Latest Updates
-
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.!
సంతోషం కోరే మీరు....సంతోషమే సగం బలం!

మీరు ఎంత ఆనందం మిగుల్చుకుంటారో అదే మీ వ్యక్తిత్వం అంటుంది మన విజ్ఞానం. అంటే మీ ఆలోచనలు, ఆలోచనా ప్రక్రియ మరియు ప్రవర్తన. కనుక మీరు సంతోషం అనేది నేర్చుకోవచ్చు. పుడుతూనే ఆ గుణం ఎవరికి రాదు. ఇక ఆస్తి, అయిశ్వర్యం మొదలైనవి కొంత కాలం మీకు సంతోషాన్నిస్తాయి. కాని ఎప్పటికి కాదు. వాస్తవం ఏమంటే, సంతోషం ఏ ఒక్క అంశం లోను పూర్తిగా లేదు. మీ ఎంపికలన్నీ కలిపితే వచ్చేదే సంతోషం.
సంతోషాన్ని దిగువ అంశాలలో కలిగించుకోవచ్చు.
- కుటుంబ సభ్యులు, స్నేహితులతో గడిపి
- ఉన్నదానికి ఆనందిస్తూ
- ఆశావహ ప్రవర్తనతో
- ఒక లక్ష్యం కొరకు పాటుపడుతూ
- ఆ క్షణంతో జీవిస్తూ
కనుక సైన్సు మేరకు మీ ఆలోచనలు, ఎంపికలు, చర్యలు మీ ఆనందపు స్ధాయిని నిర్ణయిస్తాయి.
కనుక సంతోషంగా వుండాలంటే ఏం చేయాలి?
సంబంధాలను పెంచుకోండి.
సంతోషంగా వుండే వారి పక్కన వుండండి. సాధారణంగా వీరు కుటుంబంలోను, స్నేహితులలోను దొరుకుతారు. వీరు మిమ్మల్ని కష్టకాలంలో కూడా ఆదుకుంటారు. ఈ సంబంధాలను మీరు పెంచిపోషించాలి. వారు చేసింది మీరు ప్రశంసించండి. మీరు వారికి చేయండి.
మీకున్న దానికి కృతజ్ఞతాభావం కలిగి వుండండి. ధ్యాంక్ యూ అనటమే కాదు. మీకు ఇతరులు చేసిన మేలుకు రుణపడి వుండండి. దీనిని ఒక సాధనగా భావించండి. మీకు అంతులేని ఆనందం కలిగేలా చేస్తుంది.
ఆశా దృక్పధం కలిగి వుండండి. ఈ ప్రపంచంలో ఎన్నో చెడు ఘటనలు జరుగుతున్నాయి. జరుగుతూనే వుంటాయి. అయినప్పటికి మీరు ఆవ కలిగి వుండాలి. అంతా మంచి జరుగుతుందన్న భావనలు వెల్లడించండి. పాజిటివ్ గా చూడండి. నెగెటివ్ అంశాలో మీలోకి రానీయకండి. అవి మైండ్ కి వస్తే కొద్ది సెకండ్లు ఆగండి, రిలాక్స్ అవండి. ఈ ప్రశ్నలు వేసుకోండి.
- పరిస్ధితి నేననుకున్నంత చెడుగా వుందా?
- ఈ పరిస్ధితి మార్చటానికి మరో మార్గం వుందా?
- ఈ అనుభవం నుడి భవిష్యత్తుకు నేను ఏం నేర్చుకున్నాను?
మీ లక్ష్యం గుర్తించండి - జీవితానికి ఒక లక్ష్యం వుండాలి. అది గార్డెనింగ్ నుండి సోషల్ వర్క్ దాకా ఏదైనా కావచ్చు. లక్ష్యం మీ కోరిక పూర్తిచేస్తుంది. మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. కొత్త వారిని కలిసేలా చేస్తుంది.
ఉన్న క్షణాన్ని ఆనందించండి. ఆనందం కొరకు వాయిదా వేయకండి. ఎపుడో వస్తుందని చూడకండి. అది రాకపోవచ్చు. చిన్న ఆనందాలు జీవితంలో అనుభవించేయండి. గతం గురించి బాధ పడకండి. భవిష్యత్తుకై ఆందోళన చెందకండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications