Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఎప్పటికి జబ్బు పడకుండా... ?

1. వ్యక్తిగత పరిశుభ్రత - జబ్బు పడకూడదంటే...ఇది చాలా ప్రధానమైంది. చెమట లేని మంచి దుస్తులు, క్రిమి సంహారక సబ్బులు, మీ స్వంత దువ్వెనలు, బ్రష్ లు, వాడటం ప్రతిరోజూ స్నానం చేయడం, దంతాలు ప్రతిరోజూ రెండు సార్లు శుభ్రం చేయటం, వాడేసిన వస్తువులు పారవేయడం వంటివి చేయాలి.
2. జబ్బు పడ్డ వారికి దూరంగా - కుటుంబ సభ్యులలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే, వారు ఉపయోగించే వస్తువులు వేరుగా వుంచమనండి. వేరు పడక, దుస్తులు వంటివి ఏర్పరచాలి. పిల్లలు అనారోగ్యంగా వుంటే, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, టిష్యూ వాడటం వంటివి చేయాలి.
3. బజారు తిండి తినకండి - ఎంత తినాలనిపించినప్పటికి బజారులో దొరికే ఆహార పదార్ధాలు తినకండి. నీరు కూడా వేరే ప్రదేశాలది తాగకండి. సీలు వేసిన మినరల్ వంటివి వాడవచ్చు.
4. హెర్బల్ టీ - ప్రతిరోజూ ఒక కప్పు హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ లేదా లెమన్ టీ వంటివి తాగితే రోగ నిరోధక వ్యవస్ధ మెరుగవుతుంది. ఆరోగ్యంగా వుంటారు.
5. రిలాక్స్- రిలాక్స్ అయ్యే మార్గాలు ఆచరించండి. ఏ జబ్బునైనా సరే చక్కటి సంగీతం తగ్గించేస్తుంది. మీ కిష్టమైన పాటలు, ఇతర వాయిద్యాలు విని రిలాక్స్ అవండి. మంచి నిద్ర మిమ్మల్ని జబ్బులనుండి కాపాడుతుంది.
6. వైద్యుల సలహా - మీ ప్రాంతంలో ఫ్లూ, లేదా వ్యాప్తి చెందే ఇతర జబ్బులు వుంటే, తక్షణమే వైద్యుల సలహా పొంది అవి రాకుండా తగిన మందులు వాడండి. మీ ప్రాంతంలో ఇతరులకు కూడా తగిన సలహా నిచ్చి వ్యాప్తి చెందే రోగాలకు దూరంగా వుండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications