Latest Updates
-
షుగర్ కంట్రోల్ కావాలంటే డైలీ ఎంత సేపు నడవాలి.. భోజనం తర్వాత ఇలా చేయాల్సిందే.! -
ఒకే ప్లేట్లో ఉగాది షడ్రుచులు.. గుమ్మడికాయ ఉల్లి కారం టేస్ట్‌కి లొట్టలేయాల్సిందే.! -
హ్యాపీ గాంధీ జయంతి 2026.. మీ బంధుమిత్రులకు పంపేందుకు బెస్ట్ శుభాకాంక్షలు, కోట్స్, వాట్సాప్ స్టేటస్ లు -
ఫ్లై దుబాయ్ ఘటన.. కాక్‌పిట్‌లో గొడ్డలి ఎందుకు ఉంటుంది, ఇద్దరు పైలట్ల నియమమేంటి.? -
కడుపులో చెత్తను తొలగించి హెల్తీగా ఉంచే కొత్తిమీర పొంగలి.. ఇడ్లీ కంటే ఈజీగా చేసేయండి.! -
సూర్య, శుక్ర, బుధ గ్రహాల కలయికతో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి లాభాల పంట పండినట్లే.! -
మైదా లేకుండా హెల్తీగా..సూపర్ టేస్టీ చీజ్ పరాఠా..ఎలా చేసుకోవాలంటే.. -
Viral Video: ఒక్క షాట్ కి ఎంత?..విదేశీ మహిళా టూరిస్ట్ ని వేధించిన కుర్రాళ్లు..వీడియో చూడండి -
శరీరంలో విటమిన్ల లోపాన్ని పోగొట్టే పచ్చి అరటికాయ పూరీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
తిన్న కొద్ది తినాలనిపించే రాయలసీమ వెల్లుల్లి కారం..ఒక్కసారి చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ..
చెవులు పగిలే గురకా? గుర్రుమనే భాగస్వామా?

గురకకు చికిత్స-
1. ఓకల్ కార్డులు వైబ్రేట్ అవటానికి కారణం ప్రధానంగా ముక్కులోని శ్వాసమార్గంలో అడ్డంకులుండటం. ఈ అడ్డంకులను తొలగించాలంటే, మెడికల్ షాపులలో రెడీగా దొరుకుతున్న నాసల్ స్ట్రిప్స్ వాడాలి. ఇవి ముక్కు రంధ్రాలను తెరచి గాలి బాగా ప్రవహించేలా చేస్తాయి.
2. పడకకు వెళ్ళే ముందు ఆవిరి పట్టి శ్వాస మార్గాన్ని శుభ్రపరచుకుంటే అందులో వుంటే మ్యూకస్ శుభ్రపడి మంచి నిద్రపడుతుంది.
3. శ్వాస మార్గంలో బ్లాకేజ్ కలిగించే ఆల్కహాలు, నిద్రమాత్రలు, ట్రాంక్విలైజర్లు, యాంటీ హిస్టమిన్లు మొదలైనవి వదిలేస్తే గురక తగ్గుతుంది.
4. గురకకు పొగతాగటం కూడా ఒక కారణం. ఈ అలవాటు గొంతులో మంట, కొద్దిపాటి వాపు కూడా కలిగిస్తుంది. శ్వాస కష్టంగా తీసుకోవలసి వుంటుంది.
5. ముక్కు రంధ్రాలలో మ్యూకస్ శుభ్రపరచుకొని అధికంగా వున్న వెంట్రుకలను కత్తిరిస్తే కూడా గురక తగ్గే అవకాశం వుంది.
నిద్ర పోయే పొజిషన్ ఎలా వుండాలి?
1. తలగడలు మెత్తగా వుండరాదు. గట్టిగా వున్న తలగడలపై పడుకుంటే గాలి బాగా ప్రవహిస్తుంది.
2. వెల్లకిలా పడుకునే కంటే పక్కకు తిరిగి పడుకుంటే శ్వాస హాయిగా ఆడుతుంది. నిద్రలో మీరు వెల్లకిలా పడుకుంటే, పక్కకు తిప్పమని మీ భాగస్వామికి చెప్పండి.
గురక తగ్గాలంటే తినకూడనివి ఏమిటి?
1. నిద్రించేముందు స్నాక్స్ ఏవీ తినకండి. పిజ్జాలు, బర్జర్లు, ఛీజ్, పాప్ కార్న వంటివి తినరాదు. వీటిలో కొవ్వు అధికంగా వుండి మ్యూకస్ పేరుకుంటుంది.
2. నిద్రించేముందు ఎక్కువగా భుజించవద్దు. భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే జీర్ణమై పడుకునే సమయానికి శ్వాస కోశంలో గాలి స్వేచ్ఛగా ఆడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
