Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఓట్ గింజల ఆహారం తేలికగా తినాలంటే?

పొడిగా తినండి - ఓట్లు తినేందుకు ఇది ఒక తేలికైన మార్గం. ఎండు ఓట్లు అలాగే తినేయండి. వీటిని పాలతో కలిపి తినాలంటే అది తీపి పాయసంగా వుంటుందని చాలామంది ఇష్టపడరు. మరి ఈ ఎండు ఓట్లను మరింత రుచిగా చేయాలంటే, వాటికి జీడిపప్పులు, కిస్ మిస్, బాదం పప్పు వంటివి కలిపి తినండి.
పాలు లేదా పెరుగుతో కలిపి తినండి - సాధారణంగా ఓట్లను వేడినీటిలో మరిగిస్తారు. అలా కాకుండా వాటిని బాదంపాలు లేదా రుచికర పెరుగుతో కలిపి తినండి. పెరుగు తీపిగా లేకుండా చూడండి. వేడిపాలు ఓట్ గింజలకు కలిపి అది ఒక పాయసంగా కాకుండా వెంటనే తినేయవచ్చు. అయితే, డైటింగ్ చేసేవారు బరువు పెరగకుండా, వెన్న తీసిన పాలను ఉపయోగించాలి. మీరు తీపి తినేవారైతే, దానిలో కొద్దిగా చాకోలెట్ సాస్ వేసుకు తినండి.
పండ్లు లేదా సిరప్ - ఓట్ ఆహారానికి పండ్లు లేదా సిరప్ కలిపితే, రుచి చాలాబాగుంటుంది. ఓట్లకు ఏ కొద్ద మార్పు చేసినా మంచి రుచి వచ్చేస్తుంది. మీకిష్టమైన పండ్లను లేదా పండ్ల రసాలైన ఆపిల్, మామిడి, వాటర్ మెలన్, ద్రాక్ష, కివి, స్ట్రాబెర్రీ మొదలైన వాటిని చేర్చండి. మీ బ్రేక్ ఫాస్ట్ ఎంతో రుచికరంగా వుంటుంది. పండ్లు రెడీగా లేనపుడు పండ్ల రసాలు కలిపితే మరింత రుచిగా వుంటుంది.
చల్లుకు తినండి - సలాడ్ లలో కర కర మనేటందుకు ఓట్లు చల్లుకొని తినండి. పండ్లు, కూరల సలాడ్లకు పైన ఓట్ గింజలు వేస్తే మంచి రుచి, కర కర అంటూ వుంటాయి. మరింత రుచి రావాలంటే, క్రీమ్, దానిమ్మ, స్ట్రాబెర్రీ లేదా చెర్రీల వంటివి కూడా సలాడ్ పై వేసి తినవచ్చు.
ఓట్లతో ఛాట్ ఎలా? ఓట్లను తినటానికి ఇది తేలిక మార్గం. కోసిన దోసకాయ, ఉల్లిపాయ, కేప్సికం, పచ్చిమిరప మరియు టమాటాల ముక్కలలో ఓట్లు కలిపి తినండి. ఈ డిష్ లో కొన్ని మసాలాలు, లేదా నిమ్మరసం వేస్తే కూడా బాగుంటుంది. సాయంకాలం స్నాక్స్ గా తినవచ్చు. దీనిని తీపిగా కూడా చేయవచ్చు. అందుకుగాను దానిమ్మ లేదా ఇతర పండ్లను చేర్చండి. ఇవి మీ కడుపు నింపటమే కాక, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.
ఓట్లను మరిన్ని విధాలుగా రుచికరంగా ఎలా తినాలో మీకు తెలిస్తే వాటిని మాతో పంచుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications