Latest Updates
-
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా..
మంచి అలవాట్లు కూడా చెడు కలిగిస్తాయి!

1. ప్రతిరోజూ వేడి నీటి స్నానం - వేడినీటి స్నానం శరీరానికి ప్రయోజనం చేకూరుస్తుంది అనే మాట వాస్తవమే. అయితే, ఆ వేడినీటి స్నానం ప్రతిరోజూ చేసినట్లయితే, అదికూడా ప్రతరోజూ సబ్బువంటి రసాయనాలతో శరీరాన్ని రుద్దినట్లయితే, చర్మంలోని జిడ్డు మాయమవుతుంది. చర్మం పొడిబారుతుంది. అంతేకాదు, కొన్ని చర్మ సంబంధిత ఇన్ ఫెక్షన్లు కలిగే అవకాశం కూడా వుంటుంది.
2. దంతాలు బ్రష్ చేసిన తర్వాత మరోసారి పుక్కిలించి ఉమ్మేయకండి - చాలామంది బ్రష్ తో దంతాలు, నోరు శుభ్రం చేసుకుంటారు. చివరిలో మరోమారు నోటిలో నీరు పోసి బాగా పుక్కిలించి ఉమ్మేస్తారు. అయితే ఒక డెంటిస్టు , డా. ఫిల్ లండన్ స్టెమ్మర్ మేరకు అది ప్రమాదం కాదుకాని బ్రష్ చేసిన తర్వాత టూత్ పేస్ట్ లోని ఒక లేయర్ నోటిలో చాలా సేపు వుంటే నోటికి అది మంచిది. కొద్ది సమయంపాటు, ఏ రకమైన ద్రవాలు కూడా నోటిలో పోయరాదు. మొదట్లో కొద్దిగా వాసన అనిపించినా, త్రవాతి సమయంలో మీకు అదిబాగానే వుంటుందంటారు డా. స్టెమ్మర్. అంతేకాదు తిన్నవెంటనే కూడా బ్రష్ చేయరాదు. కనీసం ఒక అరగంటపాటు వేచి వుండాలి. తిన్న ఆహారంలోని యాసిడ్లు, షుగర్లు మీ ఎనామెల్ ను బలహీన పరుస్తాయి. అలా బలహీనమైన ఎనామెల్ మీరు బ్రష్ చేసిన వెంటనే మరింత బలహీనపడి ఊడివచ్చే అవకాశం వుంది. కనుక తిన్న అరగంటకు ఎనామెల్ పై యాసిడ్ల ప్రభావం పూర్తయిన తర్వాత బ్రష్ చేయటం మంచిది.
3. టాయిలెట్ సీటు ఎలా ఉపయోగించాలి ? ఒక ఇజ్రాయిల్ సైంటిస్టు చేసిన పరిశోధన మేరకు నేటి ఆధునిక టాయిలెట్లు ఆరోగ్యానికి హానికరం. రీసెర్చర్ల మేరకు ఇండియన్ టాయ్ లెట్లపై హాయిగా కింద కూర్చోవటం మంచిదంటారు. ఇలా కూర్చుంటే, సహజంగా వుండటమే కాక, టెన్షన్ వుండదు. ఫలితంగా ఇది పేగు సమస్యలను కూడా తగ్గిస్తుంది. హెమ్మరాయిడ్లు, ఇతర వ్యాధులు తగ్గుతాయి. ఈ పరిశోధనా ఫలితాలు డైజెస్టివ్ డిసీజెస్ అనే మేగజైన్ లో ప్రచురించారు.
4. ఇంటిని శుభ్రం చేసుకోవడం - ఇంటిని తరచుగా శుభ్రం చేయడం మంచిదే. అది మన శరీరాన్ని బాగా కదిలిస్తుంది. అయితే, మీరు తరచుగా చీపురుతో శుభ్రం చేస్తూ వుంటే, అవి చెడు అలవాట్లుగా మారతాయి. ఎప్పుడూ ఈ వస్తువులు పట్టుకొని తరచుగా తిరుగుతూంటే, ఆస్తమా వస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. క్లీనింగ్ సొల్యూషన్లు, ఎయిర్ ఫ్రెషనర్లు వంటివి వారానికోమారు కొద్దిగా ఉపయోగించాలి తరచుగా వాడితే పెద్దలకు ఆస్తమా వస్తున్నట్లు తేలింది.
5. రాత్రి డిన్నర్ తర్వాత విశ్రాంతి - రోజంతా శ్రమించిన తర్వాత శరీరానికి విశ్రాంతి కావలసిందే. కాని అది డిన్నర్ తీసుకున్న వెంటనే అయితే హాని కలిగిస్తుంది. మీరు తీసుకున్న ఆహారం కొవ్వుగా శరీరంలో పేరుకుపోతుందంటారు కేంబ్రిడ్జి యూనివర్శిటీలోని హ్యూమన్ న్యూట్రిషన్ రీసెర్చి లేబోరేటరీ రీసెర్చర్లు. తిన్న వెంటనే నిద్రపోతే ఆహార గొట్టం సమస్యలుకలిగి కడుపులోకి తిన్నది మరోమారు గొట్టంలోకి వచ్చేస్తుంది. అంతేకాదు, మీరు పోయే నిద్ర గాఢమైనది కాక, మరుసటి రోజు లేచిన వెంటనే తాజాగా భావించరని కూడా రీసెర్చర్లు తెలుపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
