Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అబ్భా......ఒత్తిడి నన్ను తినేస్తోంది....?

ఈ రకంగా ప్రతి ఒక్కరికి, ఒత్తిడి, ఆందోళన, మానసిక వేదన అనేవి సాధారణమయ్యాయి. జీవితం అంటే పరమ బోర్ అంటారు. నిరాశ పడుతూంటారు. రోజు రోజుకూ మానసిక ఆరోగ్యం దిగజారుతూ వుంటుంది. ఈ రకమైన ఒత్తిడి, ఆందోళనలతో శరీర నొప్పులు, గ్యాస్ సంబంధిత సమస్యలు, అధిక బరువెక్కటం లేదా బరువు బాగా తగ్గిపోవటం వంటివి కూడా ఏర్పడతాయి. కనుక, అన్నిటికంటే ముందుగా వచ్చే టెన్షన్ తలనొప్పిని ఎలా తగ్గించుకుని ప్రశాంతంగా వుండాలో చూడండి.
టెన్షన్ తలనొప్పులను ఒత్తిడి తలనొప్పి అని కూడా అంటారు. సాధారణంగా ఇది నుదుటి భాగం, కణతలు, కళ్ళు పై నొప్పులు చూపుతుంది. పురుషులకంటే కూడా మహిళలు దీనికి అధికంగా గురవుతారు. ఈ నొప్పి కొన్ని గంటలనుండి కొన్ని రోజులు, వారాలు కూడా కొనసాగే అవకాశం వుంది. కారణాలు పరిశీలిస్తే, అనేకంగా వుంటాయి. ప్రత్యేకించి ఇది వంశానుగతంగా కూడా చెప్పచ్చు. లేదా మానసిక వేదన కూడా తలనొప్పి కలిగిస్తుంది. ఈ రకమైన నొప్పికి ఆకలి, అలసటలు కూడా కారణం కావచ్చు. కలుషిత గాలి కూడా బ్రెయిన్ పై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి పెంచి అలసట పొందేలా చేస్తుంది. కుటుంబ సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు, పని ఒత్తిడి వంటివి సాధారణంగా దీనిని కలిగిస్తాయి.
టెన్షన్ తోకూడిన ఈ తలనొప్పిని తగ్గించడమెలా?
1. సహజంగా తగ్గించే ఆహారాలు - చాక్లెట్ లు, కేఫైన్, గ్రీన్ టీ వంటివి ఆరోగ్యానికి హానిలేకుండా తగు మాత్రంగా తీసుకుంటూ ఉంటే కుంగిన మనసును ప్రశాంతపరుస్తాయి.
2. శరీరానికి కొద్దిపాటి మసాజ్, వేడినీటి అభ్యంగన స్నానం శరీరానికి, మైండ్ కు కూడా రిలీఫ్ ఇస్తాయి..
3. క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేయటం, రిలాక్స్ అవటం, వ్యాయామాలు వంటివి కూడా టెన్షన్ తలనొప్పి తగ్గేందుకు తోడ్పడతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications