Latest Updates
-
Broccoli Pulao: బ్రకోలి పులావ్ ఇలా చేస్తే..తింటుంటే స్వర్గంలో తేలుతున్నట్లు ఉంటది! -
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.!
వయసుతో మారే నిద్ర!

1. కొత్తగా పుట్టిన పిల్లలు - అపుడే పుట్టిన పిల్లలు సుమారు 16 నుండి 18 గంటలు ప్రతి రోజూ నిద్రించాలి. పిల్లలు 50 శాతం నిద్ర రెమ్ దశలో పోతారు. రోజులో పొందిన సమాచారమంతా రెమ్ స్టేజిలో ప్రాసెస్ అవుతుంది. బేబీకి సమాచారం అధిక బరువనిపిస్తుంది. బేబీలకు ఎక్కువ గంటలు నిద్రకు కావాలనేదానికి మరో కారణం వుంది. శరీరం వారికి ఇంకా ఎదగాల్సివుంది. రొటీన్ కు అలవాటు పడేటంతవరకు బేబీలో ఈ నిద్ర కొనసాగుతూనే వుంటుంది. రెగ్యులర్ రొటీన్ లోకి రావడానికి బేబీకి కనీసం 6 నెలలు పడుతుంది. 3 సంవత్సరాలకు గాని పగటి నిద్ర తగ్గదు.
2, పిల్లాడు- 2 నుండి 4 సంవత్సరాల వయసుకు ఒక నిద్రా సమయానికి అలవాటు పడతారు. కనీసం వీరికి 11 నుండి 13 గంటల నిద్ర కావాలి. ఈ దశలో వారు తమపై శ్రధ్ధ చూపాలంటూ కోరి సరి అయిన సమయానికి నిద్ర పోరు. పేరెంట్స్ ఈ ఆలోచనకు ప్రాధాన్యత నివ్వక వారిని ఒక ప్రత్యేక గదిలో పడుకోబెట్టాలి. మధ్య రాత్రిలో మెళుకువ వచ్చినా వారు మరల నిద్రలోకి జారుకుంటారు.
3. యుక్తవయస్కులు- టీనేజర్లకు 9 నుండి 10 గంటల నిద్ర కావాలి. ఈ వయసులో వారు అనేక విషయాలు తెలుసుకుంటారు. నేర్చుకుంటారు. ఈ సమాచారమంతా కూడా నిద్రలో ప్రాసెస్ అవాలి. ప్రాసెస్ అయిన సమాచారం పరీక్ష పేపర్లలో ప్రతిబింబించి వారి స్టడీస్ లోను జీవితంలోను బాగుండటానికి తోడ్పడుతుంది.
4. ముసలి వయసు - వయసు వచ్చే కొద్ది నిద్రలో క్వాలిటీ తగ్గుతుంది. పెద్ద వారికి కనీసం 8 గంటలు నిద్ర అవసరమైనప్పటికి వారు శరీరాన్ని కష్టపెట్టి నిద్ర తేలేరు కనుక వారికది సాధ్యం కాదు. వీరి రొటీన్ నిద్ర తరచుగా డిస్టర్బ్ అవుతుంది. ఈ నిద్ర రాని పరిస్ధితి అధిగమించటానికి వీరు స్లీపింగ్ పిల్స్ ఆశ్రయిస్తారు. అయితే నిద్రించటానికి సహజమార్గాలు కొన్ని వున్నాయి. వీటిలో ప్రధానమైనదంటే, చక్కటి వేడి నీటితో స్నానం చేయటం. లేదా పుస్తకాలు చదవటం లేదా సంగీతం వినటం లేదంటే చిన్నపాటి వ్యాయామం చేయటం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
