Latest Updates
-
టైమ్ తక్కువ, టేస్ట్ ఎక్కువ..లంచ్ బాక్సులకు పర్ఫెక్ట్ పుదీనా పులావ్ చేసేయండిలా -
మొహర్రం పవిత్ర మాసం సందర్భంగా మీ ప్రియమైన వారికి విషెస్ ఇలా తెలియజేయండి.! -
గుండెకు బ్యాడ్ మార్నింగ్.. ఆ సమయాల్లో ఆహార ఎంపికలతో పెను ముప్పు.! -
జూన్ 26 సాయంత్రం ఈ 5 రాశుల వారికి అదృష్టం.. ధనయోగం, కెరీర్ సక్సెస్ మీ సొంతం! -
ఈరోజు సాధ్య యోగం.. ఈ పనులు మొదలుపెడితే తిరుగులేని విజయం మీదే! -
ఒత్తిడికి గురవుతున్నారా.. ఇది మీ జుట్టుపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసా.? -
హిందూ ధర్మంలో క్షేత్రపాలక దేవతల పాత్ర ఏమిటి? -
వృశ్చిక రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త! -
ఇడ్లీ, దోశలు కాదు..జుట్టు రాలడం తగ్గించి, రోగనిరోధక శక్తి పెంచే సూపర్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కరివేపాకు ఉప్మా.. -
తుల, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ ధనలాభం! - శుక్రవారం, 26 జూన్ 2026
పుల్లని...కమ్మని మజ్జిగలోని ఆరోగ్య ప్రయోజనాలు...!
మజ్జిగ అనేది పానీయం. ఇది పాల ఉత్పత్తుల నుండి తయారయ్యేవి. మజ్జిగ భారత దేశంలో ఒక ముఖ్యమైన పానీయం. దక్షిణ భారతదేశంలో వీటి వాడం ఎక్కువ. ఎందుకంటే మజ్జిగ చాలా ఆరోగ్యకరమైన మరియు పౌష్టిక పానీయం. మజ్జిగకు కొన్ని సుగంధ ద్రావ్యాలు జోడించి తయారు చేస్తారు. మజ్జిగ తయారీలో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఉప్పు, పెప్పర్, పచ్చిమిర్చి , అల్లం జోడించి మసాలా మజ్జిగన తయారు చేస్తారు. మజ్జిగ - పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు కనుక పెద్ద వయసువారికి మంచి చేస్తుంది. పెరుగుకి బరువునీ, కఫాన్నీ పెంచే గుణాలు ఉంటాయి. మజ్జిగ ఆరోగ్యానికి అమృతంలాంటిది. మజ్జిగ తీసుకోవడం వలన పలు జబ్బులను దూరం చేస్తుంది. బజార్లో లభించే శీతలపానీయాలకన్నా మజ్జిగ లక్షలరెట్లు మంచిది.
మజ్జిగతో ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా ఊబకాయంతో సతమతమయ్యేవారు ప్రతి రోజు మజ్జిగను సేవిస్తుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగలోనున్న ల్యాక్టిక్ ఆమ్లం ఉండటంతో శరీరంలో కొవ్వు పెరగకుండా నిరోధిస్తుంది. మీరు తీసుకునే ఆహారం సాఫీగా జీర్ణమయ్యేందుకు తోడ్పడుతుంది. మజ్జిగ తీసుకోవడం వలన శరీరంలో కొవ్వు పెరుగుతుందని చాలామంది అనుకుంటుంటారు. కాని నిత్యం మీరు తీసుకునే పాలకన్నా ఇందులో కొవ్వు, కెలొరీల శాతం చాలా తక్కువగా ఉంటాయి. శరీరంలోనున్న వేడిని తగ్గించేందుకు మజ్జిగ ఉపయోగపడుతుంది.

క్యాల్షియం: మజ్జిగ డైరీ ప్రొడక్ట్, ఇందులో అధిక శాతంలో క్యాల్షియం ఉంటుంది. క్యాల్షియం ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. మరియు అంతేకాదు. శరీరవృద్దికి బాగా సహాయ పడుతుంది. ఎముకలకు కావల్సిన బలాన్ని ఇచ్చి ఎముకుల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఆహారంతో పాటు మజ్జిగ తీసుకోవడం చాలా ఆరోగ్యకరం.
అసిడిటిని-వాపును తగ్గిస్తుంది: మీ శరీరంలో లాక్టోజ్ సరైనపాళ్ళలో లేనప్పుడు మజ్జిగ తాగినప్పుడు మీ కావల్సిన లాక్టోజ్ ను అందిస్తుంది. ఇది కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా ఎసిడిటి, వాతం, గుండెలో మంటగా ఉండటం వంటి వాటిని తగ్గిస్తుంది. అంతే కాదు తిన్న ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
శరీరాన్ని తేమగా ఉంచుతుంది: మలబద్దకాన్ని తగ్గిస్తుంది మరియు శరీరానికి కావల్సిన తేమను అంధిస్తుంది. మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు. అలాగే మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది: శరీరం అనారోగ్యం పాలు కాకుండా కాపాడేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మజ్జిగలో లాక్టోజ్ మరియు కార్బోహైడ్రేట్స్ రోగనిరోధక శక్తి పెరుగుపడేలా చేస్తుంది. శరీరానికి కావల్సిన శక్తినిస్తుంది.
అధిక విటమిన్స్ ఉన్న డ్రింక్: మజ్జిగలో అధిక శాతంలో విటమిన్ సి, ఎ, ఇ, కె మరియు బిలు మరియు థైయమిన్, రెబోఫ్లోవిన్, నయాసిన్, ఇలాంటివి అధికంగా కలిగి ఉంటాయి. ఈ విటమిన్లు అన్నీ మీశరీరానికి కావల్సిన పోషకాల్ని అందించడమే కాకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుాయి.
మినిరల్స్: మజ్జిగలో మినిరల్స్ యొక్క ప్రయోజనం కూడా అధికంగా ఉంటుంది. ఇది ఐరన్, భాస్వరం, జింక్, పొటాషయం అధిక శాతంలో కలిగి ఉంటాయి.
కెలోరీలు తక్కువ: మీరు కనుక డైయట్ పాటిస్తుంటే ప్రతి రోజూ ఒక గ్లాసు మజ్జిగ తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే వీటిలో జీర్ణశక్తిని పెంచే విటమిన్స్ ఉండటమే కాక, క్యాలరీలు, ఫ్యాట్స్ తక్కువగా ఉంటాయి. వెన్న తీసిన పాలుతో తయారు చేసె పెరుగు లేదా మజ్జిగా డైటేరియన్స్ కు చాలా ఆరోగ్యకరం. ఇది బరువును తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది.
వేసవి పానీయం: శరీరం శక్తిని కోల్పోయినప్పుడు, పొడిబారుతున్నప్పుడు, దాహంగా ఉన్నప్పుడు ముఖ్యంగా వేసవి కాలంలో ప్రతి రోజూ ఒకటి లేదా రెండు గ్లాసుల మజ్జిగ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన తేమను అందించి శక్తి పుంజుకొనేలా చేస్తుంది. సూర్యతాపం నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి కూడా మజ్జిగ ను తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications