Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
పలుచని పొట్టకు పండంటి ఆహారాలు!

పలుచని పొట్టకు 5 ఆహారాలు.
కాయలు - బాదం, వాల్ నట్స్, పిస్తా, మొదలైన నట్స్ శరీర కొవ్వును కరిగించేస్తాయి. బాదం పప్పు కూడా సమర్ధవంతంగా పలుచని పొట్టను సహజంగా ఇస్తుంది. వివిధ పోషకాలు కల ఈ కాయలు మీకు ఎపుడు ఆకలి వేసినా తినేయండి. ఇవి ఆరోగ్యకరం మరియు కడుపు నింపే స్నాక్స్ గా వుంటాయి.
బ్లాక్ బీన్స్ - మీ జీర్ణవ్యవస్ధ సరిగా పనిచేయకుంటే, ఆహారంలో బ్లాక్ బీన్స్ చేర్చండి. ఇవి పోషక విలువలు కలిగి శరీరంలోని మలినాలను విసర్జిస్తాయి.
గుడ్లు - ఉడికించిన లేదా పగులగొట్టిన గుడ్లు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తినండి. ఏ కష్టం లేకుండా పలుచని పొట్టకు ఇది మంచి ఆహారం. రీసెర్చర్ల మేరకు, గుడ్లు తింటే తేలికగా బరువుతగ్గుతారట. గుడ్లు లో అనేక పోషకాలుంటాయి. కడుపు నింపుతాయి.
డార్క్ చాక్లెట్ లు - వింటే ఆశ్చర్యపడతారు. కాని అది ఒక రహస్యమే. డార్క్ చాక్లెట్ లు తింటే పలుచని పొట్ట ఏర్పడుతుందట. ప్రత్యేకించి కోకో బీన్స్ తో చేసిన చాక్లెట్ లు లేదా వాటి పౌడర్ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కోకో గుండెను వ్యాధులనుండి రక్షించటమే కాదు శరీర కొవ్వు ఖర్చు చేసి బరువు తగ్గేలా చేస్తుంది.
పండ్లు - శరీరంలో కొవ్వు కరిగించుకోటానికి నిమ్మ పండ్లు, లేదా నిమ్మజాతివైన ఆరెంజ్ వంటివి తినండి. తేలికగా కొవ్వు కరిగిపోతుంది. వీటిలో పోషక విలువలు కూడా వుంటాయి. నిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్, బెర్రీలు ...బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు మొదలైన వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు వుండి శరీర కొవ్వు కరిగిస్తాయి. కనుక పలుచని పొట్ట పొందాలంటే ఈ పండ్లు తినండి.
ఈ చిట్కాలలోని పండ్లు తింటే....కఠినమైన డైటింగ్, గంటలతరబడి జిమ్ వ్యాయామాలు లేకుండానే అంగాంగ సౌందర్యం అద్భుతంగా పెంచుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
