Latest Updates
-
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!
ఎండను చూసి బయపడితే ... ఊబకాయం గ్యారెంటీ...!

పేరుకు 'డి' విటమిన్ అంటూ ఏకవచనంలో సంబోధించినా అది కొన్ని రసాయనాల సమ్మేళనం. విటమిన్ డి1, డి2, డి3, డి4, డి5 అనే ఐదు విభిన్న రసాయనాల సమస్తాన్ని కలగలిపి 'డి' విటమిన్ అంటారు. ఇందులో డి3 అనేది చాలా ముఖ్యమైనది. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్-డి లోపం ఉంది. శారీరక శ్రమ లోపించ టం..వూబకాయం.. ధూమపానం.. వీటన్నింటి మూలంగా నానాటికీ మన శరీరంలో విటమిన్-డి' అవస రాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఎండ ముఖం చూడకుండా... ఎక్కడా ఒంటికి సూర్యరశ్మి సోకకుండా... నెలలు, సంవత్సరాలూ నీడ పట్టునే గడపటం పెరిగిపో తోంది. ఫలితం.. ఎంతో మందిలో ఎంతోకొంత విటమిన్-డి లోపం కనబడుతోంది. మన శరీరంలో, మన ఆరోగ్య పరిరక్షణలో ఈ విటమిన్-డికి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా... ఇది అస్సలు మంచి పరిణామం కాదు.
‘డి' విటమిన్ అనేది శరీరానికి క్యాల్షియం గ్రహించే శక్తినిస్తుంది. సూర్యకాంతి పడక, డి విటమిన్ తయారవక పోతే శరీరంలో క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. ఫలితంగా శరీరం దృఢత్వాన్ని కోల్పోతుంది. శరీరంలో క్యాల్షియమ్ కి భారీకాయానికి సంబంధముంది. భారీకాయం కలవారు క్యాల్షియం లోపం కలిగి ఉంటారు. కాబట్టి మీరు మీ పిల్లలతో సహా సాయంత్రపు ఎండలో సమీపంలోని పార్క్ లకు వెళ్లండి. ఇంటి పెరడు ఉంటే అక్కడ పిల్లలతో చేరి ఆటలాడండి. ఏసీ ఉన్న ఆఫీసుల్లో పనిచేసేవారు ఊబగా మారిపోవడానికి కారణం వారికి ఎండ తగలక పోవడమే..!!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
