40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే..

త్రిష..ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి మంచి స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇప్పుడు తమిళనాడులో ఆమె పేరు రాజకీయంగా కూడా నిత్యం ఏదోరకంగా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. దీని కారణం తమిళనాడు సీఎం విజయ్ తో ఆమె రిలేషన్. అయితే వీరిద్దరూ మాత్రం అధికారికంగా తమ రిలేషన్ గురించి ఎక్కడా ప్రకటించలేదు.

ఇదిలాఉంటే, త్రిష అందం గురించి కూడా తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంటది. 43 ఏళ్ల వయస్సులో కూడా ఆమె అందాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసిస్తుంటారు.

Vitamin D After 40 Why Trisha Krishnan Swears by Morning Sunlight for Better Health

ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో త్రిష ఫ్యాన్ పేజీలో షేర్ చేయబడిన ఒక వీడియోలో..నల్లటి క్రాప్ టాప్, ట్రాక్ ప్యాంట్ ధరించి, చెవులకు ఇయర్‌ ఫోన్స్ పెట్టుకుని ఉదయపు లేత సూర్యకిరణాలను ఆస్వాదిస్తున్నారు త్రిషా కృష్ణన్. తన మార్నింగ్ వాక్ కు సంబంధించిన ఈ బ్యూటిఫుల్ మూమెంట్‌ ను అభిమానులతో పంచుకుంటూ..మరింత విటమిన్ డి అని ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు.

త్రిష పోస్ట్ చూశాక అందరి మదిలో మెదిలే ఆసక్తికరమైన ప్రశ్న ఒక్కటే.. అసలు 40 ఏళ్లు దాటిన తర్వాత శరీరానికి విటమిన్ డి అవసరం నిజంగానే పెరుగుతుందా? కేవలం రోజూ కాసేపు ఎండలో నిలబడితే ఆ లోపం తీరిపోతుందా?దీని వెనుక ఉన్న అసలు నిజాలు, నిపుణులు ఏం అంటున్నారో ఇక్కడ చూడండి.

రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా?రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా?

40 ఏళ్ల తర్వాత విటమిన్ D ఎందుకంత కీలకం?

సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మన ఎముకల సాంద్రత, కండరాల బలం క్రమంగా తగ్గుముఖం పడతాయి. ఈ వయసులో మనం తీసుకునే ఆహారంలోని కాల్షియంను మన శరీరం సమర్థవంతంగా గ్రహించాలంటే విటమిన్ D చాలా అవసరం. ఇది ఎముకలను దృఢంగా ఉంచడమే కాకుండా, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది.

శరీరంలో విటమిన్ D లోపిస్తే.. ఊరికే అలిసిపోవడం, కీళ్ల నొప్పులు రావడం, అలాగే వయసు పైబడిన వారిలో కింద పడిన వెంటనే ఎముకలు విరగడం లేదా ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందుకే 40 పదుల వయసులో అడుగుపెట్టిన వారు తమ శరీరంలో తగినంత విటమిన్ D ఉండేలా చూసుకోవడం అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా?

సూర్యరశ్మిని విటమిన్ Dకి న్యాచురల్ పవర్‌ హౌస్ అని చెప్పొచ్చు. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ బి (UV-B) కిరణాలు మన చర్మంపై పడినప్పుడు, శరీరం దానంతట అదే విటమిన్ Dని ఉత్పత్తి చేసుకుంటుంది. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. ఎండలో నిలబడినంత మాత్రాన అందరికీ ఒకేలా విటమిన్ D అందదని.. మన చర్మం రంగు, వయసు, మనం వేసుకున్న దుస్తులు, వాతావరణ కాలుష్యం, మనం ఉండే భౌగోళిక ప్రాంతం, ఎండలో గడిపే సమయం వంటి అనేక అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని నిపుణులు తెలిపారు.

చర్మం రంగు ముదురుగా ఉన్నవారిలో, కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నివసించే వారిలో విటమిన్ D ఉత్పత్తి నెమ్మదిగా ఉంటుంది. పైగా వయసు పైబడే కొద్దీ విటమిన్ Dని తయారు చేసుకునే చర్మ సామర్థ్యం సహజంగానే తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పటికే మీలో విటమిన్ D లోపం ఉంటే కేవలం ఎండలో కూర్చోవడం వల్లే ఆ లోపం పూర్తిగా తీరిపోతుందని భావించడం పొరపాటే.

విటమిన్ D సప్లిమెంట్లు అందరూ వాడాలా?

ముందుగా డాక్టర్లను సంప్రదించి, రక్తపరీక్ష చేయించుకోవాలి. అందులో నిజంగానే విటమిన్ డి లోపం ఉందని తేలితేనే, డాక్టర్ సూచన మేరకు సరైన మోతాదులో మాత్రమే ట్యాబ్లెట్స్ వాడాలి. సొంత వైద్యం చేసి మోతాదుకు మించి సప్లిమెంట్లు తీసుకుంటే, రక్తంలో కాల్షియం లెవల్స్ అసాధారణంగా పెరిగిపోయి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం, గుండెకు సంబంధించిన కొత్త సమస్యలు రావడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Tuesday, October 6, 2026, 17:37 [IST]
Desktop Bottom Promotion