Latest Updates
-
2027లో బంగారం ధర ఎంత ఉంటదో తెలుసా? బాబా వంగా సంచలన జోస్యం! -
ముంబై ఫేమస్ బాంబే ఐస్ హల్వా.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి -
జామ ఆకుల టీని రోజుకు ఒక్క కప్పు తాగితే చాలు.. ఈ 4 భయంకరమైన ఆరోగ్య సమస్యలు మాయం! -
అన్నం, చపాతీల్లోకి పర్ఫెక్ట్.. సొరకాయ కోఫ్తా కర్రీ ఇలా చేశారంటే కేక టేస్ట్! -
చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి జామ్..మీ ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా.. -
హెల్తీగా ఉంటాం, బరువు తగ్గొచ్చని ఓట్స్ తింటున్నారా? ఈ విషయం తెలియకుంటే డేంజర్ లో పడతారు! -
ఐరన్, విటమిన్స్ నిండిన మునగాకు గోధుమ దోసె..బరువు తగ్గాలనుకునేటోళ్లకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ -
ఫోన్ పగలగొట్టాడని తండ్రిని దారుణంగా చంపిన కూతురు! -
కాలిఫ్లవర్ తో ఇలా చేస్తే పకోడీ కూడా పనికిరాదు.. టేస్ట్ అదుర్స్! -
నడుము నొప్పితో విసిగిపోయారా? మీ వెన్నెముకను ఉక్కులా మార్చేసే చిట్కా ఇదే!
జలుబు, దగ్గు నుండి పీరియడ్స్ సమస్యల వరకు..స్టార్ అనాసను ఇలా వాడారంటే ఆ సమస్య కూడా పోతుంది
విదేశాల్లో అయితే ఎలాంటి రోగం వచ్చినా హాస్పిటల్ కి పరుగెత్తుతుంటారు. అదే మనదేశంలో మన వంటగదుల్లోనే అనేక రోగాలకు మెడిసిన్ ఉంటుంది. మన వంటదుల్లో ఉండే,నిత్యం కూరల కోసం మనం వాడే కొన్ని పెద్ద పెద్ద వ్యాధులకు చెక్ పెట్లగలవు. నిద్రలేమి సమస్య దగ్గర నుంచి ఆడవాళ్ల పీరియడ్ సమస్య వరకు అనేక సమస్యలకు మన వంటగదే ఔషధశాల.కూరల్లో,బిర్యానీల్లో రుచి కోసం వాడే స్టార్ అనాస ఆరోగ్యానికి బోలెడంత మేలు చేస్తుందని మీకు తెలుసా?
స్టార్ అనాసను చక్ర పువ్వు, అనాస పువ్వు అని కూడా పిలుస్తారు. చూడటానికి అందమైన నక్షత్రంలా ఉండే ఈ మసాలా దినుసు తనలో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను దాచుకుంది. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు, వర్షాకాలంలో మనల్ని అనారోగ్యాల బారి నుండి కాపాడే ఒక దివ్యౌషధం ఇది. ఆయుర్వేదం దీనిని రోగనిరోధక శక్తికి కవచంగా అభివర్ణించగా..మోడ్రన్ సైన్స్ కూడా దీనిలోని అద్భుత గుణాలను అంగీకరించింది.

వర్షాకాలపు నేస్తం
వర్షాకాలం వచ్చిందంటే చాలు, జలుబు, దగ్గు సహజంగా వస్తుంటాయి. అయితే మీ ఇంట్లో స్టార్ అనాస ఉంటే చింతించాల్సిన పనిలేదు. ఇందులో ఉండే షికిమిక్ ఆమ్లం, యాంటీవైరల్ గుణాలు వైరస్లతో పోరాడి, జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. వేడి వేడి టీలో లేదా కషాయంలో ఒక స్టార్ అనాస వేసుకుని తాగితే చాలు హాయిగా ఉంటుంది.
జీర్ణశక్తికి పరిష్కారం
వర్షాకాలంలో జీర్ణ సమస్యలు కూడా సర్వసాధారణం. గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు స్టార్ అనాస ఒక చక్కని పరిష్కారం. భోజనం తర్వాత దీనిని తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడి, కడుపు తేలికపడుతుంది.
శక్తికి సంజీవని
తరచుగా నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తుంటే..స్టార్ అనాసను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరిగి, నూతనోత్తేజం వస్తుంది. ఇది శరీరంలోని బలహీనతను తరిమికొట్టి, మిమ్మల్ని చురుకుగా ఉంచుతుంది.
మహిళల ఆరోగ్యానికి వరం
మహిళలలో హార్మోన్ల అసమతుల్యత, ఋతుక్రమ సమస్యల సమయంలో చక్ర ఫూల్ ఎంతగానో సహాయపడుతుంది. దీనిలోని ఫైటోఈస్ట్రోజెన్లు శరీరంలో హార్మోన్లను సమతుల్యం చేసి ఆ సమయంలో కలిగే ఇబ్బందుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
ఇన్ఫెక్షన్లకు రక్షణ కవచం
స్టార్ అనాసలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు శరీరాన్ని హానికరమైన ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి. ముఖ్యంగా వానాకాలంలో వచ్చే చర్మ, ఇతర ఇన్ఫెక్షన్లను నివారించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది.
ప్రశాంత నిద్రకు మార్గం
నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి స్టార్ అనాస ఒక వరం. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో లేదా టీలో కొద్దిగా స్టార్ అనాస పొడిని కలుపుకుని తాగితే మనసు ప్రశాంతపడి, గాఢమైన నిద్ర మీ సొంతమవుతుంది.
ఎలా వాడాలి?
ఘుమఘుమలాడే బిర్యానీ, పులావ్ లలో ఒకటి వేయండి.
మీరు రోజూ తాగే టీ లేదా కషాయంలో ఒక ముక్క వేసి మరిగించండి.
కూరల మసాలాలో దీనిని కూడా చేర్చండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
