం సమృద్ధి
క్లిష్టమైన వ్యాధుల నివారణకు అవసరమైన బయో-ఫార్మా మందుల కోసం విదేశాలపై ఆధారపడకుండా, స్వదేశంలోనే వాటిని ఉత్పత్తి చేయడం.
తక్కువ ధరకే ట్రీట్మెంట్
స్థానికంగా ఉత్పత్తి పెరగడం వల్ల, సామాన్యుడికి సైతం ఖరీదైన క్యాన్సర్, డయాబెటిస్ మందులు అందుబాటు ధరలో లభిస్తాయి.
ఇన్నోవేషన్ హబ్
మన దేశంలోని శాస్త్రవేత్తలకు, ఫార్మా కంపెనీలకు పరిశోధనలు చేయడానికి ఈ నిధులు ఊతమిస్తాయి. దీనివల్ల కొత్త మందులు, టీకాలు భారత్ నుండే ప్రపంచానికి అందుతాయి.
ఇప్పటికే ప్రపంచ ఫార్మసీగా పేరుగాంచిన భారతదేశం ఈ కొత్త పథకం ద్వారా బయో-టెక్నాలజీ రంగంలోనూ అగ్రగామిగా ఎదగనుంది. ఈ బయో-ఫార్మా శక్తి పథకం అటు ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే కాకుండా, ఇటు కోట్లాది మంది భారతీయులకు ఆరోగ్య భరోసాను కల్పిస్తుందనడంలో సందేహం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications