Latest Updates
-
మష్రూమ్ చికెన్ మసాలా..కిర్రాక్ టేస్ట్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె లేకుండా 'దహీ భల్లా'.. రుచికి రాజీ లేదు, ఆరోగ్యానికి డోకా లేదు! -
ఉదయాన్నే పరగడుపున కుంకుమపువ్వు నీరు తాగితే... మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే! -
ఈరోజు రాశి ఫలాలు (20.03.26): శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికి? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే..హోటల్ రుచితో బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా.. చపాతీ, పూరీల్లోకి పర్ఫెక్ట్! -
30 ఏళ్లకే కీళ్ల నొప్పులా? వంటింట్లో ఉండే ఈ గింజలతో ఉక్కులాంటి ఎముకలు మీ సొంతం! -
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు! -
ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే! -
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు!
ఆనందమయ జీవితానికి ఆరు సంతోషకరమైన పద్దతులు...
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆనందగా గడపడానికి కావల్సింది సంతోషమే అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే సంతోషంగా గడం, లేదా సంతోషంగా ఉండటం అన్నది ఎంత మంది ఫాలో అవుతన్నారు చెప్పండి? జీవితం ఆనందమయంగా గడపడం అన్నది మీ చేతుల్లోనే ఉంది. దానికి గొప్ప ఉద్యోగం, బోలెడంత డబ్బు, ఉండనక్కర్లేదు అని నిపుణులు అంటున్నారు. చిన్న చిన్న మార్పులు చేర్పులు ద్వారా సంతోషంగా ఆనందంగా ఉండవచ్చు అని వారు సూచిస్తున్నారు.

జీవితం ఆనందంగా గడపటం కోసం ప్రతి రోజూ రకరకాల పద్దతులు, పాటిస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకూ ఎన్నో రకాల వ్యాయామాలు, మరెన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే మరీ అంత ఎక్కువ శ్రమ పడకుండా పండంటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ఒత్తిడి అనేది ఈ రోజుల్లో సర్వ సాధారణం అయిపోయింది. ఈ ఒత్తిడి కారణంగానే చాలా అనారోగ్యాలకు దారితీస్తోంది. మనం సంతోషంగా గడపడానికి, ఆనందంగా ఉండటానికి మనకు ఎవ్వరు గైడెన్స్ ఇవ్వరు. కాబట్టి మనకు మనమే సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలి. ఆ సంతోషంగా గడపడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకొంటే అది మన ఆరోగ్యానికి మాత్రమే కాదు ఆనందంగా జీవించడానికి కూడా బాగా ఉపయోగపడుతాయి. మరి జీవితం ఆనందంగా సంతోషంగా గడపడం ఎలా చూద్దాం...
1. ఆనందమైన నవ్వుతో ఒత్తిడిని కలిగించే హార్మోనులను తగ్గిస్తుంది: మనం సాదారణంగో కొన్ని జంటలు లేదా కొన్ని గ్రూపులుగా పార్క్ ల్లో బిగ్గరగా నవ్వుతుంటారు. దీన్ని లాఫింగ్ థెరఫీ అంటారు. అలా నవ్వడం వల్ల ఒత్తిడికి కలిగించే హార్మోన్ లెవల్స్ ను శరీరంలో తగ్గిస్తుంది. కనుక ఒక్కసారి మీరు నవ్వటం మొదలు పెట్టారంటే, అది మిమ్మల్ని మానసికంగా ఉత్సాహపరచి మిమ్మల్ని కార్యోన్ముఖులను చేస్తుంది.
2. సంతోషంగా ఉండటం వల్ల తలనొప్పి దరిచేరదు: మీకు తెలుసా ఈ మద్య కాలంలో చాలా మంది ప్రతి రోజూ తలనొప్పితో బాధపడుతుంటారు. అందుకు కారణం మారుతున్న కాలంతో పాటు మారుతున్న జీవనశైలి. కాబట్టి మిమ్మల్ని మీరు సంతోషంగా ఉంచుకున్నప్పుడు తలనొప్పులు వంటివి మీ దరిచేరవు. కాబట్టి ఎప్పుడు సంతోషంగా గడపడానికి ప్రయత్నించండి.
3. సంతోషంగా గడపేవారికి క్రాప్స్(తిమ్మెరలు)ఉండవు: చాలా మంది ఒత్తిడి అనేదాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తారు. అయితే ఒత్తిడి వల్ల చాలా అనారోగ్యాలు ఎదురైతే.. ముఖ్యంగా కండరాలు అనారోగ్యానికి గురిఅవుతాయి. కాళ్ళు, చేతులు తిమ్మెర్లు, బ్యాక్ పెయిర్, మెడనొప్పి, మొదలగునవి రాకుండా ఉండాలంటే స్ట్రెస్ తగ్గించుకోవాలి.
4. ఆరోగ్యకరమైన గుండె కోసం: గుండె ఆరోగ్యంగా ఉంటేనే జీవితం కాలం ఆరోగ్యంగా జీవింతచగలం. అయితే సంతోషంగా ఉండేవారికి గుండె సమస్యలు రావనుకోకూడదు. అయితే సంతోషంగా గడపడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా తగ్గుతాయి.
5. సంతోషంగా ఉంటే అలసట దూరం: అలసట వల్ల కండరాలు పనిచేయడం నిలిపివేస్తాయి. అందుకు ఒత్తిడి కూడా ఓ కారణమే. కాబట్టి సంతోషంగా కడపడం కోసం బలమైన ఆహారం తీసుకొని, సైరన వ్యాయామాలు చేస్తే అలసట అనేది అనిపించదు.
6. సంతోషంగా ఉన్నవారు మరికొంత ఎక్కువ కాలం జీవిస్తారు: అసంతృప్తి మిమ్మల్ని ఎక్కువ కాలం బ్రతకనివ్వదు. కాబట్టి ఉన్నదాంట్లో సంతోషంగా గడపడం వల్ల పదికాలాల పాటు ఆరోగ్యంగా జీవిచడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రోజూ సంతోషంగా గడపేవారు. అనారోగ్యంగా ఉన్నవారికంటే మరింత ఆరోగ్యంగా ఉండగలుగుతారు. డిప్రెషన్ మరియు ఒత్తిడి అనేవి శరీరకంగా కుంగదీస్తుంది. దాంతో మీరు ఆనందంగా గడపడానికి చాలాచాలా రకాలుగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎల్లప్పుడు సంతోషంగా జీవించడానికి ప్రయత్నించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











