Latest Updates
-
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే! -
నిమజ్జనం రోజు గణేశుడి చెవిలో ఈ 3 పదాలను చెప్పండి.. మీ తీరని కోరిక నెరవేరడం పక్కా.! -
రాత్రి మిగిలిన చపాతీలతో అదిరిపోయే బ్రేక్ఫాస్ట్.. పదే నిమిషాల్లో ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్.! -
సమసప్తక యోగం.. నెల రోజుల పాటు వీరిపై తీవ్రంగా శని ప్రభావం, ఈ పరిహారాలు తప్పనిసరి.! -
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే..
పొట్ట కొవ్వు తగ్గించే సూపర్ వ్యాయామాలు!

ప్రత్యేకించి పొట్టకు మాత్రమే - నేలపై వెల్లకిలా పడుకోండి మోకాళ్లు పొట్టవైపు బాగా వంచండి. చేతులు తలకింద పెట్టండి. మీ భుజాలను నేలపై నుండి లేపుతూ మరోవైపు మీ కాళ్ళను పొట్టకు ప్రెస్ చేస్తూ వుండుండి. మెల్లగా నార్మల్ పొజిషన్ కు రండి. మరల పై విధంగా చేయండి. ఈ వ్యాయామాలు ప్రతిరోజూ 10 నుండి 12 సార్లు చేయండి.
రివర్స్ వ్యాయామం - నేలపై వెల్లకిలా పడుకోండి. కాళ్ళను, మోకాళ్ళను 90 డిగ్రీలలో పైకి లేపండి. పొట్టను బాగా లోపలికి లాగండి. ఇపుడు మోకాళ్ళను వంచి పిరుదులు, మోకాళ్ళు మీ ఛాతీవైపుకు ప్రెస్ చేయండి. మెల్లగా నార్మల్ పొజిషన్ కు రండి. మరల పై విధంగా చేయండి. ఈ వ్యాయామం ప్రతిరోజూ 10 నుండి 12 సార్లు క్రమం తప్పకుండా చేయండి.
కత్తెర వ్యాయామం - వెల్లకిలా పడుకోండి చేతులు తలకింద వుంచి కాళ్ళు పైకి ఎత్తండి. పొట్టను లోపలికి లాగుతూ భుజాలు నేలపైనుండి పైకి లేపండి. ఎడమ భుజం కూడి మోకాలికి, కుడి భుజం ఎడమ మోకాలికి తగిలించండి. ఈ రకంగా 10 నుండి 12 సార్లు ప్రతిరోజూ చేయండి.
ఈ మూడు వ్యాయామాలు రెగ్యులర్ గా చేస్తూవుంటే, మీ పొట్ట కొవ్వు తగ్గి గణనీయమైన మార్పును మీ శారీరక ఫిట్ నెస్ లో గమనిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
