Latest Updates
-
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక!
మతి మరపును దూరం చేసి.. హాపీగా జీవించాలంటే...
వయసు పెరిగేకొద్దీ వచ్చే ఇబ్బందులు కొన్ని భలే ఇబ్బందిపెడతాయి. చిన్న చిన్న అంశాలు మరిచిపోతుంటాం. వయసు పెరుగుతున్న కొద్ది మతిమరపురావడం సహజం. ఇది మనం చేసే పనిపై ప్రభావం చూపుతుంది. ఐదు నిముషాల క్రితం అక్కడే ఉంచిన తాళాలు ఎక్కడుంటాయో తల బాదుకున్నా ఒక్కోసారి గుర్తురావు. ఫ్రిజ్‌దాకా వెళ్లి ఎందుకోసం వచ్చామో ఎంతకీ తట్టదు. మళ్లీ స్టౌ దగ్గరకు వెళ్లగానే గుర్తొస్తుంది. ఫలానా స్నేహితురాలు ఫోన్‌చేసినపుడు ఫలానా విషయం చెబుదామని అనుకుంటాం.
ఆ విషయం ఫోన్ పెట్టిన తరువాత గుర్తొస్తుంది. అలాగని అన్నీ మర్చిపోతామా అంటే లేదు. చిన్ననాటి సంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పమంటే రెడీ! ఫలానా పండుగరోజు ఏం చేశామన్నది టీకా, తాత్పర్యాలతో సహా గుర్తే! మతిమరపును దూరంగా ఉంచాలనుకుంటున్నారా? మరి వయసుతో వచ్చే ఈ మతిమరుపును చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే అధిగమించొచ్చు. మరి ఆ జాగ్రత్తలేంటో చూద్దాం.

జాగ్రత్తలు:
1. వ్యాయామం: వ్యాయామంతో మానసికంగా ఉత్సాహంగా ఉండొచ్చు. అది 70- 80యేళ్ల వయసొచ్చినా సరే!
2. బద్ధకంగా ఉండేవారికంటే వ్యాయామం చేసేవాళ్లు చాలా చురుకుగా ఉంటారు. వ్యాయామం వారానికి 5 సార్లు 20- 40 నిముషాలు నడిచేవాళ్లు చాలా ఆరోగ్యంగా ఉంటారు. తోటపని కూడా మనసు చురుకుగా ఉండటానికి సహాయంచేస్తుంది.
3. పొగతాగడం మానేయాలి.
4. తాగుడు మానేయాలి.
ఆటలు:
1. మెదడుకు పనిచెప్పే ఆటలు ఆడాలి. ఉదాహరణకు పజిల్స్ ఫిల్ చేయడం, చెస్, బ్రిడ్జ్ వంటివి.
2. స్క్రాబుల్ గేమ్, కార్డ్స్, కంప్యూటర్ గేమ్స్
3. ఏదైనా సందర్భాన్ని గురించి రాయడం, పుస్తకాలు చదవడం, అనుభవాలు రాయడం మెదడు చురుగ్గా మారడానికి సాయపడతాయి.
4. సంగీత సాధన
5. పజిల్స్ చేయడం
ఆహారం: పోషకాహారం అంటే ఎక్కువగా కాయగూరలు, పండ్లు తినడం, ఆరోగ్యకరమైన కొవ్వు, చేప, గింజధాన్యాలు, ముడిబియ్యం ఇవన్నీ మెదడుకు మంచివి. కొవ్వు ఎక్కువలేని మాంసం, మీగడతీసిన పాలు తీసుకోవాలి. బరువు తగ్గించుకోవడం అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
