స్త్రీల వక్షోజాల పరిమాణాన్ని పెంచే 8 ఆహారాలు

స్త్రీలలో ఎక్కువ ఆకర్షణ ఉన్న అవయవాలలో మొదటివి వక్షోజాలే. వక్షోజాల తర్వాతే ముఖ, శరీరాకృతి, రంగు ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. నిండైన వక్షోజాలున్న స్త్రీలలో సెక్సప్పీల్ పెంచుతుంది. అందుకే సినిమా స్టార్స్, మోడల్స్ ఇతర విషయాలతో పాటు శరీరసౌష్టవం, తీరైన వక్షోజాల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వక్షోజాలు చిన్నవిగా ఉన్న స్త్రీలలో కొంతమందికి ఆత్మన్యూనతాభావం పెరుగుతుండడం సహజమే. వక్షోజాల పరిమాణం మనిషి, మనిషికీ మారుతుంటుంది. ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

చాలామంది స్త్రీలు తమ వక్షోజాల పరిమాణాన్ని పెంచుకోడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అవి పెద్దగా మరియు అందంగా వుండి అందరిని ఆకర్షించటానికి సర్జరీలు సైతం చేయించుకోడానికి ప్రయత్నిస్తారు. అయితే, మహిళలు తమ వక్షోజాలను పెద్దవిగా చేసుకునేటందుకు, అందంగా చక్కటి షేప్ లో వుంచుకోడానికి సహజమైన ఆహారాలను తీసుకొంటే చాలు... మరి ఆ ఆహారాలేంటో చూద్దాం...

బార్లీ బియ్యం

బార్లీ బియ్యం

బార్లీ గింజలు అధికంగా ఉన్న కొవ్వును పీల్చుకొని శరీరం నుంచి వెలుపలకు పంపించి వేస్తాయి. ఇందులో వున్న అధిక మోతాదు పీచు పదార్థములుగా ఇవి మలబద్దకాన్ని నివారించి జీర్ణవ్యవస్థ విధులు మరియు కార్య నిర్వహణలో సహాయపడుతుంది. బార్లీ గింజలు అధికంగా ఉన్న ఆహారం రక్తంలో చక్కెర శాతం నియంత్రిస్తాయి. స్త్రీలలో ఋతు సమయంలో ఉత్పన్నమయ్యే గర్భాశయం మరియు అండాశయంకు సంబంధించిన సమస్యలలో ఎక్కువగా ఇవి సహాయపడతాయి.బార్లీ గింజలు అధికంగా ఉన్న కొవ్వును పీల్చుకొని శరీరం నుంచి వెలుపలకు పంపించి వేస్తాయి. బార్లీని కాల్షియం పదార్థాలతోను, చిక్కుళ్లు, మాంసం, పాలు, కోడిగుడ్లు వంటి వాటితో కలిపి తీసుకుంటే మంచిది. వీటిని కలిపి తీసుకోవటం ద్వారా బార్లీలో లేని లైసిన్‌ని భర్తీచేసినట్లవుతుంది. ఇది వక్షోజాలను పెరిగేందుకు సహాయపడుతుంది.

చికెన్

చికెన్

చికెన్ హెల్తీ ఫుడ్.శరీర నిర్మాణానికి మాంసకృత్తులు చాలా అవసరం. శారీరక పెరుగుదల, కండరాల పెరుగుదల, మెదడు, శరీర అవయవాలు ఆరోగ్యంగాను, సమర్ధవం తంగాను పనిచేయడానికి మాంసకృత్తులు చాలా అవసరం. పిండిపదార్థాల వల్ల శారీరకంగా కొంత మేరకు శక్తి కలుగుతున్నప్పటికీ శారీరక ఎదుగుదలకు కావలసిన మాంసకృత్తులు మాత్రం పిండిపదార్థాలలో కొంతవరకే ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ, సరి పడినంత మోతాదులో మాంసకృ త్తులు కలిగిన పదార్థాలను విధిగా తీసుకోవాలి. చికెన్‌ తింటే న్యూట్రీషన్స్‌తో పాటు విటిమిన్స్‌ ఫ్రీ. వక్షోజ పెరుగుదలకు దోహదం చేసే ప్రోటీన్స్‌కూడా సమృద్ధం. చికెన్ లో అమినో ఆసిడ్స్ అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పాల ఉత్పత్తులు-పాలు

పాల ఉత్పత్తులు-పాలు

పాలు లేదా క్షీరము (Milk) శ్రేష్ఠమయిన బలవర్ధక ఆహారము. ఇందులో అన్ని రకాలైన పోషక విలువలు ఉన్నాయి. కొద్దిగా విటమిన్ సి, ఇనుము తక్కువ. అన్ని వయసులవారూ తీసుకోదగ్గ ఉత్తమ ఆహార పదార్ధము. నిజానికి పాల వల్ల శరీరానికి కాల్షియం అందించడంలో బాగా ఉపయోగపడుతుంది.

ఫ్లేక్స్

ఫ్లేక్స్

ఫ్లాక్స్ లో హెల్త్ బెనిఫిట్స్ అధికంగా ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులను, క్యాన్సర్ వంటి రోగాలను ధరిచేరనివ్వదు. మధుమేహానికి బాగా పనిచేస్తాయి. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే శరీర సౌష్టవానికి బాగా దోహదం చేస్తుంది. ఇంకా ఇందులో లిగ్నట్స్ మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. కాబట్టి వీటి ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

వెజిటేబుల్స్

వెజిటేబుల్స్

వెజిటేబుల్స్‌ తక్కువేం కాదు ఆకుపచ్చ రంగులో ఊరించే బ్రకోలీ, పాలకూరల వంటి ఆకు కూరల వల్ల డబుల్‌ బెనిఫిట్‌. ఒకటి వీటిని తరచూ మీ ఆహారంలో భాగం చేయడం వల్ల ఎ, సి , కె వంటి విటమిన్లతో పాటు ఐరన్‌, కాల్షియం సము పాళ్లలో అందుతుంది. రెండవది మీ వక్షోజాలను పెంచడంలో కూడా పనిచేస్తాయి.

యాపిల్

యాపిల్

యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్న వారికి యాపిల్ మంచి ఆహారౌషధంగా పనిచేస్తుంది. పొటాషియం అధిక మొత్తాల్లో ఉండటంవల్ల మూత్రం హెచ్చు మొత్తాల్లో తయారై వెలుపలకు విసర్జితమవుతుంది. అలాగే, సోడియం నిల్వలను తగ్గించి రక్తపోటు తగ్గటానికి కారణమవుతుంది.

క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్

క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్

ఇలా ముదురు రంగుల్లో ఉండే బెర్రీస్ అంటే అందరీకీ చాలా ఇష్టమే. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్ లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని షుగర్ వ్యాది గ్రస్తులు తీసుకోవడం చాలా మంచిది.

బాదాం

బాదాం

బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్‌షేక్‌, ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం ఉంది. గుండెకు: పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకొంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది చక్కని యాంటీఆక్సిడెంట్‌.

Story first published: Wednesday, October 17, 2012, 19:01 [IST]
Desktop Bottom Promotion