Latest Updates
-
Chilkur Balaji Temple: వీసా మాఫియా గుడి.. చిలుకూరు బాలాజీ ఆలయంపై ట్రంప్ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు -
సండే స్పెషల్ గా తమిళనాడు ఫేమస్ ముట్టా ఇడ్లీ..10 నిమిషాల్లో ఈ హై ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేయాలంటే.. -
Women Alert: ఫంక్షన్ ఉందని పీరియడ్స్ ట్యాబ్లెట్ వేసుకున్న మహిళ మృతి..నిపుణులు ఏమంటున్నారంటే? -
ఆరోగ్యానికి సంజీవని,రుచిలో అమోఘం..మునగాకు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ డిన్నర్..చియా రైతా చేయండిలా..కడుపుకు హాయిగా, క్యాలరీలు తక్కువగా.. -
Best Snacks For Fatty Liver: ఆకలి తీరాలి, లివర్ సేఫ్ గా ఉండాలా?..అయితే ఈ స్నాక్స్ తినండి! -
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మళ్లీ బాంబు బెదిరింపుల కలకలం… ప్రయాణికులు ఈ విషయం తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు! -
మండు వేసవిలో కడుపును చల్లగా ఉంచే కమ్మని దహీ ఆలూ కర్రీ..ఇంట్లోనే చాలా ఈజీగా చేసేయండిలా.. -
జీవితంలో 3 సార్లే స్నానం..అయినా ఈ మహిళల చర్మం అంత కాంతివంతంగా ఎలా ఉంటుందంటే? -
పెట్రోల్, డీజిల్ ధరల మోత.. సామాన్యుల జేబుకు చిల్లు, ఈ చిట్కాలతో ఖర్చు తగ్గించుకోండి!
స్విమ్మింగ్ వలన 5 ప్రధాన ప్రయోజనాలు!

స్విమ్మింగ్ గుండె సంబంధిత ఆరోగ్యం ఇస్తుంది.
నేటి రోజులలో గుండె సంబంధిత జబ్బులు మారిన జీవన శైలికిగాను తేలికగా వస్తున్నాయి. దానికి తగ్గట్లు ఆహారాలు కూడా అనారోగ్యం కలిగించేవిగా వుంటున్నాయి. 30 సంవత్సరాల వయసులోనే గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. స్విమ్మింగ్ ప్రత్యేకించి గుండెజబ్బులకు మిమ్మల్ని దూరంగా వుంచుతుంది. శరీరంలోని ప్రతి కండరం కదులుతుంది. రక్తప్రసరణ బాగా పెరుగుతుంది.
శుభ్రపరుస్తుంది.
రక్తనాళాలలోని మలినాలను, కొల్లెస్టరాల్ పొరలను తొలగిస్తుంది. శరీరావయవాలపై అధిక ఒత్తిడి లేకుండా కేలరీలను తేలికగా ఖర్చు చేసే అరబిక్ వ్యాయామాలలో స్విమ్మింగ్ మంచిది. స్విమ్మింగ్ లో మన చేతులు, కాళ్ళు, మెడ, వీపు భాగం మంచి కదలికలను కలిగి వుంటాయి. అన్ని అంగాలను స్విమ్మింగ్ సమన్వయం చేస్తూ శరీరాకృతిని అద్భుతంగా వుంచి ఆకర్షణీయం చేస్తుంది.
కేలరీలు కరిగిస్తుంది
స్విమ్మింగ్ మీ కేలరీలు కరిగించటమే కాక, మీ మనసుల్లో వుండే విషాదచ్ఛాయలను సైతం దూరం చేస్తుంది. కొలనులోకి దిగి నీటితో ఆట సాగిస్తుంటూ మీ శరీరం, మైండ్ రెండూ హాయిననుభవిస్తాయి. మానసిక ఉల్లాసం కలిగిస్తుంది. జిమ్ లో మీరు అధికంగా కష్టపడుతూ చేసే వ్యాయామానికి దీటుగా స్విమ్మింగ్ మీకు తేలికగా అదే ఫలితాలను చేకూరుస్తుంది. దీనిలో మీ ఎండార్ఫిన్లు రిలీజ్ అయి మీ మానసిక వేదనలు దూరం అవుతాయి. వేగంగా వచ్చి శరీరానికి తగిలే నీరు మీ శరీరానికి మసాజ్ నిచ్చి రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.
కండరాలు గట్టిపరుస్తుంది
శరీర పై భాగం, క్రింది భాగాలే కాక స్విమ్మింగ్ లో ఇతర శారీరక అవయవాలు సైతం బాగా కదులుతూంటాయి. దానితో తన్నని కండరం గట్టిగా ఏర్పడుతుంది. ఏ రకమైన గాయం లేదా ఒత్తిడి కలుగకుండా మీ జాయింట్లు సులభంగా కదులుతాయి. కండలు కలిగి వుండటం కంటే కూడా అధిక పట్లుత్వం శరీరానికి సంపాదించుకోవటం మంచిది. అది మీకు స్విమ్మింగ్ లో దొరుకుతుంది. ఛాతీ, తొడ, వీపు వంటి ప్రధాన భాగ కండరాలు బాగా బలపడతాయి. ఈ రకమైన గట్టిపరచే వ్యాయామం మీకు జిమ్లో సాధ్యం కాకపోవచ్చు. ఏవయసువారికైనా స్విమ్మింగ్ మంచి ఫలితాలనిస్తుంది. తీవ్రమైన జబ్బులు వచ్చిన వారికి కూడా డాక్టర్లు స్విమ్మింగ్ వ్యాయామంగా సూచిస్తారు.
ఏ వయసు వారైనా, ఎవరైనా?
తీవ్ర జబ్బులు, జీవన విధానాల కారణంగా ఇతర వ్యాయామాలు చేయలేకపోవచ్చు. కాని స్విమ్మింగ్ మనిషి ఏ పరిస్ధితిలో వున్నప్పటికి చేయటం మొదలుపెట్టవచ్చు. చిన్న పిల్లలనుండి, పెద్దవారి వరకు ఇది తగిన వ్యాయామమే. పూల్ లో మన శరీర బరువు నీటిచే బ్యాలన్స్ చేయబడుతుంది. అందుకనే శారీరక అంగవైకల్యాలు కలవారికి కూడా నీటి సంబంధిత వ్యాయామాలు వైద్యులు సూచిస్తారు. జిమ్ రొటీన్ తో బోర్ కొట్టినవారు, స్విమ్మింగ్ మొదలు పెడితే, మరింత ఉత్సాహంగా వుండి అతి తేలికగా తమ శరీర ఆరోగ్యం కాపాడుకోగలుగుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications