Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్‌వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
హై బి.పిని ఇలా కంట్రోల్ చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి

పని ఒత్తిడి, శారీరకశ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, స్థూలకాయం...అధికరక్తపోటుకు కారణమవుతున్నాయి. కారణం ఏదైనా బి.పి పెరిగిపోయి ప్రమాదకర పరిస్థితి వచ్చే వరకు గుర్తించలేకపోతున్నారు. బి.పి ఉందని తెలిసిన తరువాత దాన్ని తగ్గించుకోవడానికి నానా పాట్లు పడుతుంటారు. అయితే మందుల వరకు వెళ్లకుండా ఆహారంలో మార్పు చేసుకోవడం ద్వారా బి.పిని కంట్రోల్ చేసుకోవచ్చని ఇటీవల జరిపిన అధ్యయనంలో వెల్లడయింది. కాబట్టి మనం తినే ఆహారంలో జాగ్రత్తలు పాటిస్తూ, వ్యామామం చేస్తుంటే ఈ బి.పి. నుండి మనల్ని మనం కాపాడుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఆరోగ్యానికి హాని చేసే ఆహారాన్ని, దాంతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి మంచి ఆహారం తిన్నామంటే సరి, హై బి .పి ని కూడా మనం మన కంట్రోల్ లో పెట్టుకోవచ్చు .
1. ఖర్బూజ : హై బిపి నివారణలో ఖర్బూజా చాలా ముఖ్యమైన ఆహారం, ఖర్బూజా గింజలను రోస్ట్ చేసి లేదా ఎండబెట్టి తినడం వల్ల రక్త నాళాల్లో ఉన్న ప్రెజర్ తగ్గి బి.పి. కంట్రోల్ లో ఉంటుంది.
2. నిమ్మకాయ :నిమ్మకాయ హై బి.పి. ఉన్నవారికి చాలా విలువైన ఔషధం , ఎందుకంటే ఉసిరికాయలో ఉండే విటమిన్ పి, బి. పి. ని కంట్రోల్ చేసి, రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది
3. వెల్లుల్లి: హై బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో వెల్లుల్లి ఔషధంలా పని చేస్తుంది. అది బి.పి. ని తగ్గించి శరీరంలోని జీవక్రియలను సమతుల్యం చేస్తుంది . పల్స్ రేట్ , గుండె వేగాన్ని అదుపులో ఉంచుతుంది . అంతేకాదు రోజు ఉదయాన్నే పరగడుపున మూడు వెల్లుల్లి రేకులను మింగితే రోజంతా చలాకీగా ఉంచి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా దరి చేరకుండా చూస్తుంది.
4. బ్రౌన్ రైస్: చాలామంది కాస్త బరువు పెరగానే అన్నం తినడమంటేనే భయపడుతుంటారు , కానీ బ్రౌన్ రైస్ లో ఉండే కాల్షియం, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందునా హై బి.పి ఉన్నవారికి ఇది పూర్తిగా సోడియం రహిత ఆహారం, కాబట్టి నిర్భయంగా తినవచ్చు. ఇది నరాలను రిలాక్స్ చేసి రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది.
5. కొత్తిమీర : కొత్తిమీర లో ఉన్న ఔషధ గుణాలు బి.పి. ని అదుపులో ఉంచుతాయి. కొత్తిమీర జ్యూస్ ను రోజుకు ఒకసారి తాగినా చాలు, బి పి కంట్రోల్ లో ఉంటుంది.
6. కూరగాయలు : కూరగాయల జ్యూస్ ముఖ్యంగా క్యారట్ జ్యూస్ గానీ, పాలకూర జ్యూస్ గానీ కలిపి గానీ విడివిడి గా కానీ తీసుకోవడం వల్ల బి.పి. పేషెంట్స్ కి చాలా రిలీఫ్ గా ఉంటుంది. 300 మీ.లీ. ల క్యారట్ జ్యూస్ మరియు 200 మీ.లీ. పాలకూర జ్యూస్ 500 మి.లీ. లీటర్ నీటిలో కలిపి రోజూ తాగడం వల్ల బి పి లెవెల్ లో ఉంటుంది.
7. బంగాళాదుంప: బంగాళా దుంపలు బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో అద్భుతంగా పని చేస్తాయి. బంగాళాదుంపల పొట్టు తీయకుండా ఉడికించడం వల్ల అందులో ఉండే పొటాషియం వల్ల ఉప్పు వేయకపోయినా ఉడికిన బంగాళాదుంపలు ఉప్పగా ఉండి రుచిగా ఉంటాయి. కాబట్టి బంగాళా దుంపలను రోజుకు ఒకసారైనా ఆహారంలో భాగమయ్యేలా జాగ్రత్తపడాలి.
8. ఉసిరికాయ: ఉదయం పూట పరగడుపునే ఒక టేబుల్ స్పూన్ ఉసిరి రసంలో కాస్త తేనె కలుపుకుని తాగితే బి. పి. లెవెల్ అవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
9. పైన చెప్పిన డైట్ తో పాటు మరొక సలహా ఏమిటంటే హై బి.పి ఉన్నవారు తినే రొటీన్ ఆహారంలో కాల్షియం , ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడంతో పాటు సోడియం ఉన్న ఆహారాన్ని పూర్తిగా వదిలేసినా మంచిదే.
10. మరొక ముఖ్య గమనిక : హై బి. పి కేవలం మనం తినే ఆహారం వల్లే కాదు, నిద్ర సరిగ్గా లేకపోయినా, స్ట్రెస్ ఎక్కువైనా తిరగబడే అవకాశముంది, కాబట్టి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి..
11. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సోయా లేదా మిల్క్ ప్రొటీన్ బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవ్తేల తాజా పరిశోధనల్లో వెల్లడయింది.
12. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ల స్థానంలో సోయా లేదా మిల్క్ ప్రొటీన్ తీసుకుంటే హై బి.పి కి చెక్ పెట్టవచ్చని నిర్ధారణ అయింది. రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ సప్లిమెంట్లు తీసుకున్న వారితో పోల్చితే మిల్క్ ప్రొటీన్ సప్లిమెంట్లు, సోయా ప్రొటీన్ సప్లిమెంట్లు తీసుకున్న వారిలో సిస్టోలిక్ బ్లడ్‌ప్రెషర్ తక్కువగా ఉన్నట్లు వెల్లడయింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications