Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జననాంగ భాగాల పరిశుభ్రత!

1. జననాంగ భాగాన్ని ప్రతిరోజూ వాష్ చేయండి. టాయ్ లెట్ కు వెళ్ళినపుడు ప్రధానంగా క్లీన్ చేయాలి. బాక్టీరియా, ఈస్ట్ లు పేగులలోకి చొరబడే అవకాశం వుంది కనుక వజీనాను ఎప్పటికపుడు సరిగా శుభ్రం చేయాలి.
2. స్నానం చేసేటపుడు, క్లిటోరియస్, యురిత్రా (మూత్ర విసర్జన భాగాలు) తప్పని సరిగా శుభ్రం చేయాలి.ఎందుకంటే వాటినుండి ద్రవాలు బయటకు వస్తూంటాయి. సోప్ లేదా ఇతర బాడీ వాష్ వంటివి ఉపయోగించండి.
3. ప్యూర్ కాటన్ లేదా సిల్క్ వస్త్రాలు లోదుస్తులుగా ధరించండి. సింధటిక్, పాలీయస్టర్ వంటివి తడిస్తే త్వరగా ఆరక, ఆ ప్రదేశంలో బాక్టీరియాను పెంచుతాయి.
4. రతిక్రీడకు ముందు జననాంగ భాగాన్ని బాగా కడగండి. ఇది శుభ్రతకే కాక, దుర్వాసన రాకుండా చేస్తుంది.
5. రతిక్రీడ అయిన తర్వాత, జననాంగ భాగాన్ని బాగా కడగండి. వీలైనంతవరకు 20 నిమిషాలలోపు కడిగేస్తే, ఇన్ఫెక్షన్లు అంటకుండా వుంటాయి. స్నానం చేయవలసిన అవసరం లేదు. ఆ భాగం వరకు బాగా కడిగితే చాలు.
6. స్నానం అయిన తర్వాత, జననాంగ భాగం పొడిగా వుండేలా చూసుకోండి. తడి వుంటే బాక్టీరియా త్వరగా పెరిగిపోతుంది. లోపలి దుస్తులు ద్రవాల కారణంగా తడిగా వుంటుంటే, రోజుకు రెండు మార్చండి.
7. జననాంగ భాగ వెంట్రుకలు ఎదిగినపుడల్లా తీసివేయాలి.
8. రుతుక్రమ సమయంలో ప్రతి 3 లేదా 4 గంటలకు ప్యాడ్ మార్చండి లేకుంటే అది తడిగా వుండి సమస్యలు కలిగిస్తుంది.
9. గుడ్డలు తడిగా వుంటే వెంటనే మార్చండి. సాధ్యమైనంతవరకు జననాంగ భాగాన్ని పొడిగా వుంచటానికి ప్రయత్నించండి.
10. బిగువైన ప్యాంట్లు, ఇతర దుస్తులు వేయకండి. ఈ రకమైన దుస్తులు వేస్తే చర్మం గాలి ఆడక తేమను ఏర్పరుస్తుంది.
11. ఆ భాగాలకు ఇన్ఫెక్షన్స్ త్వరగా వస్తుంటే, వజీనా ను పిహెచ్ సోప్ ఉపయోగించి కడగండి.
12. శుభ్రత లేని పబ్లిక్ టాయిలెట్లపై కూర్చోరాదు. కూర్చునేముందు సీటు శుభ్రం చేసుకోండి. ఈ భాగానికి వచ్చే సమస్యలు పబ్లిక్ టాయ్ లెట్ ల వలనే వస్తాయి. మీరు సీటుపై కూర్చొని ఎపుడూ ఫ్లష్ చేయకండి. అందులోని క్రిములు మీ జననాంగ భాగానికి అంటే ప్రమాదముంది.
13. మాంసం తింటే అది వజీనాకు దుర్వాసన కలిగిస్తుంది. వదిలేయండి. జననాంగభాగాలు పరిశుభ్రంగా వుండాలంటే, మహిళలు, తగినన్ని పచ్చటి కూరలు, తాజా పండ్లు తింటూ రోజుకు కనీసం అంటే 2 లీటర్ల నీరు తాగాలి. ఈ నీరు వజీనాలో మంట రాకుండా కూడా చేస్తుంది.
ఈ అంశాలు ఆచరిస్తూ ఆరోగ్యంగా, మంచి వాసనలతో సంతోషంగా గడిపేయండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications