Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
అలసిన కంటికి అధ్భుత వ్యాయామం!

ఒత్తిడి తగ్గించే కంటి వ్యాయామం -
1. కంప్యూటర్ స్క్రీన్ చూస్తూవుంటే, మీ కంటిగుడ్డుకు కదలిక లేదన్నమాట. అది హానికరం. ఇలా చేయండి.....తిన్నగా చూడండి. రెండు సార్లు కళ్లు మూయండి. ఇపుడు కుడివైపుగా ఎంతవరకు వీలైతే అంతవరకు కళ్ళు తిప్పి చూడండి. 30 సెకండ్లు అదేవిధంగా నిలపండి. మరల తిన్నగా చూడండి. ఇదే రకంగా ఎడమవైపుకు కూడా చేయండి. ఈ వ్యాయామాన్ని 10 నుండి 15 సార్లు చేయండి.
2. మీ కన్ను ఇపుడు పైకి కూడా చూడాలి. - తిన్నగా చూడండి, రెండు సార్లు కళ్లు మూసి తెరవండి. కళ్లు పైకెత్తి ఎంతవరకు కనపడితే అంతవరకు చూడాలి. 30 సెకండ్లు అలానే వుండి తర్వాత సాధారణ స్ధితికి వచ్చి మరల అదేవిధంగా కిందకు చూడాలి. ఈ కంటి వ్యాయామాన్ని 10 నుండి 15 సార్లు చేయండి.
3. కంప్యూటర్ పై పని చేసే వారా? - ప్రతి అర గంటకు కళ్ళను స్క్రీన్ పై నుండి వేరే దూరంగా వున్న వస్తువు పైకిఅంటే గోడ లేదా గడియారం లేదా మీ బాస్ కేబిన్ డోర్ పైకి మార్చండి. దేనిపైనా చూపు పెట్టకుండా దూరానికి కూడా చూడవచ్చు. దీని తర్వాత కళ్ళను 30 సెకండ్లు మూసి తెరవండి. పని చేయండి. శక్తివంతమైన కాంతి కల కంప్యూటర్ స్క్రీన్ మీ కళ్ళను రిపేరు చేయలేనంతగా కూడా నష్టపరచవచ్చు. కనుక ఈ జాగ్రత్తలు పాటించండి.
4. కంటి వ్యాయామాలకు ఇంత సమయమని కేటాయించాల్సిన పనిలేదు. కొద్దిపాటి విశ్రాంతిలో వీటిని చేసేయవచ్చు. పడకకు వెళ్లే ముందు, మీ కళ్ళను 5 సార్లు మొదట సవ్యంగాను తర్వాత అపసవ్యంగాను గుండ్రంగా తిప్పండి. కనుగుడ్లు 360 డిగ్రీలు తిరిగేలా చేయండి.
ఈ కంటి వ్యాయామాలు కళ్ళ ఒత్తిడిని తగ్గించటమే కాక దృష్టిని సహజంగా మెరుగుపరుస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
