Latest Updates
-
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే! -
కర్ణాటక స్టైల్ దోసకాయ మజ్జిగ పులుసు..10 నిమిషాల్లోనే కడుపు చల్లదనాన్నిచ్చే టేస్టీ రెసిపి -
సూర్యాపేటలో పట్టపగలే దారుణం… భార్యను చంపిన భర్త! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు -
వేప ఆకుల నీటితో స్నానం చేస్తే జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా? -
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది: భారీ వర్షాలు, ఈదురు గాలుల నుంచి ఇలా రక్షించుకోండి! -
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు! -
నేటి రవి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
రోజూ తినే దోసెలు బోర్ కొట్టాయా? అయితే ఈ సమ్మర్ స్పెషల్ దోసె ట్రై చేయండి
డైట్ చేస్తున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు తినాల్సిన 4 సూపర్ స్నాక్స్ ఇవే!
బరువు తగ్గాలని రోజూ వ్యాయామం చేస్తూ, కఠినమైన డైట్ ఫాలో అవుతున్నారా? అయినా బరువు ఏమాత్రం తగ్గడం లేదని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి.
డైట్ పేరుతో ఇష్టమైన ఆహారానికి దూరంగా ఉన్నప్పుడు, మన నాలుక రుచి కోసం తహతహలాడుతుంది. ఏదైనా కొత్త రుచిని ఆస్వాదించాలని మనసు లాగుతుంది. ఆ ఆకలిని, కోరికను చంపుకోలేక ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, పిజ్జాలు, ప్యాకెట్లలో దొరికే చిప్స్ వైపు మనసు మళ్లుతుంది.

కొంచెమే కదా తింటున్నాం, బరువు ఏమీ పెరగంలే అని మనకు మనం సర్దిచెప్పుకుంటాం. అసలైన పొరపాటు అక్కడే జరుగుతుంది. ఎందుకంటే వేయించిన జంక్ ఫుడ్ తినడం మొదలుపెట్టాక మనం ఎంత తింటున్నామనే దానిపై నియంత్రణ కోల్పోతాం. రుచికి బానిసై తెలియకుండానే ఎక్కువ తినేస్తాం. ఫలితంగా శరీరంలోకి అదనపు కేలరీలు వచ్చి చేరుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
ఆకలి వేసినప్పుడు కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు, అలాగని జంక్ ఫుడ్ తినకూడదు. మీ ఆకలిని ఆరోగ్యకరంగా తీర్చుకోవడానికి మీ స్నాక్స్ లిస్ట్ లో వేటిని చేర్చుకోవాలో ఇక్కడ చూడండి.
నల్ల శనగల చాట్
ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా లేదా సాయంత్రం స్నాక్ గా ఇది బెస్ట్ ఆప్షన్. 100 గ్రాముల నల్ల శనగల్లో 10 గ్రాములకు పైగా డైటరీ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. అంతేకాదు, ఇది రక్తంలో షుగర్ లెవల్స్ ని, చెడు కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుంది. ఉడికించిన నల్ల శనగలకు సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, దోసకాయ ముక్కలు, కొద్దిగా నిమ్మరసం కలుపుకుంటే నోరూరించే శనగల చాట్ రెడీ.
క్రీమ్ లేని మిక్స్ డ్ ఫ్రూట్ సలాడ్
పండ్ల సలాడ్ అనగానే క్రీమ్ గుర్తుకొస్తుంది, కానీ క్రీమ్ బరువు పెంచుతుంది. దానికి బదులుగా ఇలా చేయండి. ఒక గిన్నెలో ఆపిల్, స్ట్రాబెర్రీ, పుచ్చకాయ, అరటిపండు ముక్కలు, ఎండు ద్రాక్ష తీసుకోండి. వీటికి డ్రెస్సింగ్ గా గిలకొట్టిన పెరుగు, కొద్దిగా కారం పొడి, కొంచెం తేనె కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని పండ్ల ముక్కలపై వేసి బాగా కలపండి. క్రీమ్ లేకుండానే ఎంతో రుచికరమైన ఫ్రూట్ సలాడ్ రెడీ.

చియా సీడ్స్ పుడ్డింగ్
డైట్ లో ఉన్నప్పుడు తీపి తినాలనిపిస్తే ఇదొక బెస్ట్ ఆప్షన్. ఒక గిన్నెలో అర కప్పు పాలు తీసుకుని అందులో ఒక చెంచా చియా గింజలు వేయండి. పంచదార వాడకండి, దానికి బదులుగా సహజమైన తీపి కోసం సన్నగా తరిగిన ఖర్జూరాలను కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి రాత్రిపూట ఫ్రిజ్ లో ఉంచండి. ఉదయానికి ఇది చక్కగా గడ్డకట్టి పుడ్డింగ్ లా మారుతుంది. దీని పైన మీకు ఇష్టమైన తాజా పండ్ల ముక్కలను వేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.
పాలకూర - మెంతి ముతియా
సాయంత్రం వేళ కారంగా, వేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఈ గుజరాతీ వంటకం ట్రై చేయండి. ఇది నూనెలో వేయించకుండా ఆవిరి మీద ఉడికిస్తారు కాబట్టి బరువు పెరగరు. ఒక గిన్నెలో కొద్దిగా శనగపిండి, గోధుమ పిండి, సన్నగా తరిగిన పాలకూర, మెంతి ఆకులు తీసుకోండి. దానికి అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా పెరుగు, నిమ్మరసం కలుపుకుని ముద్దలా చేసుకోండి.
ఈ పిండిని గుండ్రంగా లేదా పొడవుగా ఉండలుగా చేసుకుని ఆవిరి మీద ఉడికించండి. చల్లారాక చిన్న ముక్కలుగా కోసుకోండి. ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, కరివేపాకుతో పోపు పెట్టుకుని ఈ ముక్కలను వేయించుకుంటే అద్భుతమైన స్నాక్ రెడీ.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications