రెడ్ ఫుడ్ తినండి... జీవిత కాలం ఆరోగ్యంగా జీవించండి...

మనం సాధారణంగా మన డైయట్ గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా గ్రీన్ వెజిటేబుల్స్, గ్రీన్ లీవ్స్, వెజిటేరియన్ ఫుడ్, గురించే మాట్లాడుతుంటాం. అయితే మన ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో రెడ్ ఫుడ్(ముదురు ఎరుపు రంగు ఆహారాలు)కూడా చేర్చాలని చాలా మందికి తెలియదు. రెడ్ ఫుడ్ కు ఉన్న ప్రాధాన్యత గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, రెడ్ ఫుడ్ అంటే వినడాని కొంచెం వింతగా వున్నా ఈ ఆహారాల్లో చాలా న్యూట్రిషియన్ ఉంటాయి. కాబట్టి మీ డైయట్ లో తప్పనిసరిగా రెడ్ ఫుడ్ చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం..

ఈ రెడ్ ఫుడ్ లో అధిక శాతం మినిరల్స్, విటమిన్స్, యాంటీఆక్సిడెంట్ మరియు న్యూట్రియట్స్ అధిక మోతాదాలు శరీరానికి కావలసినంత అందిస్తుంటాయి. రెడ్ ఫుడ్ అంటే క్రేన్ బెర్రీస్, టమోటో వంటి సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. ఆరోగ్యంగా జీవిచండానికి కొన్ని రకాలైన రెడ్ ఫుడ్ లను ప్రతి దినం ఆహారంతో పాటు తీసుకోవడం చాలా మంచిది. రెడు ఫుడ్ ను ఎంపిక చేసుకొనేటప్పుడు వాటి రంగు ముదురు వర్ణంలో ఉన్నవి ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ ముదురు రంగు కల రెడ్ ఫుడ్స్ లో ఎక్కువ శాతం న్యూట్రిషియన్స్ ఉంటాయి కాబట్టి వాటి మాత్రమే ఆహారంతో పాటు తీసుకోవాల్సి ఉంటుంది. రెండ్ ఫుడ్స్ లో కావల్సినన్ని విటమిన్స్, న్యూట్రిషియన్స్, మినరల్స్, రంగు మాత్రామే కాదు రెడ్ గా ఉన్నటువంటి ఆహారాలు తప్పనిసరిగా అద్భుతమైన రుచి, తియ్యటి వాసనను కలిగి ఉంటాయి. అది వాటి స్వభావం.

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే..అందుకు భద్రత చాలా అవసరం ఎందుకంటే అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి. శరీరంలో ప్రతి ఒక్క అవయవం ప్రధానమైనవి కాబట్టి అవి అనారోగ్యం పాలవకుండా కాపాడుకోవల్సిన బాధ్యత కూడా మనదే. ఏటువంటి వ్యాధులు, జబ్బుల భారీన పడకుండా కాపాడగలిగే శక్తి ఒక్క రెడ్ ఫుడ్ లలో మాత్రమే కలదు. కొన్ని రెడ్ ఫుడ్సైనటువంటి బెల్ పెప్పర్ మరియు బెర్రీస్, ఆపిల్స్ వంటివి గుండెకు చాలా ఆరోగ్యకరం. వీటిని మనం అలాగే పచ్చివాటిని తినవచ్చు లేదా జామ్, జెల్లీ మరియు పికెల్స్ రూపంలో తినవచ్చు. అంతే కాదు సలాడ్స్ రూపంలో కూడా తీసుకోవచ్చు...

ఎర్రని ద్రాక్ష

ఎర్రని ద్రాక్ష

ఎర్రని ద్రాక్ష అధిక శాతం న్యూట్రిషియన్స్ కలిగి ఉంటుంది. అందులోనూ విటమిన్ సి, యాంటిఆక్సిండెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండెను సంరక్షించుటలో బాగా పనిచేసి, లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను సమతుల్యతకు ఉపయోగపడుతాయి. ద్రాక్ష పండ్లలోని టన్నీస్, పాలిఫినాల్స్ క్యాన్సర్ సంబంధిత కారకాలపై పోరాడుతాయి.

టమోటో

టమోటో

టమోటో: వెజిటేబుల్స్ లో అధిక పోషకవిలువలు కలిగినటువంటింది టమోటో. ఇందులో విటమిన్ సి అధికంగా కలిగి ఉండి, బరువును తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందులోని బీటా కెరోటిన్ క్యాన్సర్ కణాలతో పోరాడి, క్యాన్సర్ బారీన పడకుండా సహాయపడుతుంది.

వాటర్ మెలోన్(పుచ్చకాయ)

వాటర్ మెలోన్(పుచ్చకాయ)

వాటర్ మెలోన్(పుచ్చకాయ): పుచ్చకాయను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత ఏ ఇతర జబ్బులను ధరిచేరనివ్వదు. పుచ్చకాయలో ఉన్నటువంటి విటమిన్స్, మినిరల్స్ రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా ఉపయోగపడుతాయి. పుచ్చకాయ (వాటర్ మెలోన్), మస్క్ మెలోన్, లేదా హనీడ్యూ ఇవన్నీ ఒకే జాతికి చెందినటువంటి పండ్లు. వీటిలో విటమిన్ బి మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి. అలాగే బీటా కెరోటి, పొటాషియం మరియు లైకోపిపిన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యాన్నికి చాలా మంచిది. మీ శరీరం ఆరోగ్యంగా ఉంచడానికి కావలసినన్ని విటమిన్లు అంధిస్తుంది.

దానిమ్మ

దానిమ్మ

దానిమ్మ: దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. అత్యంత ఔషధ విలువలతో పాటు కమ్మని రుచిని దానిమ్మ నుంచి పొందవచ్చు. విటమిన్ ఇ, మెగ్నీషియం, పొటాషియం ఇందులో అధికం గా ఉంటుంది.

క్రేన్ బెర్రీస్

క్రేన్ బెర్రీస్

క్రేన్ బెర్రీస్: క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్: ఇలా ముదురు రంగుల్లో ఉండే బెర్రీస్ అంటే అందరీకీ చాలా ఇష్టమే. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్ లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని షుగర్ వ్యాది గ్రస్తులు తీసుకోవడం చాలా మంచిది.

యాపిల్

యాపిల్

యాపిల్: యాపిల్స్‌లో ఫైబర్ ఎక్కువగానూ, కొవ్వు పదార్థాలు అత్యల్పంగానూ ఉంటాయి. సోడియం తక్కువగానూ, పొటాషియం ఎక్కువగానూ ఉంటాయి. విటమిన్ సి అధిక మొత్తాల్లో ఉంటుంది. రక్తపోటు ఎక్కువగా ఉన్న వారికి యాపిల్ మంచి ఆహారౌషధంగా పనిచేస్తుంది. పొటాషియం అధిక మొత్తాల్లో ఉండటంవల్ల మూత్రం హెచ్చు మొత్తాల్లో తయారై వెలుపలకు విసర్జితమవుతుంది. అలాగే, సోడియం నిల్వలను తగ్గించి రక్తపోటు తగ్గటానికి కారణమవుతుంది.

రాస్బెర్రీ

రాస్బెర్రీ

రాస్బెర్రీ: బెర్రీస్ లో ఇది కూడా ఒక రకమైనటువంటి పండే. ఇది ముఖ్యంగా అధిక బరువును తగ్గించుటలో బాగా పనిచేస్తుంది. మరియు కంటి చూపును బాగా మెరుగు పరుస్తుంది.

ఎండు మిర్చి

ఎండు మిర్చి

ఎండు మిర్చి: ఎండు మిర్చిలో అతి తక్కువ సాచురేటెడ్ ఫాట్స్ కలిగి ఉండి, శరీరంలో పేరుకొన్న ఎక్సట్రా కొలెస్ట్రాల్ ను బర్న్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది.

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీ: స్ట్రాబెర్రీ హై బ్లెడ్ ప్రెజర్, ఆర్థెటీస్, గౌట్, గుండె సంబంధిత రోగాలను రాకుండా కాపాడుతుంది.

బీట్ రూట్

బీట్ రూట్

బీట్ రూట్: బీట్ రూట్ లో ఐరన్, క్యాల్షియం, ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఈ ఎర్రని వెజిటేబుల్ రక్తాన్ని వద్ది చేయడానికి బాగా సహాపడుతుంది.

చెర్రీస్

చెర్రీస్

చెర్రీస్: చెర్రీ పండ్లలో యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా కలిగి ఉండటం వల్ల దీర్ఘకాలిక వాపు, కీళ్ళనొప్పులు, కీళ్ళ వాపు వంటి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే రోజుకు రెండుసార్లు చెర్రీపండ్ల రసాన్ని తీసుకోండని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకు 12 చెర్రీ పండ్లను తీసుకోవచ్చు.

కొన్ని రకాలైటువంటి రెడ్ ఫుడ్స్ రక్తాన్ని బాగా వద్ది చేస్తుంది. అందుకు కావలసిన న్యూట్రిషియన్స్ శరీరానికి అందించి రక్తప్రసరణకు సహాయపడుతుంది. అంతేకాదు శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. క్యాన్సర్ బారీన పడుకుండా కాపాడుతాయి. శరీరంలో హానికరమైన ఆక్సీకరణం నుండి డిఎన్ఏ ను రక్షిస్తుంది. చాలా రకాల ఎర్రని పండ్లలో ఎక్కువగా సి విటమిన్ ఉండటం వల్ల కంటి చూపుకు బాగా సహాయపడుతుంది. కంటి సమస్యలు ఏర్పడకుండా అడ్డుకొంటాయి. ఇంకా ఈ ఎర్రని పండ్ల ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉండటం వల్ల ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ నుండి కాపాడుతాయి. కాబట్టి ఇన్ని రకాలుగా శరీరానికి, ఆరోగ్యానికి ఉపయోగపడే రెడ్ కలర్ ఫుడ్స్ ను తప్పని సరిగా మీ డైయట్స లో చేర్చుకోవడం చాలా మంచిది...మరీ ఆ రెడ్ కలర్ ఫుడ్స్ ఏంటో చూద్దాం...

Desktop Bottom Promotion