Latest Updates
-
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు! -
మీ లవర్ లో ఈ 5 అవలక్షణాలు ఉంటే.. మీ లైఫ్ రిస్క్ లో పడ్డట్టే! -
సోషల్ మీడియాని ఊపేస్తున్న చిల్లీ ఎగ్స్ కర్రీ.. మీ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసెయ్యండి.. -
మిక్సీతో పనేలేదు, మసాలా నూరక్కర్లేదు..10 నిమిషాల్లోనే సూపర్ టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేసుకోవాలంటే.. -
మీరు తీసుకునే నిర్ణయాలు మీవేనా? లేక ఇతరుల మాయలో పడుతున్నారా? మానిప్యులేటర్లను ఇలా గుర్తించండి! -
బజ్జీ, సమోసాలకు గుడ్ బై: సాయంత్రం వేళ ఈ కరకరలాడే బీరకాయ టిక్కీ ట్రై చేయండి!
Boost Happy Hormones: ఇలా చేస్తే హ్యాపీ హార్మోన్లు పెరుగుతాయి, మీరు మరింత హ్యాపీగా ఉంటారు
ప్రతి వ్యక్తి జీవితంలోనూ నిరాశ నిస్పృహలు ఉంటాయి. బాధలు సతమతం చేస్తుంటాయి. కష్టాలు ఇబ్బంది పెడుతుంటాయి. బాధలు, భావోద్వేగాలు అన్నీ మానసిక సంబంధం అయినవి. ఏదైనా విషయం పట్ల మనం స్పందించే తీరు వల్ల భావోద్వేగాలు వస్తుంటాయి.
ఒక అంశం పట్ల మనం ఎలా స్పందిస్తామన్నదానిపై మెదడు హార్మోన్లు రిలీజ్ చేస్తుంటుంది. ఆ హార్మోన్ల వల్ల బాధ, కోపం, సంతోషం, ప్రేమ లాంటి అనుభూతులను అనుభవిస్తుంటాం. సుఖానికైనా, దుఃఖానికైనా హార్మోన్లదే కీలక పాత్ర.

ఫీల్ గుడ్ హార్మోన్లు అంటే ఏంటి?
కొన్ని హార్మోన్ల వల్ల సంతోషంగా ఉంటాం. కొన్ని హార్మోన్ల వల్ల కోపంగా, బాధగా ఉంటాం. హార్మోన్లు శరీరానికి మెసేంజర్లుగా పని చేస్తాయి. మన శారీరక పనితీరు నుండి మన భావోద్వేగ శ్రేయస్సు వరకు ప్రతిదీ హార్మోన్ల నియంత్రణలో ఉంటాయి.
ఈ హార్మోన్లలు చాలా వరకు మనం స్పందించే తీరుపై ఆధారపడి ఉంటాయి. కానీ కొంత వరకు మనం తినే ఆహారం వల్ల కూడా ఆ హార్మోన్ల విడుదల ఆధారపడి ఉంటుంది.
డోపమైన హార్మోన్ ను హ్యాపీ హార్మోన్ అని కూడా పిలుస్తుంటారు. డోపమైన శ్రేయస్సు యొక్క భావాలను కలిగిస్తుంది. మెదడు రివార్డ్ సిస్టమ్ యొక్క ప్రాథమిక డ్రైవర్ ఈ హార్మోన్. మనస్సు ఆనందంగా ఉన్నప్పుడు ఈ హార్మోన్ పెరుగుతుంది.
ప్రేమలో ఉన్నప్పుడు, ఏదైనా ఆనందమయమైన పరిస్థితి వచ్చినప్పుడు డోపమైన విడుదల అవుతుంది. మంచి ఆహారం తింటున్నా, శృంగారంలో పాల్గొంటున్నప్పుడు కూడా డోపమైన విడుదల అవుతుంది.
సెరోటోనిన్:
సెరోటోనిన్ హార్మోన్‌ను ఫీల్-గుడ్ హార్మోన్ అని కూడా పిలుస్తుంటారు. ఆందోళన, నిరాశను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సెలెక్టివ్ సెరోటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్-SSRIలు మెదడులో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయి.
వ్యాయామం చేయడం, ఆరు బయట సమయం గడపడం, రాత్రి కంటినిండా నిద్రపోవడం వంటివి సెరోటోనిన్‌ను పెంచడంలో సహాయపడతాయి.
ఎండార్ఫిన్లు:
ఎండార్ఫిన్ హార్మోన్ వ్యాయామం చేస్తున్నప్పుడు ఎక్కువగా విడుదల అవుతుంది. ఎండార్ఫిన్లను పెంచడానికి కార్డియోవాస్కులర్ వ్యాయామం ఉత్తమ మార్గం.
ఈ హార్మోన్లు సహజ పెయిన్ కిల్లర్లుగా పనిచేస్తాయి. అసౌకర్యాన్ని తగ్గించి, ఆనందాన్ని పెంచుతాయి.
ఆక్సిటోసిన్:
ఆక్సిటోసిన్ ప్రసవ సమయంలో, పాలిచ్చే సమయంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ ను లవ్ హార్మోన్ అని కూడా అంటారు. ప్రేమగా చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, శృంగార సమయంలో కూడా ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది.
ఫీల్-గుడ్ హార్మోన్లను పెంచే చర్యలు:
* ప్రియమైన వ్యక్తిని కౌగిలించుకోవడం
* వ్యాయామం చేయడం
* అరోమాథెరపీ చేయడం
* మసాజ్
* శృంగారం
* మంచి అనుభూతిని కలిగించే సంగీతం వినడం
* ధ్యానం చేయడం
* ఆరుబయట సమయం గడపడం
* నిద్రపోవడం
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications