Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
బ్లడ్ ప్రెజర్ సహజంగా తగ్గించే ఆహారాలు!
బ్లడ్ ప్రెజర్ లేదా అధిక రక్తపోటు అనేది తీవ్రంగా పరిగణించాల్సిన వ్యాధి. అధిక రక్తపోటులో రక్తనాళాలలో రక్తం నిరంతరం అధికమవుతుంది. అధిక రక్తపోటుకు కారణాలు అనేకం ఉంటాయి. అధిక రక్తపోటు, ఒత్తిడి, ఉప్పు అధికంగా తినటం, డాయాబెటీస్ వంటివి అధిక ర్తపోటుకు కారణాలుగా చెప్పవచ్చు. అధిక రక్తపోటు ఉంటే, గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అపుడు మీరు ఆహారం, మెడిసిన్ ల ద్వారా దానిని నియంత్రించాలి. డాక్టర్లు ఆరోగ్యకర ఆహారాన్ని సూచిస్తూ, కొన్ని మందులు వ్రాసి ఇస్తారు. అవి పాటిస్తే మీ రక్తపోటు స్ధాయి తగ్గుముఖం పడుతుంది.

విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు - ఆరెంజ్, కివి, క్రాన్ బెర్రీ, జామ, ద్రాక్ష మరియు స్ట్రా బెర్రీలలో విటమిన్ సి ఉంటుంది. చాలా స్టడీలలో విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే, అధిక రక్తపోటు తగ్గుతుందని నిరూపించబడింది. ఈ పండ్లు పచ్చివిగా లేదా వాటిని రసాలుగా తీసి తాగవచ్చు. మీ బ్లడ్ ప్రెజర్ సహజ నియంత్రణలో ఉండాలంటే, ప్రతిరోజూ విటమిన్ సి తీసుకోవాలి.
అరటి పండు - అరటి పండ్లు శరీర శక్తిని పెంచటమే కాదు బ్లడ్ ప్రెజర్ ను కూడా అదుపులో ఉంచుతాయి. అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కనుక ప్రతిరోజూ 1 లేదా 2 అరటిపండ్లు తినాలి. అంతకంటే అధికంగా తింటే వాటిలోని షుగర్ మీ శరీరంలోని షుగర్ స్ధాయి పెంచుతుంది. కనుక మితంగా తినండి.
పచ్చని ఆకు కూరలు - పచ్చని ఆకు కూరలలో పోషకాలు అధికం. వాటిలో ఐరన్ ఉంటుంది. ఇవి మీ అధిక రక్తపోటు తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ సి, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం మొదలైనవి ఉంటాయి. చర్మం మెరుపు పొందుతుంది.
వెల్లుల్లి - వెల్లుల్లి గుండె ఆరోగ్యానికి మంచిది. అధిక రక్తపోటు నియంత్రణకు ప్రతిరోజూ రెండు రెబ్బలు వెల్లుల్లి తినవచ్చు.
టమాటాలు - ఎర్రగా ఉండి మంచి రసాన్ని ఇచ్చే టమాటా పండులో ఎన్నో పోషకాలు, ప్రొటీన్లు ఉంటాయి. రక్తపోటు నియంత్రణకు ఈ పండు బాగా పని చేస్తుంది. వీటిలో వుండే లైకోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సహజంగా రక్తపోటు నియంత్రిస్తుంది. దీనిలో విటమిన్ సి,ఎ,ఇ, పొటాషియం, కాల్షియం వంటివి కూడా రక్తపోటు నియంత్రిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
